బీనా-పన్ కీ మల్టీ ప్రోడక్ట్ పైప్ లైన్ ప్రాజెక్టు ను ఆయనప్రారంభించారు
‘‘ఉత్తర్ ప్రదేశ్ లో జోడు ఇంజన్ ల ప్రభుత్వం గతం లో కోల్పోయిన కాలాన్ని భర్తీచేసే ప్రయత్నం లో ఉంది. మేం రెట్టింపు వేగం తో పని చేస్తున్నాం’’
‘‘మా ప్రభుత్వం కాన్ పుర్ మెట్రో కు శంకుస్థాపన చేసింది. మరి మాప్రభుత్వమే దానిని దేశ ప్రజల కు అంకితం చేస్తున్నది. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్- వే కు మా ప్రభుత్వం శంకుస్థాపనచేసింది, మా ప్రభుత్వం ఆ పని ని పూర్తి చేసింది’’
‘‘మేం కాన్ పుర్ మెట్రో ను ఇవాళ కలిపామా అంటేఉత్తర్ ప్రదేశ్ లో మెట్రో పొడవు ప్రస్తుతం 90 కిలో మీటర్ లకు మించిపోయింది; అది 2014 లో 9 కిలో మీటర్ లు గా ఉంది, మరి 2017 లో అది కేవలం 18 కిలో మీటర్ లు గానే ఉండింది’’
‘‘రాష్ట్రాల స్థాయి లో, సమాజం లో అసమానత ను తొలగించడం ముఖ్యం; అందుకనే మాప్రభుత్వం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ మంత్రం స్ఫూర్తి తో పని చేస్తున్నది’’
‘‘రెండు ఇంజన్ ల ప్రభుత్వాని కి పెద్ద లక్ష్యాల ను ఎలాఏర్పరచుకోవాలో, వాటిని ఎలా సాధించాలో తెలుసు’’

కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఆయన కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను పరిశీలించారు. ఐఐటి మెట్రో స్టేశన్ నుంచి గీతా నగర్ వరకు మెట్రో లో ఆయన ప్రయాణించారు. ఆయన బీనా-పన్ కీ మల్టీ ప్రోడక్ట్ పైప్ లైన్ ప్రాజెక్టు ను కూడా ప్రారంభించారు. ఈ గొట్టపు మార్గం మధ్య ప్రదేశ్ లోని బీనా చమురు శుద్ధి కర్మాగారం నుంచి కాన్ పుర్ లోని పన్ కీ వరకు ఉండి, బీనా రిఫైనరీ నుంచి పెట్రోలియమ్ ఉత్పత్తులు ఈ ప్రాంతం లో అందుబాటు లోకి రావడానికి తోడ్పడనుంది. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురీ లు కూడా పాల్గొన్నారు.

మెట్రో సంధానం మరియు గొట్టపు మార్గం ప్రాజెక్టు ల ప్రారంభాని కి గాను కాన్ పుర్ ప్రజల కు ప్రధాన మంత్రి అభినందన లు తెలియ జేశారు. కాన్ పుర్ తో తనకు చాలా కాలం గా ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు కు తెచ్చుకొంటూ, తన ఉపన్యాసాన్ని అనేక స్థానిక ప్రస్తావనల తో మొదలు పెట్టారు; కాన్ పుర్ ప్రజలు ఏదీ అంత గా పట్టించుకోరు, సరదా గాను ఉంటారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శ్రీయుతులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయీ, ఇంకా సున్దర్ సింహ్ భండారీ వంటి దిగ్గజాల ను మలచడం లో కాన్ పుర్ నగరం పోషించినటువంటి పాత్ర ను కూడా గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ రోజు మంగళ వారం అని ఆయన చెప్తూ, పన్ కీ వాలే హనుమాన్ జీ ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి లో మరొక సువర్ణ అధ్యాయాని కి ఆశీస్సులు అందించాలి అని కూడా అన్నారు. ‘‘ఉత్తర్ ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న జంట ఇంజన్ ల ప్రభుత్వం గతం లో చేజారినటువంటి కాలాన్ని భర్తీ చేయడం కోసం ప్రయత్నిస్తున్నది. మేము రెట్టింపు వేగం తో పని చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం లో మార్పు చోటు చేసుకొందని ప్రధాన మంత్రి తెలిపారు. చట్టవిరుద్ధ ఆయుధాల కు పేరు పడ్డ రాష్ట్రం ప్రస్తుతం డిఫెన్స్ కారిడార్ కు కేంద్ర స్థానం లో ఉండి దేశ సురక్ష కు, భద్రత కు తోడ్పాటు ను అందిస్తున్నది అని ఆయన అన్నారు. తుది గడువు ను పాటించేటటువంటి పని సంస్కృతి గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, శంకుస్థాపన లు జరిగిన పనుల ను పూర్తి చేయడానికి జోడు ఇంజన్ ల ప్రభుత్వాలు రాత్రింబగళ్ళు పని చేస్తున్నాయి అన్నారు. ‘‘మా ప్రభుత్వం కాన్ పుర్ మెట్రో కు శంకుస్థాపన చేసింది, దానిని మా ప్రభుత్వమే దేశ ప్రజల కు అంకితం చేస్తోంది. మా ప్రభుత్వం పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్- వే కు శంకుస్థాపన చేసింది, మా ప్రభుత్వమే ఆ పని ని పూర్తి చేసింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో రాబోతున్న అతి పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గురించి, అలాగే దేశం లో అతి పొడవైన ఎక్స్ ప్రెస్- వే కూడా ఈ రాష్ట్రం లో నిర్మాణం లో ఉన్న సంగతి ని గురించి, ఉత్తర్ ప్రదేశ్ లో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ హబ్ ఏర్పాటవుతోందన్న విషయాన్ని గురించి చెప్తూ ఆ ప్రధాన కార్యసాధనల ను ఒక్కటొక్కటి గా వెల్లడించారు.

2014వ సంవత్సరం కన్నా పూర్వం ఉత్తర్ ప్రదేశ్ లో మెట్రో మొత్తం పొడవు చూస్తే 9 కిలో మీటర్ లు గా ఉంది, 2014వ సంవత్సరం మరియు 2017వ సంవత్సరం మధ్య కాలం లో మెట్రో పొడవు 18 కిలో మీటర్ లకు పెరిగింది. మనం నేటి కాన్ పుర్ మెట్రో ను కలిపామా అంటే గనక రాష్ట్రం లో మెట్రో పొడవు 90 కిలో మీటర్ లకు మించింది అని ప్రధాన మంత్రి వివరించారు.

గతం లో అభివృద్ధి సంబంధి అసమానత ను గురించి ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, దశాబ్దాలు గా ఒక ప్రాంతం అభివృద్ధి కి నోచుకొంది అంటే, మరొక ప్రాంతం వెనుకపట్టున ఉండిపోయింది అన్నారు. ‘‘రాష్ట్రాల స్థాయి లో సమాజం లోని ఈ అసమానత ను తొలగించడం అనేది అంతే ముఖ్యమైనటువంటి విషయం. ఈ కారణం గా మా ప్రభుత్వం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ మంత్రం స్ఫూర్తి తో పని చేస్తోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం అవసరాల ను గ్రహించి, జంట ఇంజన్ ల ప్రభుత్వం గట్టి పనిని చేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదివరకు గొట్టపు మార్గం ద్వారా నీరు ఉత్తర్ ప్రదేశ్ లో కోట్ల కొద్దీ కుటుంబాల కు అందేది కాదు. ప్రస్తుతం మేము ‘హర్ ఘర్ జల్ మిశన్’ ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లో ప్రతి ఒక్క కుటుంబాని కి స్వచ్ఛమైన నీటి ని అందించే పని లో నిమగ్నం అయ్యాం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ ను అభివృద్ధి తాలూకు కొత్త శిఖరాల కు చేర్చడం కోసం డబల్ ఇంజన్ గవర్నమెంటు చిత్తశుద్ధి తో బాధ్యతాయుతం గా కృషి చేస్తోంది. పెద్ద లక్ష్యాల ను ఎలా ఏర్పరచుకోవాలి, మరి వాటి ని ఎలాగా సాధించాలి అనే అంశాలు డబల్ ఇంజన్ గవర్నమెంట్ కు తెలుసు అని ఆయన అన్నారు. ట్రాన్స్ మిశన్, విద్యుత్తు స్థితి, నగరాల మరియు నదుల స్వచ్ఛత వంటి అంశాల లో మెరుగుదల ను గురించి ఆయన ఈ సందర్భం లో ఉదాహరించారు. 2014వ సంవత్సరం నాటి కి రాష్ట్రం లో పట్టణ పేదల కు కేవలం 2.5 లక్షల ఇళ్ళు ఉండగా, గత నాలుగున్నర సంవత్సరాల లో 17 లక్షల ఇళ్ళ కు ఆమోదం ఇవ్వడం జరిగింది అని ఆయన తెలియ జేశారు. అదే మాదిరి గా వీధుల లో తిరుగుతూ వస్తువుల ను అమ్మే వారు మొట్టమొదటిసారి గా పిఎమ్ స్వనిధి యోజన ప్రభుత్వ శ్రద్ధ కు నోచుకొన్నారు; 7 లక్షల మంది కి పైగా 700 కోట్ల రూపాయల పై చిలుకు మొత్తాన్ని అందుకొన్నారు. మహమ్మారి కాలం లో ప్రభుత్వం రాష్ట్రం లో 15 కోట్ల మంది కి పైగా పౌరుల కు ఉచితం గా ఆహార పదార్థాల ను ఇచ్చింది. 2014వ సంవత్సరం లో దేశం లో 14 కోట్ల ఎల్ పిజి కనెక్శన్ లే ఉండేవి. ప్రస్తుతం 30 కోట్ల పై చిలుకు కనెక్శన్ లు ఉన్నాయి. ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లోనే, 1.60 కోట్ల కుటుంబాలు కొత్త ఎల్ పిజి కనెక్శన్ లను అందుకొన్నాయి అని ఆయన అన్నారు.

చట్టం, వ్యవస్థ ల స్థితి మెరుగు పడటాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, యోగి ప్రభుత్వం మాఫియా సంస్కృతి ని నిర్మూలించింది, దీనితో యుపి లో పెట్టుబడి పెరిగిందన్నారు. వ్యాపారం, ఇంకా పరిశ్రమ ల సంస్కృతి ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం కాన్ పుర్ లో, ఫజల్ గంజ్ లో మెగా లెదర్ క్లస్టర్ కు ఆమోదం తెలిపింది, డిఫెన్స్ కారిడార్ తో పాటు, ‘వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్’ వంటి పథకాలు కాన్ పుర్ కు చెందిన వ్యాపారుల కు, నవ పారిశ్రామికవేత్తల కు ప్రయోజనకారి అవుతాయి అని ఆయన తెలిపారు. చట్టాన్ని గురించి భయపడిన కారణం గా నేరగాళ్ళు వెనుకంజ వేశారు అని కూడా ఆయన అన్నారు. అధికారులు జరిపిన దాడుల ద్వారా ఇటీవల చట్టవిరుద్ధ ధన రాశి బయల్పడింది అని ఆయన ప్రస్తావిస్తూ ప్రజలు అటువంటి వ్యక్తుల పని సంస్కృతి ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Somnath Swabhiman Parv: “Feeling blessed to be in Somnath, a proud symbol of our civilisational courage,” says PM Modi

Media Coverage

Somnath Swabhiman Parv: “Feeling blessed to be in Somnath, a proud symbol of our civilisational courage,” says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 జనవరి 2026
January 11, 2026

Dharma-Driven Development: Celebrating PM Modi's Legacy in Tradition and Transformation