ఈ అభివృద్ధి ప్రాజెక్టులలో ఆరోగ్యం, రైలు, రోడ్డు, చమురు, గ్యాస్ సంబంధిత రంగాలకు చెందినవి ఉన్నాయి.
షిర్దీ సాయిబాబా ఆలయంలో కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి.
నీలవాండే డ్యామ్ ఎడమకాలువ నెట్ వర్క్ ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి.
నమో షేత్కారి మహాసన్మాన్ నిధి యోజనను ప్రారంభించిన ప్రధానమంత్రి.
ఆయుష్మాన్ కార్డులు, స్వమిత్వ కార్డులను లబ్దిదారులకు అందజేసిన ప్రధానమంత్రి.
దేశం పేదరికం నుంచి విముక్తిపొందినపుడు, పేదలకు పుష్కలంగా అవకాశాలు లభించడమే సామాజిక న్యాయానికి నిజమైన అర్థం’
డబుల్ ఇంజిన్ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత, గరీబ్ కల్యాణ్’
ప్రభుత్వం రైతుల సాధికారతకు కట్టుబడి ఉంది.
‘‘సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు మన ప్రభుత్వం కృషిచేస్తోంది ’’
“ మహారాష్ట్రకు ఎంతో సామర్ధ్యం ఉంది. ఎన్నో అవకాశాలున్నాయి "
“మహారాష్ట్ర పురోగతి లాగా ఇండియా వృద్ధి కొనసాగుతుంది "

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఈరోజు మహారాష్ట్రలో ని అహ్మద్నగర్జిల్లా షిర్దీలో సుమారు రూ 7500 కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు వంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులలో ఆరోగ్యం,రైల్వే, రోడ్ఉ, చమురు, గ్యాస్ కు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. .ఈ బహుళ అభివృద్ధి ప్రాజెక్టులలో అహ్మద్ నగర్ సివిల్ ఆస్పత్రిలో ఆయుష్ ఆస్పత్రి , కురుడువాడి– లాతూరు రైల్వే సెక్షన్ (186 కి.మి), జలగాం నుంచి భూస్వాల్ ను కలిపే 3వ, నాలుగవ రైల్వేలైన్లు(24.46 కి.మీ),

 

సంగ్లీ నుంచి బోరగాన్ సెక్షన్ ఎన్.హెచ్ 66 (పాకేజ్ –1) ను నాలుగు లైన్లుగ మార్చడం, మన్మాడ్ టెర్మినల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వద్ద అదనపు సదుపాయాలు కల్పించడం, వంటివి ఉన్నాయి. 
అహ్మద్ నగర్ సివిల్ ఆస్పత్రిలో మాతా, శిశు ఆరోగ్య విభాగానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు ఆయుష్మాన్ కార్డలు, స్వమిత్వ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే, ప్రధానమంత్రి షిర్దీలో నూతన దర్శన్కాంప్లెక్స్ను , నిల్వాండే ఎడమకాల్వ నెట్వర్క్ (85కిలోమీటర్ల కాల్వ)ను జాతికి అంకితం చేశారు. అలాగే నమో షేత్కారి మహాసన్మాన్ నిధి యోజనను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. దీని వల్ల 86 లక్షలమంది రైతులు ప్రయోజనం పొందుతారు. అంతకు ముందు, ప్రధానమంత్రి షిర్దీలో, శ్రీ షిర్దీ సాయిబాబా సంస్థాన్ మందిరంలో షిర్దీ సాయిబాబా పూజను, నిల్వాండే డ్యామ్ వద్ద జల పూజను నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అక్కడ హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతో
 

సుమారు రూ7500 కోట్లరూపాయల విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామని అన్నారు.
నిల్వాండే డ్యామ్ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి ఈ, ప్రాజెక్టు 5 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉందని అన్నారు. దీనిని ఇవాళ ప్రారంభించుకుంటున్నామని తెలిపారు.
ఈ ప్రాజెక్టు ప్రాంతంలో జలపూజ చేసే మహద్భాగ్యం కలిగినందుకు ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
షిర్దీ సాయి సమాధి ఆలయంలో దర్శన్ క్యూ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఈ కాంప్లెక్స్కు 2018 అక్టోబర్ లో తాను శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్యూకాంప్లెక్స్ దేశ విదేశాలనుంచి ఇక్కడికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పంచనున్నట్టు తెలిపారు.వర్కారి కమ్యూనిటీకి చెందిన బాబా మహరాజ్ సతార్కర్ ఈ ఉదయం మరణించడం పట్ల ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాబా మహరాజ్కు ప్రధానమంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబా మహరాజ్ సామాజిక సేవాకార్యక్రమాలను ఆయన గుర్తు తెచ్చుకున్నారు. వారి కీర్తనలు,ప్రవచనాలు తర తరాలకు ప్రేరణనిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. “ సామాజిక న్యాయం అసలు అర్థం, దేశం పేదరికం నుంచి విముక్తి అయినపుడు, పేదలకు పుష్కలమైన అవకాశాలు లభించినపుడే ’’నని ప్రధానమంత్రి అన్నారు.
 

సబ్కా సాథ్, సబ్ కా వికాస్ అన్నది ప్రభుత్వ మంత్రమని ప్రధాని పునరుద్ఘాటించారు. పేదల సంక్షేమం తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రాధాన్యతాంశమని ప్రధాని చెప్పారు. ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటున్న కొద్దీ ఇందుకు తమ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు పెంచుతున్నదని, ప్రధానమంత్రి తెలిపారు.మహారాష్ట్రలో కోటీ 10 లక్షల ఆయుష్మాన్ కార్డులను లబ్ధిదారులకు  పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్డుల లబ్ధిదారులు 5 లక్షలరూపాయల వరకు ప్రభుత్వ ఆరోగ్య బీమా పొందుతారన్నారు. ఈపథకంపై ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నట్టు తెలిపారు. పేదలకు ఉచిత రేషన్, పక్కా గృహాల నిర్మాణానికి ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలియజేశారు.
 2014కు ముందు ఖర్చుచేసిన మొత్తం కంటే ఇది 6 రెట్లు ఎక్కువని ప్రధానమంత్రి తెలిపారు. పేదల గృహాలకు కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇందుకు ప్రభుత్వం సుమారు 2 లక్షలకోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేసినట్టు తెలిపారు.
 

ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద, వీధివ్యాపారాలు పదివేల రూపాయల వరకు సహాయం పొందుతున్నారన్నారు. కొత్తగా ప్రారంభించిన పి.ఎం. విశ్వకర్మ పథకం గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు. ఇది లక్షలాది కర్పెంటర్లు, విశ్వకర్మలు, శిల్పకారులు, మట్టిపాత్రలు తయారుచేసే కుటుంబాల వారికి ప్రయోజనంకలిగిస్తుందన్నారు. ప్రభుత్వం వీరికోసం 13,000 కోట్లరూపాయలు ఖర్చుచేస్తున్నట్టు తెలిపారు.

 

చిన్న రైతుల గురించి ప్రస్తావిస్తూ పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి కింద చిన్న రైతులు 2 లక్షల 60 వేల కోట్ల రూపాయలు అందుకున్నారని, అందులో మహారాష్ట్రలోని సన్నకారు రైతులు  26 వేల కోట్ల రూపాయలు అందుకున్నారని అన్నారు. మహారాష్ట ప్రభుత్వం , నమో షేత్కారి మహాసమ్మాన్ నిధి యోజనను ప్రారంభించిందని, దీని కింద మహారాష్ట్ర షేత్కారి కుటుంబాలు అదనంగా 6000 రూపాయలు పొందుతారన్నారు. అంటే సమ్మాన్ నిధి కింద స్థానిక రైతులు 12,000లు పొందుతారని ప్రధానమంత్రి తెలిపారు. నిల్ వాండే ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, దీనికి 1970లో అనుమతి లభించిందని, ఐదు దశాబ్దాలుగా ఇది పెండింగ్ లో ఉందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే  ఈ ప్రాజెక్టుపూర్తి అయిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. రైతుల పేరుతో ఓటు రాజకీయాలు చేస్తున్న వారు, ప్రతిచుక్కనీటికోసం ఎదురుచూసే పరిస్థితి తెచ్చారని అన్నారు. కానీ ఇవాళ ఇక్కడ ఆ పరిస్థితి మారి జల పూజ చేసుకున్నామన్నారు. త్వరలోనే కుడి కాలువ అందుబాటులోకి వస్తుందన్నారు. బలిరాజ జల్ సంజీవని యోజన గురించి కూడా వారు ప్రస్తావించారు. ఇది రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో మరో 26 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.ఈ ప్రాజెక్టులు దశాబ్దాలుగా పెండింగ్ లో  ఉన్నాయని, ఇవి పూర్తి అయితే ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.

రైతుల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గత 7 సంవత్సరాలలో కనీస మద్దతు ధర కింద 13.5 లక్షల కోట్ల రూపాయల విలువగల ఆహారధాన్యాలను సేకరించినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలోని ఒక సీనియర్ నాయకుడి కాలంలో ఇది కేవలం 3.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనని ప్రధానమంత్రి గుర్తుచేశారు. 2014 తర్వాత లక్షా 15 వేల కోట్ల రూపాయల విలువగల చమురుగింజలు, పప్పుధాన్యాలను కొనుగోలు చేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు. గతంలో ఇవి  500-600 కోట్ల రూపాయలకు మించలేదని చెప్పారు. ప్రత్యక్షనగదు బదిలీ పథకం తో అవినీతి, లీకేజీలు లేకుండా పోయాయన్నారు.

 

  రబీ పంటలకు కనీస మద్దతుధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మాట్లాడుతూ ప్రధానమంత్రి, శనగపప్పు మద్దతుధరను 105 రూపాయలు పెంచారని, గోధుమలు, పొద్దుతిరుగుడు కనీస మద్దతు ధరను 150 రూపాయలు పెంచినట్టు తెలిపారు. చెరకు మద్దతు ధరను కూడా క్వింటాలుకు 315 రూపాయలపెంచినట్టు తెలిపారు. గత 9 సంవత్సరాలలో 70,000 కోట్ల రూపాయల విలువగల ఇథనాల్ ను కొనుగోలు చేశామని,ఇందుకు సంబంధించి చెరకు రైతులకు నగదు చేరినట్టు ఆయన తెలిపారు. చెరకు రైతులకు సకాలంలో చెల్లింపులు చేసేలా చూడడానికి, చక్కెర మిల్లులకు, సహకార సంఘాలకు వేలాది కోట్ల రూపాయల సహాయాన్ని అందించినట్టు తెలిపారు.

 

సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం క్రుషిచేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల సహకార సంఘాలు ఏర్పాటుచేయనున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. మెరుగైన నిల్వ సదుపాయాలు, శీతల గిడ్డంగుల సదుపాయాల కల్పనకు పిఎసిలకు, సహకార సంఘాలకు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతున్నట్టు చెప్పారు. ఎఫ్.పి.ఒల ద్వారా చిన్నరైతులను సంఘటితం చేయడం జరుగుతోందని, 7500 ఎఫ్.పి.ఒలు ఇప్పటికే పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు.

మహారాష్ట్ర ఎంతో సమర్థత కలిగిన , పుష్కలమైన అవకాశాలు కలిగిన ప్రాంతమని ఆయన అన్నారు. మహారాష్ట్ర వేగంగా అభివ్రుద్ధి చెందితే, ఇండియా అంతే వేగంగా అభివ్రుద్ధి చెందుతుందని ప్రధానమంత్రి అన్నారు. ముంబాయి-షిర్దీ మధ్య  వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మహారాష్ట్రలో రైల్వే నెట్ వర్క్ నిరంతరాయంగా విస్తరిస్తోందని తెలిపారు. జలగాం-భుసావల్ మద్య మూడో, నాలుగో రైల్వే లైన్ ఏర్పాటుతో , ముంబాయి-హౌరా రైల్వే మార్గంలో ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. అలాగే సోలాపూర్ నుంచి బోరోగాన్ మధ్య నాలుగులైన్ల రహదారి  మొత్తం కొంకణ్ ప్రాంత అనుసంధానతను పెంచుతుందన్నారు. ఇది  ఈ ప్రాంత పారిశ్రామిక రంగానికి, చెరకు , ద్రాక్ష, పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందన్నారు.  ఈ అనుసంధానత రవాణా రంగానికే కాక, ఈ ప్రాంత ప్రగతి, ఆర్థిక అభివ్రుద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బాయిస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం: ప్రధానమంత్రి షిర్దీ సాయిబాబా మందిరంలో ప్రారంభించిన కొత్త దర్శన్ క్యూ కాంప్లెక్స్, అత్యాధునిక నిర్మాణ శైలితో రూపొందించిన కాంప్లెక్స్. భక్తులకు మెరుగైన సదుపాయాలు దీని ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఇందులో పలు విశ్రాంతి హాళ్లు,పదివేలమందికి పైగా భక్తులు కూర్చోవడానికి సదుపాయం ఉంది. అలాగే ప్రసాదం కౌంటర్లు, సమాచార కేంద్రం ఇందులో ఉన్నాయి. ఈ నూతన దర్శన్ క్యూ కాంప్లెక్స్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 అక్టోబర్ లో శంకుస్థాపన చేశారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిల్ వాండే డ్యామ్ ఎడమ కాలువ నెట్ వర్క్ (85 కిలొమీటర్లను) జాతికి అంకితం చేశారు. ఇది  అహ్మద్ నగర్ జిల్లాలోని 6 తాలూకాలు, నాసిక్ జిల్లాలోని 1 తాలూకా సహా మొత్తం 7 తాలూకాలలోని 182 గ్రామాలకు పైపు ద్వారా నీటి సరఫరా నెట్ వర్క్ ను కలిగి ఉంటుంది. నిల్ వాండఏ డ్యామ్ నిర్మాణ ఆలోచన తొలుత 1970 లో వచ్చింది. దీనిని సుమారు 5,177 కోట్లరూపాయలతో ఇప్పుడు చేపట్టారు.

అలాగే ప్రధానమంత్రి, నమో షేత్కారి మహాసన్మాన్ నిధి యోజనను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ యోజన , మహారాష్ట్రలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పరిధిలోని 86 లక్షలమంది లబ్ధిదారులకు ఏడాదికి అదనంగా రూ6000 ల ను అందిస్తుంది. ప్రధానమంత్రి ఈ సందర్భంగా అహ్మద్ నగర్ సివిల్ ఆస్పత్రిలో ఆయుష్ ఆస్పత్రి ప్రాజెక్టును, కుర్దువాడి-లాతూర్ రోడ్ రైల్వే సెక్షన్ (186కి.మి) విద్యుదీకరణను, జలగాం- భుసావాల్ మధ్య మూడవ, నాలుగవ రైల్వేలైన్ (24.46 కిలోమీటర్లు) ను, సంగ్లి నుంచి బోర్గాం సెక్షన్ లోని  జాతీయ రహదారి -166 (పాకేజ్ -1)ను నాలుగు లేన్ల రహదారిగా మార్చడానికి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మన్ మాడ్ టెర్మినల్ వద్ద అదనపు సదుపాయాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే ప్రధానమంత్రి, అహ్మద్ నగర్ సివిల్ ఆస్పత్రిలో మాతా , శిశు ఆరోగ్య విభాగానికి శంకుస్థాపన చేశారు. ఆయుష్మాన్, స్వమిత్వ  పథకాల లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ కార్డులు, స్వమిత్వ కార్డులు అందజేశారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India on track to become $10 trillion economy, set for 3rd largest slot: WEF President Borge Brende

Media Coverage

India on track to become $10 trillion economy, set for 3rd largest slot: WEF President Borge Brende
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 ఫెబ్రవరి 2024
February 23, 2024

Vikas Bhi, Virasat Bhi - Era of Development and Progress under leadership of PM Modi