కెనడాలో కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మెక్సికో అధ్యక్షురాలు డాక్టర్ క్లౌడియా షైన్‌బామ్ పార్డోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ నేతలు ఇద్దరూ సమావేశం కావడం ఇదే మొదటి సారి. మెక్సికో అధ్యక్షురాలి చరిత్రాత్మక గెలుపును దృష్టిలో పెట్టుకొని, ప్రధానమంత్రి ఆమెకు అభినందనలు తెలిపారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మెక్సికో మద్దతు తెలిపినందుకు ఆ దేశ అధ్యక్షురాలు షైన్‌బామ్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు పలికారు. భారత్, మెక్సికోల మధ్య ఎప్పటి నుంచో మైత్రి కొనసాగుతోందని నేతలు ఇద్దరూ ప్రధానంగా ప్రస్తావించారు. వాణిజ్యం, పెట్టుబడి, అంకుర సంస్థలు, నవకల్పన, సైన్స్-టెక్నాలజీలతో పాటు ఆటోమోటివ్ రంగాలలో సంబంధాలను మరింత విస్తరించే, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను ప్రోత్సహించే దిశగా కృషిచేద్దామంటూ ఉభయులూ అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి ప్రధాన సహకారం అంతకంతకు వృద్ధి చెందుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ‘నియర్-షోరింగ్’ విషయంలో మెక్సికో అందజేయగల అవకాశాలను నేతలిరువురూ చర్చించారు. ఔషధ తయారీ రంగంలో అవకాశాలు రోజు రోజుకూ పెరుగుతుండగా, భారత్ తక్కువ ధరలలో నాణ్యమైన మందులతో పాటు ఇతర ఔషధ ఉత్పత్తులను తయారు చేయడంలో, సరఫరా చేయడంలో ప్రధాన పాత్రను పోషించగల స్థితిలో ఉంది. వ్యవసాయం, సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి.

సాంకేతికత, నవకల్పన, ప్రజలకు వివిధ సేవలను అందించడంలో డిజిటల్ మాధ్యమం పోషిస్తున్న భూమిక.. ఈ రంగాల్లో భారత్ సాధించిన వృద్ధిని అధ్యక్షరాలు షైన్‌బామ్ ప్రశంసిస్తూ, ఈ రంగాల్లో భారత్ సహకారాన్ని అందించాలని కోరుకున్నారు. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్, కీలక ఖనిజాల రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలను రెండు దేశాలూ గుర్తించాలని ప్రధానమంత్రి అన్నారు. ఇరు పక్షాల మేధావులు రాబోయే కాలంలో అనుబంధాన్ని పెంచుకోవడంతో పాటు, పర్యటన రంగానికి ఊతాన్ని అందించగల ఉభయ దేశాల చైతన్యభరిత సాంస్కృతిక సంబంధాల పైన, ప్రజల మధ్య సంబంధాల పైన కూడా నేతలు దృష్టి సారించారు.
భాగస్వామ్య దేశాల నేతలుగా వారు ప్రస్తుతం తెర మీదకు వచ్చిన ప్రపంచ, ప్రాంతీయ అంశాల పైనా, గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాల పైనా అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకున్నారు. 2016లో మెక్సికోలో తాను పర్యటించిన సంగతిని ప్రధానమంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. భారత్‌ను సందర్శించవలసిందిగా అధ్యక్షురాలు షైన్‌బామ్‌ను ఆహ్వానించారు.
Had a very good meeting with President Claudia Sheinbaum of Mexico. Personally congratulated her on her historic electoral win, becoming the first female Mexican President in two centuries. We both see immense potential in India-Mexico ties growing even stronger in the times to… pic.twitter.com/iH9usejSqM
— Narendra Modi (@narendramodi) June 17, 2025
Tuve una muy buena reunión con la Presidenta de México, Claudia Sheinbaum. La felicité personalmente por su histórica victoria electoral, convirtiéndose en la primera mujer Presidente de México en dos siglos. Ambos vemos un inmenso potencial para que los lazos entre la India y… pic.twitter.com/8hg1BHEi4U
— Narendra Modi (@narendramodi) June 17, 2025


