అందరి సూచనలూ వినండి…. మీకు నచ్చినప్పుడే మీ శైలిని మార్చుకోండి: పీఎం
ఆసక్తీ, అవగాహనా పెరిగేలా విద్యార్థులకు ముందుగానే తెలియజేయాలని ఉపాధ్యాయులకు పీఎం సూచన
లక్ష్యం చేరుకునేదిగా ఉండాలి. కానీ సులభంగా అందకూడదు... గురి పెట్టండి, ప్రయత్నించండి: పీఎం
మెదడుకు సానపెట్టండి.. అనుసంధానం కండి.. ఆ తర్వాతే చదవండి, విజయం సాధించేందుకు ఇది సాయపడుతుంది: పీఎం
విద్య, నైపుణ్యాలు, విశ్రాంతి, అభిరుచిని సమతౌల్యం చేయడమే వృద్ధికి మూలం: పీఎం
విద్య, నైపుణ్యాలు, విశ్రాంతి, అభిరుచిని సమతౌల్యం చేయడమే వృద్ధికి మూలం: పీఎం
పుస్తకాలు విజ్ఞానాన్నిస్తాయి, కానీ సాధనే మిమ్మల్ని నిపుణులుగా మారుస్తుంది: పీఎం
గతం గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయొద్దు, భవిష్యత్తుపైనే దృష్టి సారించండి: పీఎం
పరీక్షల కోసమే చదువు కాదు.. జీవితం కోసం కూడా, ఎవరిని వారు సమీక్షించుకోవడమే పరీక్షల ఉద్దేశం: పీఎం
అందరిలో ఒకరిగా ఉండాలని కాదు.. ఏదైనా సాధించాలని ఆకాంక్షించండి.. : పీఎం
దేవుడిచ్చిన గొప్ప బహుమతి వర్తమానం- ఇప్పుడే, ఇక్కడే జీవించండి: పీఎం
ఈ క్షణాన్ని మీరు ఎంత ఆస్వాదిస్తే.. అంత ఎక్కువ కాలం దానిని గుర్తు పెట్టుకుంటారు: పీఎం
సామూహిక పఠనం.. అందరి వృద్ధికి దోహదం చేస్తుంది : పీఎం
పునఃశ్చరణ చేయండి.. తెలివితేటలు పెంచుకోండి: పీఎం
పాఠశాలలోనే ప్రాథమికాంశాలపై పట్టు సాధించండి.. పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది: పీఎం
పిల్లల సామర్థ్యం, ఆసక్తులకు అనుగుణంగా వారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు పీఎం సూచన
మీ అభిరుచులను ఉత్పాదకాలుగా మార్చుకోండి…
ఇతరులతో వాటిని పంచుకోండి, కొత్త ఆలోచనలకు, విజయానికి ఫీడ్‌బ్యాక్ తోడ్పడుతుంది: పీఎం
మిమ్మల్ని మీరు అన్వేషించండి..మీ జీవితం అందించే ప్రతి అనుభవాన్ని ఆస్వాదించండి: పీఎం
పరీక్షలు పండగలాంటివి, వాటిని వేడుకలా జరుపుకోండి: పీఎం
అంతర్లీనంగా ఉన్న సత్యం నుంచే అసలైన ఆత్మవిశ్వాసం పుడుతుంది, మీ పట్ల మీరు నిజాయతీగా ఉండండి: పీఎం
మీ జీవితాన్ని జీవన విధానమే తీర్చిదిద్దుతుంది కానీ అనుకూలమైన వాతావరణం కాదు: పీఎం
ఆకాంక్ష లేకపోవడం నేరం - ఎల్లప్పుడూ కలలు కనండి: పీఎం
మీకు మీరే చుక్కాని, మీ సామర్థ్యాలను గుర్తించండి: పీఎం
పెద్ద కలలు కనండి, భయాన్ని వీడండి - జీవిత చరిత్రలు చదవండి: పీఎం
పరిశుభ్రతను పాటించడమే మన ప్రథమ ప్రాధాన్యం, కర్తవ్యం: పీఎం

పరీక్షా పే చర్చ (పీపీసీ) 9వ సంచికలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు.

మీ శైలిమీ వేగం

గుజరాత్‌కు చెందిన విద్యార్థి ప్రధానమంత్రిని ఓ ప్రశ్న అడిగాడు. తమ గురించి తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటే.. ఉపాధ్యాయులు తోడ్పాటునిస్తారని ఆ విద్యార్థి అన్నాడు. అయితే చదువుకొనే విషయంలో తమ ఉపాధ్యాయులు ఒక పద్ధతిని.. తల్లిదండ్రులు మరో విధానాన్ని సూచిస్తుంటే, తాము మాత్రం మరోదాన్ని అనుసరిస్తున్నామని, వీటిలో ఏది సరైనదో తెలియక తికమకపడుతున్నామని చెప్పాడు. దీనికి ప్రధానమంత్రి స్పందిస్తూ.. ఇది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుందని, ప్రధానమంత్రిగా తనకు కూడా ప్రజలు వివిధ రకాల సూచనలిస్తుంటారని చెప్పారు. ఒక ఇంట్లో ఉన్న తోబుట్టువులకు వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉంటాయన్నారు. కొందరు కూరగాయలతో, ఇంకొందరు పప్పుతో, మరికొందరు అన్నీ కలగలిపి తింటారు. ప్రతి ఒక్కరికీ వారికంటూ ప్రత్యేకమైన శైలి ఉంటుందని వివరించారు. అయితే, ఎవరి శైలిని వారు అనుసరిస్తేనే ఆనందమన్నారు. కొందరు రాత్రి పూట చదవడానికి ప్రాధాన్యమిస్తే.. మరికొందరు ఉదయాన్నే చదువుకుంటారని, అది వారి ఇష్టానుగుణంగా ఉంటుందని శ్రీ మోదీ తెలిపారు. ఈ విషయంలో అబద్ధాలు చెప్పకూడదని హెచ్చరిస్తూ.. కొందరు తమ తల్లులకు ఉదయాన్నే చదువుకుంటామని చెప్పి, తెల్లారిన తర్వాత దాని గురించి పట్టించుకోరన్నారు. విద్యార్థులు తమ సొంత శైలిని విశ్వసించాలని, సూచనలను జాగ్రత్తగా వినాలన్నారు. ఇతరులు చెప్పారని కాకుండా, వ్యక్తిగత అనుభవం ద్వారా శైలిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. పరీక్షా పే చర్చ మొదలుపెట్టినప్పుడు ఒక పద్ధతి ఉండేదని, కాలక్రమేణా దానికి మార్పులు చేసినట్లు వివరించారు. మూల ఉద్దేశానికి కట్టుబడి ఉంటూనే.. ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాల్లో సెషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి స్నేహపూర్వకతత్వాన్ని గుర్తించిన విద్యార్థులు ఆయనతో చాలా సులభంగా మాట కలిపారు. వివిధ పద్ధతుల గురించి తెలుసుకొని, వాటి నుంచి మంచిని స్వీకరించాలన్నారు. కానీ, తమ సొంత పద్ధతిపై దృష్టి సారించి క్రమంగా దాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పారు.

 

తరచూ పాఠశాల లేదా ఉపాధ్యాయుల వేగాన్ని తాము అందుకోలేకపోతున్నామని, వెనకబడిన పాఠాలను నేర్చుకోవాలని ప్రయత్నిస్తే.. తర్వాతి అధ్యాయాల్లో వెనకబడిపోతున్నామని ఓ విద్యార్థి చెప్పాడు. ఉపాధ్యాయులు బోధనలో విద్యార్థుల కంటే ఒక్కడుగు మాత్రమే ముందుండాలని, మరీ ఎక్కువ దూరంలో ఉండకూడదని శ్రీ మోదీ అన్నారు. లక్ష్యం చేరుకోగలిగేగా ఉండాలి కానీ.. సాధించేందుకు సులభంగా ఉండకూడదని వివరించారు. ‘‘లక్ష్యానికి చేరువగా ఉండాలి. కానీ అది సులభంగా దక్కేలా ఉండకూడదు’’ అని ఎగ్జామ్ వారియర్ మంత్ర 26ను విద్యార్థి గుర్తు చేసుకోగా.. అతడి జ్ఞాపకశక్తిని ప్రధాని ప్రశంసించారు. విద్యార్థులకంటేఉపాధ్యాయులు 50 అడుగుల ముందుంటే విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతారు. పొలాన్ని రైతు దున్నినట్టే.. విద్యార్థుల మెదడును ఉపాధ్యాయులు సిద్ధం చేయాలన్నారు. ప్రతి వారంలోనూ బోధించే అధ్యాయాల గురించి ఉపాధ్యాయులు ముందుగానే చెప్పాలని ఆయన సూచించారు. దానివల్ల పాఠ్యాంశం ప్రారంభానికి ముందే.. విద్యార్థులు చదవడం, రాయడం, ఆన్‌లైన్లో శోధించడం మొదలుపెడతారన్నారు. బోధన వాస్తవికంగా ఉన్నప్పుడు విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని, అర్థం చేసుకొనే శక్తి పెరుగుతుందని, ఏకాగ్రత మెరుగవుతుందని వివరించారు. ఒక అధ్యాయం ఆసక్తికరంగా ఉంటే.. విద్యార్థులు దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటారని, పునఃశ్చరణ బలోపేతమవుతుందన్నాను. ఇది చాలా సులభమైన పద్ధతి అని.. ఇలా చేసిన తర్వాత కూడా ఉపాధ్యాయుల వేగం ఇంకా సమస్యగానే ఉంటుందా అని ప్రశ్నించారు. దానికి విద్యార్థి అవును అని సమాధానమివ్వగా శ్రీ మోదీ ఉండదు అని చెప్పాలని సరిచేశారు. ఎందుకంటే ఉపాధ్యాయుని కంటే ఓ అడుగు ముందే ఉన్నప్పుడు, విద్యార్థుల్లో వెనకబడి ఉన్నామనే భావన ఉండదన్నారు. ‘‘ముందు మెదడుకి పదును పెట్టండి, దానితో అనుసంధానమవ్వండి. ఆ తర్వాతే పాఠాలను చదవండి. అప్పుడే.. విద్యార్థులు విజయం సాధిస్తారు’’ అని తెలిపారు. ప్రధానమంత్రితో ముఖాముఖిగా మాట్లాడే, ప్రశ్నలు అడిగే, చర్చించే అవకాశం అందరికీ రాదని విద్యార్థులు అన్నారు. ఉపాధ్యాయుల కంటే రెండు అడుగులు ముందుండాలని సలహా ఇచ్చారని, ఇప్పుడు తాము చదువులో వెనకబడిపోమని వారు వెల్లడించారు.

సంగీత సమయం

‘హమారా భారత్ భూమి’ పేరుతో హిందీ, నేపాలీ, బెంగాలీ భాషల్లో దేశభక్తి గీతాన్ని తాను స్వరపరిచినట్లు సిక్కింకు చెందిన విద్యార్థిని తెలియజేసింది. ఆశ్చర్యపోయిన ప్రధానమంత్రి.. కవితలు రాయడం ఇష్టమా అని అడిగారు. వాటిని చదివి వినిపించమని ప్రోత్సహించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అన్న జాతీయ ఐక్యతా స్ఫూర్తి గురించి ఆమె పలికిన విధానాన్ని మెచ్చుకున్నారు. ఆ తర్వాత మాన్సీ అనే విద్యార్థినిని పాట పాడమని శ్రీ మోదీ అడిగారు. విద్యార్థులకు అంకితమిస్తూ.. తన తల్లి రాసిన పాటను మాన్సీ పాడి వినిపించింది. ఆమెను ప్రశంసిస్తూ.. తన తరఫున ఆమె తల్లికి అభినందనలు తెలియజేయమని ప్రధాని చెప్పారు. యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీ, ఇన్స్టా పేజీని తాను నడుపుతున్నట్లు ఓ విద్యార్థి చెప్పాడు. తన ఫేస్‌బుక్ ఖాతాను 1.5 లక్షల మంది అనుసరిస్తున్నారని వెల్లడించాడు. ఆశ్చర్యపోయిన ప్రధాని అతడిని అభినందిస్తూ.. ఇలాంటి ప్రతిభావంతులైన వారిని కలుసుకోవడం తనకు గర్వకారణమన్నారు.

 

అస్సాం గమోఛాతో ప్రధాని విద్యార్థులకు స్వాగతం పలికారు. అది తనకు అత్యంత ఇష్టమైనదని చెప్పారు. అస్సాం, ఈశాన్య ప్రాంతంలో మహిళా సాధికారతకు గమోఛా చిహ్నమని, అక్కడి మహిళలు దీనిని రూపొందిస్తారని వివరించారు. ఇది వారి సామర్థ్యాన్ని, సహకారాన్ని సూచిస్తుందన్నారు. విద్యార్థులకు గౌరవపూర్వకంగా గమోఛాను అందించాలనేది తన కోరిక అని చెప్పారు.

లక్ష్యాన్ని చేధించేలా సన్నద్ధత

విద్యార్థుల్లో ఉన్న అయోమయాన్ని, భయాన్ని తెలియజేస్తూ.. నైపుణ్యాలు ముఖ్యమా? మార్కులు ప్రధానమా? అని సబావత్ వెంకటేశ్ అనే విద్యార్థి ప్రధానిని అడిగాడు. తినడమైనా-నిద్రపోవడమైనా, చదవడమైనా-ఆడుకోవడమైనా, నైపుణ్యాలైనా-మార్కులైనా జీవితంలో సమతౌల్యం అవసరమని ప్రధానమంత్రి సమాధానమిచ్చారు. ఒకవైపే మొగ్గు చూపడం అసమతౌల్యానికి దారి తీస్తుందని, సరైన సమతౌల్యం స్థిరత్వాన్ని అందిస్తుందన్నారు. నైపుణ్యాలు రెండు రకాలు - జీవన నైపుణ్యాలు, వృత్తిగత నైపుణ్యాలు- ఈ రెండూ ముఖ్యమైనవేనని చెప్పారు. విజ్ఞానం, పరిశీలన, అధ్యయనం లేకుండా ఏ నైపుణ్యం మెరుగుపడదని, విజ్ఞానంతోనే నైపుణ్యం మొదలవుతుందని వివరించారు.

 

దీనిని ఉదాహరణలతో శ్రీ మోదీ వివరించారు: జీవన నైపుణ్యాలు లేకపోతే.. వంట చేయడం, రైల్వే స్టేషన్లో టిక్కెట్టు కొనుక్కోవడం లాంటి దైనందిన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, అనుసరణీయతతో సహా జీవన నైపుణ్యాలను పూర్తిగా అలవరుచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వృత్తిగత నైపుణ్యాల గురించి వివరిస్తూ.. తమ నైపుణ్యాలను వైద్యులు నిరంతరం మెరుగుపరుచుకోవాలని, పుస్తక జ్ఞానం మాత్రమే హృద్రోగ నిపుణున్ని తయారుచేయలేదని తెలిపారు. రోగులతో కలసి పనిచేసినప్పుడే అసలు నైపుణ్యాలు అలవడతాయన్నారు. అదే విధంగా న్యాయస్థానంలో వాదించే నైపుణ్యాలు పెంపొందించుకోవాలంటే రాజ్యాంగ నిబంధనల గురించి తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. సీనియర్లతో కలసి న్యాయవాదులు ప్రాక్టీసు చేయాలి. కొత్త సాంకేతికతలను స్వీకరించాలంటే.. 40 ఏళ్ల వయసులో కూడా నిరంతర అభ్యాసం అవసరమని ఆయన స్పష్టం చేశారు. వైద్యం, ఇతర రంగాల్లో వస్తున్న పురోగతులను అందిపుచ్చుకోవడానికి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. విద్య, నైపుణ్యాలు కవలల్లాంటివని, వాటిని విడివిడిగా చూడలేమని, అవి జీవితంలో తప్పనిసరి అని తెలిపారు.

మార్కుల పరిధిని అధిగమించిన మాధ్యమంగా విద్య

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పట్ల తనకున్న అభిమానాన్ని మణిపూర్లోని ఇంఫాల్లో ఉన్న సైనిక్ పాఠశాల విద్యార్ధి వ్యక్తం చేశాడు. తనది, ప్రధానిది పుట్టిన రోజు ఒకటేనని చెప్పారు. గడచిపోయిన సంవత్సరాలను తాను లెక్కపెట్టనని, మిగిలి ఉన్న సమయంపైనే తాను దృష్టి పెడతానని చెప్పారు. గతం గురించి ఆలోచిస్తూ.. సమయాన్ని వృథా చేసుకోవద్దని, భవిష్యత్తు గురించి ఆలోచించమని విద్యార్థులను శ్రీ మోదీ కోరారు.

గతేడాది ప్రశ్నల ఆధారంగా పరీక్షలకు సన్నద్ధమయ్యే వ్యూహాల గురించి అడిగినప్పుడు.. చాలా సందర్భాల్లో ప్రశ్నాపత్రం కష్టంగా ఉందని విద్యార్థులు భావిస్తారని ప్రధాని అన్నారు. దీనికి కారణం ఆ ప్రశ్నలు సిలబస్‌లో లేకపోవడం కాదని.. కొన్ని పునరావృత నమూనాలకే పరిమితం కావడమని చెప్పారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలోనూ ఇదే పరిస్థితి ఉండేదని, కొన్ని సందర్భాల్లో మార్కులకే ప్రాధాన్యమిచ్చేలా ఉపాధ్యాయులు వ్యవహరించేవారన్నారు. మొత్తం సిలబస్‌ను పూర్తి చేసి, దానిని వాస్తవ జీవితానికి తగినట్టుగా అనువదించడం ద్వారా సమగ్ర విజ్ఞానం అందించేందుకు మంచి గురువులు ప్రాధాన్యమిస్తారన్నారు. క్రికెట్లో బౌలర్‌ను ఉదాహరణగా చూపిస్తూ.. భుజం కండరాలను బలోపేతం చేసుకోవడానికే పరిమితం కాకుండా.. యోగా చేసి మొత్తం శరీరాన్ని, మనసును బలోపేతం చేసుకోవాలని, ఆహార నియమాలు పాటించాలని, తగినంత నిద్రపోవాలని వివరించారు. అదే మాదిరిగా.. పరీక్షల కోసమే చదువు కాదని, జీవితం కోసమని తమని తాము సమీక్షించుకోవడమే పరీక్షల వెనక ఉన్న అర్థమని ఆయన చెప్పారు. అంతిమ లక్ష్యం మార్కులు కాదు.. జీవిత పరిపూర్ణాభివృద్ధి కావాలి. పది ప్రశ్నలకు లేదా పద్ధతులపైనే దృష్టి సారిస్తే.. సన్నద్ధత కూడా పరిమితంగానే ఉంటుందని, సంపూర్ణ అభ్యాసంపై దృష్టి సారించాలని సలహా ఇచ్చారు.

 

ముఖ్యంగా పరీక్షల సమయానికి ముందు ఎదురయ్యే ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న ప్రశ్నకు ప్రధానమంత్రి సమాధానమిచ్చారు. ఇది అందరికీ ఉన్న సమస్యేనని ఆయన అన్నారు. విద్యను నిర్భందమైనదిగా లేదా భారంగా పరిగణించకూడదని, దానికి పూర్తిగా నిమగ్నమవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసంపూర్ణ విద్య విజయానికి మార్గం కాదన్నారు. మార్కులకే ప్రాధాన్యం ఇవ్వడం గురించి మాట్లాడుతూ.. గతేడాది బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థి పేరు మీకు గుర్తుందా అని ప్రశ్నించారు. దానికి ఓ విద్యార్థి లేదు అని సమాధానమివ్వగా.. మార్కులకు ఎంత తక్కువ ప్రాధాన్యముందో వివరిస్తూ.. అలాంటి విజయాలను కూడా స్వల్పకాలం మాత్రమే మెచ్చుకుంటారని, తర్వాత మరచిపోతారన్నారు. తమ మనసును మార్కులతో ముడిపెట్టుకోవద్దని, తమ జీవితం ఏ వైపు వెళుతుందో దృష్టి సారించాలన్నారు. అలాగే తరగతి గదిలో లేదా పరీక్షాకేంద్రాల్లో మాత్రమే కాకుండా.. జీవితంలో కూడా తమను తాము పరీక్షించుకోవాలని సూచించారు.

ఒత్తిడిని తగ్గించిఎక్కువ నేర్చుకోవటం

చదువుకునేటప్పుడు మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ, నేర్చుకున్న పాఠాలు కూడా త్వరగా మర్చిపోతున్నాం. ఆ సమయంలో ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఎలా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణ సందర్భంగా ఒక విద్యార్థి అడిగారు. చక్కని ఉదాహరణతో ప్రధానమంత్రి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. "ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారు. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత ఎవరైన మిమ్మల్ని ఈ కార్యక్రమం గురించి అడిగితే గుర్తుంటుందా, మర్చిపోతారా?” అనిప్రధానమంత్రి అడగ్గా.. ఇది ఎంతో ప్రత్యేకమైన సందర్భం కాబట్టి ఎప్పటికీ గుర్తుంటుందని ఆ విద్యార్థి చెప్పారు. అప్పుడు శ్రీ నరేంద్ర మోదీ ఇలా వివరించారు. మీరు ఈ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉండటమే అందుకు కారణం. మీరు వర్తమానంలో జీవిస్తూ, ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని శ్రద్ధగా గమనిస్తున్నారు. ఎప్పుడైతే మనం ఒక పనిలో పూర్తిగా లీనమవుతామో, ఆ జ్ఞాపకాలు మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

మనం ఒక పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు, ఆ అనుభవాలను స్నేహితులతో పంచుకున్నప్పుడు జ్ఞాపకాలు కలకాలం పదిలంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన వారితో స్నేహం చేసి, వారికి పాఠాలు నేర్పండని విద్యార్థులకు సూచించారు. మీకన్నా తెలివైనవారితో చర్చించి, మీ అవగాహనను మెరుగుపరచుకోండి. ఈ రెండు రకాల ప్రయోజనాల ద్వారా కొత్త ఆలోచనలు రావటమే కాక, మనసు ఉత్సాహంగా ఉండి, ఏకాగ్రత పెరుగుతుందని ఆయన తెలిపారు.

 

పంజాబ్‌కు చెందిన మరో విద్యార్థి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి గౌరవప్రదంగా అభివాదం చేస్తూ, 12వ తరగతి విద్యార్థులకున్న సవాళ్ల గురించి మాట్లాడారు. ఒకే సమయంలో బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవటం, పరీక్షా విధానాలు వేరుగా ఉండటం, ఒకే సమయంలో పరీక్షల షెడ్యూల్ ఉండటం వారికి కష్టంగా ఉంటుందన్నారు. ఆ విద్యార్థి ఆందోళనను అర్థం చేసుకున్న ప్రధానమంత్రి.. దీన్ని ఒకే సమయంలో క్రికెట్, ఫుట్‌బాల్ ఆడటమని అభివర్ణించారు. విద్యార్థులు 12వ తరగతి సిలబస్‌కే ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. సిలబస్‌ను పూర్తిగా అవగతం చేసుకుంటే ప్రత్యేక శ్రద్ధ అవసరం లేకుండానే పోటీ పరీక్షలు సులభతరమవుతాయన్నారు. పిల్లలు వారి సామర్థ్యం, నైపుణ్యం, ఆసక్తి మేరకు ఎదిగేలా సహకరించాలని తల్లిదండ్రులకు సూచించారు.

మార్కులుఆటలుఆనందాన్ని సమతుల్యం చేయటం

చదువుపై శ్రద్ధ పెట్టాలని సమాజం నుంచి ఒత్తిడి ఉందని, గేమింగ్ రంగంలో భవిష్యత్తుపై ఓ విద్యార్థి ప్రశ్నించారు. దానికి ప్రధానమంత్రి సమాధానమిస్తూ.. మొదట్లో తల్లిదండ్రులు నిరుత్సాహపడినా, ఒకసారి విజయం సాధించిన తర్వాత వాళ్లే గర్వంగా ఆ విజయాన్ని వేడుకగా జరుపుకుంటారని వివరించారు. గేమింగ్ పట్ల ఆసక్తిని ఉత్పాదకత దిశగా మళ్లించాలని ఆ విద్యార్థిని ప్రోత్సహిస్తూ.. పంచతంత్రం, పురాణ గాథల వంటి భారతదేశపు గొప్ప కథల ఆధారంగా కొత్త ఆటలను సృష్టించాలని, వాటికి గుర్తింపు లభించేలా సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకోవాలని ఆయన సూచించారు. గేమింగ్.. కేవలం కాలక్షేపం కాదని, దానికి వేగం, అప్రమత్తత వంటి నైపుణ్యాలు అవసరమని, ఇది స్వీయ అభివృద్ధికి సహకరిస్తుందని వివరించారు. నాణ్యమైన గేమింగ్‌లో ప్రావీణ్యం సంపాదించటంపై దృష్టి సారించాలని సూచించారు. గేమింగ్ పేరుతో జరుగుతున్న జూదం పట్ల హెచ్చరిస్తూ, అనైతిక పద్ధతులను అరికట్టటానికి రూపొందించిన చట్టాలను గుర్తు చేస్తూ, గేమింగ్‌ను నిర్మాణాత్మక నైపుణ్యంగా స్వీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

 

ప్రధానమంత్రి నివాసాన్ని సందర్శించటం పట్ల విద్యార్థులు ఉత్సాహాం కనబరిచారు. ఆయన స్వేహపూర్వక పలకరింపు, విద్యార్థుల ప్రశ్నలపై ఆయన చూపిన ఆసక్తి, వాటికి ఆయన అందించిన ఆలోచింపజేసే సమాధానాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

భయాన్ని బలంగా మార్చుకోవటం ఒత్తిడిసమయంఆత్మవిశ్వాసాన్ని సమన్వయం చేసుకోవటం

ఎగ్జామ్ వారియర్ పుస్తకం చదవటం వల్ల పరీక్షలపై తమ దృక్పథం ఎలా మారిందో విద్యార్థులు పంచుకున్నారు. గతంలో పరీక్షలంటే ఒత్తిడి, భయం కలిగేవని, ఈ పుస్తకం చదివిన తర్వాత పరీక్షలు ఒక మిత్రుడిలా మారిపోయాయని ఓ విద్యార్థి పేర్కొన్నారు. గతంలో ఇతరులతో పోల్చుకుని ఆందోళన చెందేవాళ్లమని, తమ శైలి ప్రత్యేకమైనదని, ప్రభావవంతమైందని ఇప్పుడు గ్రహించినట్లు మరో విద్యార్థి తెలిపారు. సమయపాలన ఎప్పుడూ సవాలుగానే ఉండేదని, ఎగ్జామ్ వారియర్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాక, ఇకపై ఉదయాన్నే నిద్రలేచి పనులను సమర్థవంతంగా నిర్వహించుకోవాలని నిశ్చయించుకున్నామని ఒక విద్యార్థి చెప్పారు.

సమయపాలనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సులభమైన పద్ధతిని సూచించారు. చేయాల్సిన పనులను రాత్రి పడుకునే ముందు డైరీలో రాసుకుని, మరుసటి రోజు వాటిని సరిచూసుకోవటం, కొన్ని పనులు ఎందుకు పూర్తి కాలేదో విశ్లేషించుకోవాలని చెప్పారు. ఉత్పాదకతతో సమయాన్ని వినియోగించుకోవటం నేర్చుకుంటే ఒత్తిడి, అలసట తొలగిపోతాయని స్పష్టం చేశారు. తనకు ఎన్ని బాధ్యతలున్నప్పటికీ, సరైన సమయపాలన పాటించే అలవాటు వల్లే ఒత్తిడి ఉండదని తెలిపారు.

గణితం వంటి సబ్జెక్టుల పట్ల తమకున్న భయం ఆసక్తిగా ఎలా మారిందో విద్యార్థులు వివరించారు. ఒకప్పుడు గణితం భూతంలా ఉండేది కానీ, ఇప్పుడది ఇష్టమైన సబ్జెక్టు అని ఒక విద్యార్థి తెలిపారు. వేద గణితం గురించి మరింత తెలుసుకోవాలని విద్యార్థులను ప్రధానమంత్రి ప్రోత్సహించారు. ఇది చాలా వినోదాత్మకంగా, మాయాజాలంలా ఉంటుందని అభివర్ణిస్తూ, ఇలాంటి విధానాలను స్నేహితులతో పంచుకోవటం వల్ల వారిలోనూ ఆసక్తిని కలిగించవచ్చని సూచించారు.

 

ఒకప్పుడు పరీక్షల తేదీలు భయాన్ని కలిగించేవని కానీ, పరీక్షలను పండగలా జరుపుకోవాలి అనే మంత్రం తనలో ఉత్సాహాన్ని నింపిందని మరో విద్యార్థి పంచుకున్నారు. పరీక్షా పే చర్చలో నేర్చుకున్న పాఠాలను కుటుంబసభ్యులతో కూడా పంచుకోవాలని, అవి వారికి కూడా సమాన ప్రయోజనాలను కలిగిస్తాయని ప్రధానమంత్రి సలహా ఇచ్చారు.

తక్కువ మార్కులు వస్తాయేమో అన్న భయాన్ని అధిగమించిన తీరును విద్యార్థులు గుర్తుచేసుకున్నారు. మార్కులే సర్వస్వం కాదని గ్రహించారు. వైఫల్యాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎదిగిన తీరుని వారు ఉదహరణగా చెప్పుకున్నారు. ఒత్తిడి తగ్గితే మెదడు ఉల్లాసంగా మారి పాటలు పాడటం, చిత్రలేఖనం, కవితలు రాయటం వంటి నూతన నైపుణ్యాలను నేర్చుకోవటానికి వీలవుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సృజనాత్మక పనులను ప్రారంభించిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు.

విద్యార్థులు ప్రసంగాల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టుకోవటానికి పుస్తకాల ద్వారా లభించిన ఆత్మవిశ్వాసం సహాయపడింది. ఒక సాధారణ వ్యక్తి కళ్లతో చూసిన సంఘటనను ఎంత స్పష్టంగా వివరించగలడో.. అలాగే సత్యం, అనుభవం నుంచి ఆత్మవిశ్వాసం లభిస్తుందని ప్రధానమంత్రి వివరించారు. విద్యార్థులు చేసిన కృషి, సాధించిన విజయ సత్యాల నుంచి ఆత్మవిశ్వాసం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

గతంలో సుదీర్ఘమైన లిటరేచర్ పేపర్లు చూసి ఆందోళన కలిగేదని, ఇప్పుడు వేగంగా రాయటం, చేతి రాతను మెరుగుపరుచుకోవటం ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఒక విద్యార్థి పంచుకున్నారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి.. ప్రశ్నాపత్రానికి జవాబులను రాయటం ప్రారంభించే ముందు 30 సెకన్లపాటు ప్రశాంతంగా ఉండాలని, దీర్ఘంగా శ్వాస తీసుకుని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని, జ్ఞానం లేకపోవటం వల్ల కాదు.. తొందరపాటు వల్లే పరీక్షల్లో తప్పులు జరుగుతాయని ఆయన తెలిపారు. సరైన పద్ధతులు, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షల భయాన్ని జయించి, విజయం సాధించగలరని అన్నారు.

గందరగోళ పరిస్థితుల మధ్య స్థిరంగా నిలబడటం

ఇంట్లో గందరగోళ పరిస్థితులు, తల్లిదండ్రుల మద్దతు లేని సమయాల్లో ఎలా చదువుకోవాలని ఓ విద్యార్థి అడిగారు. సరుకులతో నిండిన ఎడ్లబండిపై కూర్చొని, ఓ చిన్నారి ఎంతో ఏకాగ్రతతో చదువుకుంటున్న వీడియోను ఈ సందర్బంగా ప్రధానమంత్రి గుర్తు చేశారు. విజయం సాధించేందుకు సౌకర్యం ముఖ్యం కాదని స్పష్టం చేశారు. బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే చాలామంది, సౌకర్యాలు లేని చిన్న గ్రామాల నుంచి వస్తారని తెలిపారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, క్రికెట్ లో విజయం సాధించిన అంధులైన అమ్మాయిల స్ఫూర్తిదాయక కథను ఈ సందర్భంగా పంచుకున్నారు. మనం అనుభవించే సౌకర్యాల వల్ల కాదు.. జీవన విధానాన్ని బట్టి జీవితం రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు.

 

అతిథుల వల్ల పరీక్షల సన్నద్ధతకు అంతరాయం కలుగుతుందని తమిళనాడుకు చెందిన విద్యార్థి అన్నారు. ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి బదులిచ్చారు. అతిథుల బాల్య జ్ఞాపకాల గురించి అడిగి, చర్చాంశాన్ని మార్చాలని, ఇది విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించటమే కాక, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని సలహా ఇచ్చారు.

ఉన్నత లక్ష్యాలుగొప్ప కార్యాచరణ

పిల్లలు పెద్ద కలలను కంటే, వాటిని నెరవేర్చుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలని లద్దాఖ్ కు చెందిన విద్యార్థి అడిగారు. కలలు కనకపోవటం నేరం.. కలలకు కార్యాచరణ తోడవ్వాలని ప్రధానమంత్రి బదులిచ్చారు. వ్యోమగామి కావాలన్న ఆశయం నెరవేర్చుకోవాలంటే నిరంతరం చదవటం, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను అధ్యయనం చేయటం, ఆ రంగంపై ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవటం ముఖ్యమని వివరించారు. కలలను బహిర్గతం చేయటం వల్ల ఇతరులు హేళన చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. తమ కలలను ఒకచోట రాసుకుని, జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

 

పెద్ద కలలను సాధించేందుకు అలవరచుకోవాల్సిన రోజువారీ అలవాట్లపై అడిగిన మరో ప్రశ్నకు స్పందిస్తూ, ప్రధానమంత్రి ఇలా సమాధానం చెప్పారు. మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని సూచించారు. వారి జీవితంలోని కష్టాలను, మొదట్లో వారు తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవటం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కలుగుతుందని, ఒక్కో అడుగూ ఎలా ముందుకు వేయాలో నేర్చుకోవచ్చని చెప్పారు.

ఒక విద్యార్థి హృదయం ఉప్పొంగే కవితను ప్రధానమంత్రికి అంకితమిచ్చారు. ఆ కవితలో ప్రధానమంత్రిని భారతదేశానికి గర్వకారణమని, మానవతా సేవకుడని, దేశ కలలను ముందుకు తీసుకెళ్తున్న గొప్ప నాయకుడని అభివర్ణించారు. ఆ కవితను హృదయపూర్వకంగా ప్రశంసించిన ప్రధానమంత్రి, ఆ విద్యార్థిని అభినందించారు.

ప్రధానమంత్రి ఉపాధ్యాయుడిగా మారినప్పుడు

స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి, 2047లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలన్నదే తన ఆకాంక్ష అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ దార్శనికత ప్రయోజనాలు పొందేందుకు ఇప్పటి యువత.. 35 నుంచి 45 ఏళ్ల వయసులో జీవితంలో అత్యంత కీలకమైన దశలో ఉంటారని చెప్పారు. 1915లో ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మహాత్మాగాంధీ 1947 వరకు స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారని, భగత్ సింగ్ వంటి నాయకుల త్యాగాలు స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి స్ఫూర్తినిచ్చాయని ఆయన తెలిపారు. అంతటి అద్భుతమైన స్వేచ్ఛను మనం సాధించగలిగినప్పుడు, కలిసికట్టుగా కృషి చేస్తే అభివృద్ధి చెందిన భారతదేశం తప్పక సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అభివృద్ధి చెందిన భారతదేశం కోసం వ్యక్తిగత అంకిత భావాన్ని లిఖితపూర్వకంగా వ్యక్తపరచాలని విద్యార్థులను ప్రధానమంత్రి కోరారు. ఇందులో భాగంగా వారి చేయాల్సిన ఐదు ప్రధానాంశాలను గుర్తించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, ఆత్మవిశ్వాసం, స్వదేశీ వస్తువుల వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. స్వదేశీ స్ఫూర్తిని అవలంబించటం ద్వారా మనసుని సిద్ధం చేసుకుంటూ వలసవాద మనస్తత్వాన్ని వీడాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులపై వ్యామోహం పాఠశాలల్లో ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. రోజూ ఉపయోగించే వస్తువులను జాబితాగా రూపొందించి, వాటిలో విదేశీ వస్తువులను గుర్తించి, ఆ వస్తువుల స్థానంలో భారత ఉత్పత్తులను చేర్చటం ద్వారా ఏడాది కాలంలోనే వారి ఇళ్లు స్వదేశీ వస్తువులతో నిండిపోతుందని విద్యార్థులకు ప్రధానమంత్రి సూచించారు. భారతీయులుగా మన ఉత్పత్తులపై మనమే గర్వపడకపోతే, ప్రపంచం గౌరవించదని ఆయన తెలిపారు. ఆలస్యానికి "ఇండియన్ టైమ్" అని సాకులు చెప్పే ధోరణిని ఆయన విమర్శించారు. ఇటువంటి వైఖరి దేశ గౌరవాన్ని తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు. పరిశుభ్రతతో ప్రారంభమయ్యే కర్తవ్య పాలనను అలవరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలు శుభ్రంగా ఉండటానికి కారణం కేవలం పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే కాదు.. అక్కడి పౌరులు బయట చెత్త వేయకపోవటం అసలు కారణమని స్పష్టం చేశారు. భారతీయులు పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ఎవరైనా చెత్త వేసినా, దాన్ని మనం తీసేయటం ద్వారా చెత్త పడేసిన వారు సిగ్గుపడేలా చేయాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా పౌరుల ప్రాథమిక బాధ్యతని, పౌరులంతా ఇటువంటి బాధ్యతలను నెరవేరిస్తే, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. భారత్ అభివృద్ధి చెందితే నేటి యువత, పెద్దయ్యాక పూర్తిస్థాయిలో గొప్ప ప్రయోజనాలను అనుభవిస్తారని తెలిపారు. తమకు ప్రయోజనం కలిగే పనులు చేయాలా అని ప్రధానమంత్రి ప్రశ్నించగా, విద్యార్థులు అవునని బదులిచ్చారు. ఆ తర్వాత ప్రస్తుత తరానికి, ముఖ్యంగా సాంకేతిక రంగంలోని అపారమైన అవకాశాల గురించి మాట్లాడారు. అప్పట్లో అలాంటి అవకాశాలు లేవని, నేటి యువత కృతిమ మేథను తెలివిగా వినియోగించుకోవాలని సూచించారు. జీవిత చరిత్రలను క్షుప్తంగా తెలుసుకోవటానికి ఏఐని వాడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఒక వ్యక్తి వయసు, అభిరుచులకు అనుగుణంగా ఏ జీవిత చరిత్రలు చదవాలో సిఫార్సు చేయమని ఏఐని అడిగి, ఆ పుస్తకాలను స్వయంగా చదవటం వల్ల నిజమైన వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని చెప్పారు. వినోదం మాత్రమే కాక, సామర్థ్యం, జ్ఞానాన్ని పెంపొందించటానికి ఏఐ సాధనంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐ వినియోగంపై ఆయన మార్గదర్శకత్వం పట్ల విద్యార్థులు ప్రశంసలు కురిపించారు. ఇది వారి సాంకేతిక ప్రయత్నాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

 

కర్ణాటక శాస్త్రీయ సంగీత శైలిలో ఓ విద్యార్థి ఇచ్చిన వేణుగాన ప్రదర్శనను ప్రధానమంత్రి ఆసక్తిగా ఆలకించి, ప్రశంసించారు. వసంతపంచమి సందర్భంగా ఉత్తరాఖండ్ సంప్రదాయ విశిష్టత తెలిసేలా స్వయంగా రూపొందించిన పుష్పగుచ్ఛం అందించిన విద్యార్థిని అభినందించారు. త్రిపుర సంప్రదాయాలను తెలియజేసేలా విద్యార్థులు బహుమతిగా ఇచ్చిన సేంద్రీయ తేయాకు, అస్సామీ గమోచాను ప్రశంసించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను అభినందిస్తూ, కవిత్వం రాయటం కొనసాగించాలని ప్రోత్సహించారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, శుభాకాంక్షలు తెలిపారు.

పరీక్షా పే చర్చ కార్యక్రమం రాబోయే ఎపిసోడ్ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో "పరీక్షా పే చర్చ" నిర్వహించాలని చాలామంది విద్యార్థులు సూచించారని, ఆ విషయం ఈ ఎపిసోడ్‌లో ప్రతిబింబించిదనన్నారు. కుటుంబంలో తోబుట్టువుల నుంచి మంచి లక్షణాలను అలవరచుకోవాలని సూచించారు. గొప్పగా ఎదగాలని ఆశించటంలో తప్పులేదు కానీ, ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదన్నారు. వ్యక్తిగతంగా, సామాజికంగా విద్య ప్రాముఖ్యతను గురించి చెబుతూ, జీవితంలో క్రీడలు కూడా ముఖ్య భాగంగా ఉండాలని చెప్పారు. విద్యార్థుల ఆలోచనలను, అనుభవాలను స్వేచ్ఛగా పంచుకోవాలని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమం తదుపరి ఎపిసోడ్ 9 ఫిబ్రవరి 2026న ఉదయం 10 గంటలకు ప్రసారం అవుతుంది.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This is the New India that leaves no stone unturned for development: PM Modi
March 23, 2026
Today, India is moving forward with a new confidence; Now India faces challenges head-on: PM
From the Gulf to the Global West and from the Global South to neighbouring countries, India is a trusted partner for all: PM
What gets measured gets improved and ultimately gets transformed: PM
This is the new India, It is leaving no stone unturned for development: PM

नमस्कार!

पिछले कुछ समय में मुझे एक-दो बार टीवी9 भारतवर्ष देखने का मौका मिला है। नॉर्मली भी युद्धों और मिसाइलों पर आपका बहुत फोकस होता है और आजकल तो आपको कंटेंट की ओवरफीडिंग हो रही है। बड़े-बड़े देश टीवी9 को इतना सारा कंटेंट देने पर तुले हुए हैं, लेकिन On a Serious Note, आज विश्व जिन गंभीर परिस्थितियों से गुजर रहा है, वो अभूतपूर्व है और बेहद गंभीर है। और इन स्थितियों के बीच, आज टीवी-9 नेटवर्क ने विचारों का एक बेहद महत्वपूर्ण मंच बनाया है। आज इस समिट में आप सभी India and the world, इस विषय पर चर्चा कर रहे हैं। मैं आप सबको बधाई देता हूं। इस समिट के लिए अपनी शुभकामनाएं देता हूं। सभी अतिथियों का अभिनंदन करता हूं।

साथियों,

आज जब दुनिया, conflicts के कारण उलझी हुई है, जब इन conflicts के दुष्प्रभाव पूरी दुनिया पर दिख रहे हैं, तब India and the world की बात करना बहुत ही प्रासंगिक है। भारत आज वो देश है, जिसकी अर्थव्यवस्था तेजी से आगे बढ़ रही है। 2014 के पहले की स्थितियों को पीछे छोड़कर के आज भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। अब भारत चुनौतियों को टालता नहीं है बल्कि चुनौतियों से टकराता है। आप बीते 5-6 साल में देखिए, कोरोना की महामारी के बाद चुनौतियां एक के बाद एक बढ़ती ही गई हैं। ऐसा कोई साल नहीं है, जिसने भारत की, भारतीयों की परीक्षा न ली हो। लेकिन 140 करोड़ देशवासियों के एकजुट प्रयास से भारत हर आपदा का सामना करते हुए आगे बढ़ रहा है। इस समय युद्ध की परिस्थितियों में भी भारत की नीति और रणनीति देखकर, भारत का सामर्थ्य देखकर दुनिया के अनेकों देश हैरान हैं। हमारे यहां कहावत है, सांच को आंच नहीं। 28 फरवरी से दुनिया में जो उथल-पुथल मची है, इन कठोर विपरीत परिस्थितियों में भी भारत प्रगति के, विकास के, विश्वास के संकल्प के साथ आगे बढ़ रहा है। इन 23 दिनों में भारत ने अपनी Relationship Building Capacity दिखाई है, Decision Making Capacity दिखाई है और Crisis Management Capacity दिखाई है।

साथियों,

आज जब दुनिया इतने सारे खेमों में बंटी हुई है, भारत ने अभूतपूर्व और अकल्पनीय bridges बनाए हैं। Gulf से लेकर Global West तक, Global South से लेकर पड़ोसी देशों तक भारत सभी का trusted partner है। कुछ लोग पूछते हैं, हम किसके साथ हैं? तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं, हम भारत के हितों के साथ हैं, शांति के साथ हैं, संवाद के साथ हैं।

साथियों,

संकट के इसी समय में जब global supply chains डगमगा रही हैं, भारत ने diversification और resilience का मॉडल पेश किया है। Energy हो, fertilizers हों या essential goods अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे है।

साथियों,

जब राष्ट्रनीति ही राजनीति का मुख्य आधार हो, तब देश का भविष्य सर्वोपरि होता है। लेकिन जब राजनीति में व्यक्तिगत स्वार्थ हावी हो जाता है, तब लोग देश के फ्यूचर के बजाय अपने फ्यूचर के बारे में सोचते हैं। आप ज़रा याद कीजिए 2004 से 2010 के बीच क्या हुआ था? तब कांग्रेस सरकार के समय पेट्रोल-डीजल और गैस की कीमतों का संकट आया था और तब कांग्रेस ने देश की नहीं बल्कि अपनी सत्ता की चिंता की। उस वक्त कांग्रेस ने एक लाख अड़तालीस हज़ार करोड़ रुपए के ऑयल बॉन्ड जारी किए थे और प्रधानमंत्री मनमोहन सिंह जी ने खुद कहा था कि वो आने वाली पीढ़ी पर कर्ज का बोझ डाल रहे हैं। यह जानते हुए भी कि ऑयल बॉन्ड का फैसला गलत है, जो रिमोट कंट्रोल से सरकार चला रहे थे, उन लोगों ने अपनी सत्ता बचाने के लिए यह गलत निर्णय किया क्योंकि जवाबदेही उस समय नहीं होनी थी, उस बॉन्ड पर री-पेमेंट 2020 के बाद होनी थी।

साथियों,

बीते 5-6 वर्षों में हमारी सरकार ने कांग्रेस सरकार के उस पाप को धोने का काम किया है, और इस धुलाई का खर्चा कम नहीं आया है, ऐसी लाँड्री आपने देखी नहीं होगी। 1 लाख 48 हज़ार करोड़ रुपए की जगह, देश को 3 लाख करोड़ रुपए से अधिक की पेमेंट करनी पड़ी क्योंकि इसमें ब्याज भी जुड़ गया था। यानी हमने करीब-करीब दोगुनी राशि चुकाने के लिए मजबूर हुए। आजकल कांग्रेस के जो नेता बयानों की मिसाइलें दाग रहे हैं, मिसाइल आई तो टीवी9 को मजा आएगा, उनकी इस विषय का जिक्र आते ही बोलती बंद हो जाती है।

साथियों,

पश्चिम एशिया में बनी परिस्थितियों पर मैंने आज लोकसभा में अपना वक्तव्य दिया है। दुनिया में जहां भी युद्ध हो रहे हैं, वो भारत की सीमा से दूर हैं। लेकिन आज की व्यवस्थाओं में कोई भी देश युद्धों से दुष्प्रभाव से दूर रहे, ऐसा संभव नहीं होता। अनेक देशों में तो स्थिति बहुत गंभीर हो चुकी है। और इन हालातों में हम देख रहे हैं कि राजनीतिक स्वार्थ से भरे कुछ लोग, कुछ दल, संकट के इस समय में भी अपने लिए राजनीतिक अवसर खोज रहे हैं। इसलिए मैं टीवी9 के मंच से फिर कहूंगा, यह समय संयम का है, संवेदनशीलता का है। हमने कोरोना महासंकट के दौरान भी देखा है, जब देशवासी एकजुट होकर संकट का सामना करते हैं, तो कितने सार्थक परिणाम आते हैं। इसी भाव के साथ हमें इस युद्ध से बनी परिस्थितियों का सामना करना है।

साथियों,

दुनिया की हर उथल-पुथल के बीच, भारत ने अपनी प्रगति की गति को भी बनाए रखा है। अगर मैं 28 फरवरी को युद्ध शुरू होने के बाद, बीते 23 दिनों का ही ब्यौरा दूं, तो पूरब से पश्चिम तक, उत्तर से दक्षिण तक देश में हजारों करोड़ के डेवलपमेंट प्रोजेक्ट्स का काम हुआ है। दिल्ली मेट्रो रेल के महत्वपूर्ण कॉरिडोर्स का लोकार्पण, सिलचर का हाई स्पीड कॉरिडोर का शिलान्यास, कोटा में नए एयरपोर्ट का शिलान्यास, मदुरै एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा देना, ऐसे अनेक काम बीते 23 दिनों में ही हुए हैं। बीते एक महीने के दौरान ही औद्योगिक विकास को गति देने के लिए भव्य स्कीम को मंजूरी दी गई है। इसके तहत देशभर में 100 plug-and-play industrial parks विकसित किए जाएंगे। देश में Small Hydro Power Development Scheme को भी हरी झंडी दी गई है। इससे आने वाले वर्षों में 1,500 मेगावाट नई hydro power capacity जोड़ी जाएगी। इसी दौरान जल जीवन मिशन को साल 2028 तक बढ़ाने का निर्णय लिया गया है। किसानों के हित में भी अनेक बड़े निर्णय लिए गए हैं। बीते एक महीने में ही पीएम किसान सम्मान निधि के तहत 18 हजार करोड़ रुपए से अधिक सीधे किसानों के खातों में ट्रांसफर किए गए हैं। और जो हमारे MSMEs हैं, जो हमारे निर्यातक हैं, उनके लिए भी करीब 500 करोड़ रुपए के राहत पैकेज की भी घोषणा की गई है। यह सारे कदम इस बात का प्रमाण हैं कि विकसित भारत बनाने के लिए देश कितनी तेज गति से काम कर रहा है।

साथियों,

Management की दुनिया में एक सिद्धांत कहा जाता है - What gets measured, gets managed. लेकिन मैं इसमें एक बात और जोड़ना चाहता हूं, What gets measured, gets improved और ultimately, gets transformed. क्योंकि आकलन जागरूकता पैदा करता है। आकलन जवाबदेही तय करता है और सबसे महत्वपूर्ण आकलन संभावनाओं को जन्म देता है।

साथियों,

अगर आप 2014 से पहले के 10-11 साल और 2014 के बाद के 10-11 साल का आप आकलन करेंगे, तो यही पाएंगे कि कैसे इसी सिद्धांत पर चलते हुए, भारत ने हर सेक्टर को Transform किया है। जैसे पहले हाईवे बनते थे, करीब 11-12 किलोमीटर प्रति दिन की रफ्तार से, आज भारत करीब 30 किलोमीटर प्रतिदिन की स्पीड से हाईवे बना रहा है। पहले पोर्ट्स पर शिप का Turnaround Time, 5-6 दिन का होता था। आज वही काम, करीब-करीब 2 दिन से भी कम समय में पूरा हो रहा है। पहले Startup Culture के बारे में चर्चा ही नहीं होती थी। 2014 से पहले, हमारे देश में 400-500 स्टार्ट अप्स ही थे। आज भारत में 2 लाख से ज्यादा रजिस्ट्रर्ड स्टार्ट अप्स हैं। पहले मेडिकल education में सीटें भी सीमित थीं, करीब 50-55 हजार MBBS seats थीं, आज यह बढ़कर सवा लाख से ज्यादा हो चुकी हैं। पहले देश के Banking system से भी करोड़ों लोग बाहर थे। देश में सिर्फ 25 करोड़ के आसपास ही बैंक account थे। वहीं जनधन योजना के माध्यम से 55 करोड़ से ज्यादा बैंक अकाउंट खुले हैं। पहले हमारे देश में airports की संख्या भी 70 से कम थी। आज एयरपोर्ट्स की संख्या भी बढ़कर 160 से ज्यादा हो चुकी है।

साथियों,

पहले भी योजनाएं तो बनती थीं, लेकिन आज फर्क है, आज परिणाम दिखते हैं। पहले गति धीमी थी, आज भारत fastrack पर है। पहले संभावनाएं भी अंधकार में थीं, आज संकल्प सिद्धियों में बदल रहे हैं। इसलिए दुनिया को भी यह संदेश मिल रहा है कि यह नया भारत है। यह अपने विकास के लिए कोई कोर-कसर बाकी नहीं छोड़ रहा है।

साथियों,

आज हमारा प्रयास है कि अतीत में विकास का जो असंतुलन पैदा हो गया था, उसको अवसरों में बदला जाए। अब जैसे हमारा पूर्वी भारत है। हमारा पूर्वी भारत संसाधनों से समृद्ध है, दशकों तक वहां जिन्होंने सरकारें चलाई हैं, उनकी उपेक्षा ने पूर्वी भारत के विकास पर ब्रेक लगा दी थी। अब हालात बदल रहे हैं। जिस असम में कभी गोलियों की आवाज सुनाई देती थी, आज वहां सेमीकंडक्टर यूनिट बन रही है। ओडिशा में सेमीकंडक्टर से लेकर पेट्रोकेमिकल्स तक अनेक नए-नए सेक्टर का विकास हो रहा है। जिस बिहार में 6-7 दशक में गंगा जी पर एक बड़ा पुल बन पाया था एक, उस बिहार में पिछले एक दशक में 5 से ज्यादा नए पुल बनाए गए हैं। यूपी में कभी कट्टा मैन्युफैक्चरिंग की कहानियां कही जाती थीं, आज यूपी, मोबाइल फोन मैन्युफैक्चरिंग में दुनिया में अपनी पहचान बना रहा है।

साथियों,

पूर्वी भारत का एक और बड़ा राज्य पश्चिम बंगाल है। पश्चिम बंगाल, एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था। बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है। लेकिन दुर्भाग्य से, आज वहां एक ऐसी निर्मम सरकार है, जो विकास पर ब्रेक लगाकर बैठी है। TV9 बांग्ला के जो दर्शक हैं, वो जानते हैं कि बंगाल में आयुष्मान योजना पर निर्मम सरकार ने ब्रेक लगाया हुआ है। पीएम सूर्यघर मुफ्त बिजली योजना पर ब्रेक लगाया हुआ है। पीएम आवास योजना पर ब्रेक लगाया हुआ है। चाय बागान श्रमिकों के लिए शुरू हुई योजना के लिए ब्रेक लगाया हुआ है। यानी विकास और जनकल्याण से ज्यादा प्राथमिकता निर्मम सरकार अपने राजनीतिक स्वार्थ को दे रही है।

साथियों,

देश में इस तरह की राजनीति की शुरुआत जिस दल ने की है, वो अपने गुनाहों से बच नहीं सकती और वो पार्टी है - कांग्रेस। कांग्रेस पार्टी की राजनीति का एक ही लक्ष्य रहा है, किसी भी तरह विकास का विरोध और कांग्रेस यह तब से कर रही है, जब मैं गुजरात में था। गुजरात में वर्षों तक जनता ने हमें आशीर्वाद दिया, तो कांग्रेस ने उस जनादेश को स्वीकार नहीं किया। उन्होंने गुजरात की छवि पर सवाल उठाए, उसकी प्रगति को कटघरे में खड़ा किया और जब यही विश्वास पूरे देश में दिखाई दिया, तो कांग्रेस का विरोध भी रीजनल से नेशनल हो गया।

साथियों,

जब राजनीति में विरोध, विकास के विरोध में बदल जाए, जब आलोचना देश की उपलब्धियों पर सवाल उठाने लगे, तब यह सिर्फ सरकार का विरोध नहीं रह जाता, यह देश की प्रगति से असहज होने की मानसिकता बन जाती है। आज कांग्रेस इसी मानसिकता की गुलाम बन चुकी है। आज स्थिति यह है कि देश की हर सफलता पर प्रश्न उठाया जाता है, हर उपलब्धि में कमी खोजी जाती है और हर प्रयास के असफल होने की कामना की जाती है। कोविड के समय, देश ने अपनी वैक्सीन बनाई, तो कांग्रेस ने उस पर भी संदेह जताया। Make in India की बात हुई, तो कहा गया कि यह सफल नहीं होगा, बब्बर शेर कहकर इसका मजाक उड़ाया गया। जब देश में डिजिटल इंडिया अभियान शुरू हुआ, तो उसका मजाक उड़ाया गया। लेकिन हर बार यह कांग्रेस का दुर्भाग्य और देश का सौभाग्य रहा कि भारत ने हर चुनौती को सफलता में बदला। आज भारत दुनिया की सबसे बड़ी वैक्सीनेशन ड्राइव का उदाहरण है। भारत डिजिटल पेमेंट्स में दुनिया का अग्रणी देश है। भारत मैन्युफैक्चरिंग और स्टार्टअप्स में नई ऊंचाइयों को छू रहा है।

साथियों,

लोकतंत्र में विरोध जरूरी होता है। लेकिन विरोध और विद्वेष के बीच एक रेखा होती है। सरकार का विरोध करना लोकतांत्रिक अधिकार है। लेकिन देश को बदनाम करना, यह कांग्रेस की नीयत पर सवाल खड़ा करता है। जब विरोध इस स्तर तक पहुंच जाए कि देश की उपलब्धियां भी असहज करने लगें, तो यह राजनीति नहीं, यह दृष्टिकोण की समस्या है। अभी हमने ग्लोबल AI समिट में भी देखा है। जब पूरी दुनिया भारत में जुटी हुई थी, तो कांग्रेस के लोग कपड़े फाड़ने वहां पहुंच गए थे। इन लोगों को देश की इज्जत की कितनी परवाह है, यह इसी से पता चलता है। इसलिए आज आवश्यकता है कि देशहित को, दलहित से ऊपर रखा जाए क्योंकि अंत में राजनीति से ऊपर, राष्ट्र होता है, राष्ट्र का विकास होता है।

साथियों,

आज का यह दिन भी हमें यही प्रेरणा देता है। आज के ही दिन शहीद भगत सिंह, शहीद राजगुरु और शहीद सुखदेव ने देश के लिए सर्वोच्च बलिदान दिया था। आज ही, समाजवादी आंदोलन के प्रखर आदर्श डॉ. राम मनोहर लोहिया जी की जयंती भी है। यह वो प्रेरणाएं हैं, जिन्होंने देश को हमेशा स्व से ऊपर रखा है। देशहित को सबसे ऊपर रखने की यही प्रेरणा, भारत को विकसित भारत बनाएगी। यही प्रेरणा भारत को आत्मनिर्भर बनाएगी। मुझे पूरा विश्वास है कि टीवी9 की यह समिट भी भारत के आत्मविश्वास और दुनिया के भरोसे पर, भारतीयों पर जो भरोसा है, उस भरोसे को और सशक्त करेगी। आप सभी को मेरी तरफ से बहुत-बहुत शुभकामनाएं हैं और आपके बीच आने का अवसर दिया, आप सबसे मिलने का मौका लिया, इसलिए बहुत-बहुत धन्यवाद!

नमस्‍कार!