కెనడా దేశం కననాస్కిస్ లో జూన్ 17న జరిగిన 51వ జీ-7 సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ మోదీ, ఇటలీతో బలమైన స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని, ఈ బంధం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం కలిగించగలదని పేర్కొన్నారు.
ఎక్స్ సామాజిక వేదిక పై ఇటలీ ప్రధానమంత్రి పోస్టుకి స్పందిస్తూ:
“ప్రధానమంత్రి జార్జియా మెలొనీ గారూ... మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం. ఇటలీతో బలమైన స్నేహ బంధాన్ని భారత్ కొనసాగిస్తుంది. ఈ స్నేహం ఇరు దేశాల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలని అందిస్తుంది @GiorgiaMeloni” అనిశ్రీ మోదీ పేర్కొన్నారు.
Fully agree with you, PM Giorgia Meloni. India’s friendship with Italy will continue to get stronger, greatly benefitting our people!@GiorgiaMeloni https://t.co/LaYIIZn8Ry
— Narendra Modi (@narendramodi) June 17, 2025


