బీహార్లోని మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతీజీ మహారాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దర్శించుకున్నారు. మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు. ఆయన ఆప్యాయత, ప్రేమ, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ వేదికగా ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతీజీ మహారాజ్ ఆశీర్వాదాలను పొందే అదృష్టం నాకు లభించింది. తేజస్సు, శక్తితో ఆయన వ్యక్తిత్వం నిండి ఉంటుంది. ఆయన ప్రసంగంలో ఆధ్యాత్మికత ప్రవహిస్తుంది. మహరాజ్ జీ ఆత్మీయత, స్నేహం, మార్గదర్శకత్వంతో నా మనసు నిండిపోయింది!”
आज मोतिहारी में स्वामी शक्ति शरणानंद सरस्वती जी महाराज से आशीर्वाद लेने का सौभाग्य मिला। उनके व्यक्तित्व में जहां तेज और ओज का वास है, वहीं वाणी में आध्यात्मिकता रची-बसी है। महाराज जी की आत्मीयता, स्नेह और मार्गदर्शन से अभिभूत हूं! pic.twitter.com/7PTxDNv0tH
— Narendra Modi (@narendramodi) July 18, 2025


