హిమాచల్ దివస్ (హిమాచల్ దినోత్సవం) ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘హిమాచల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం ప్రతిష్ఠాత్మక సంస్కృతికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రంలోని నా సోదర, సోదరీమణులు తమ శ్రమ, ప్రతిభలతోపాటు పరాక్రమం రీత్యా కూడా మంచిపేరు తెచ్చుకున్నారు. విశిష్టమైన ఈ రోజు... మీ అందరి జీవనంలో సుఖ సమృద్ధులతోపాటు ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని, మన ‘దేవభూమి’ ప్రగతిపథంలో శరవేగంగా దూసుకుపోయేటట్లు చేయాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
हिमाचल दिवस की राज्य के सभी लोगों को अनेकानेक शुभकामनाएं। गौरवशाली संस्कृति के लिए विख्यात इस प्रदेश के मेरे भाई-बहन अपने परिश्रम, प्रतिभा और पराक्रम के लिए जाने जाते हैं। यह विशेष अवसर आप सभी के जीवन में सुख-समृद्धि और आरोग्य लेकर आए, साथ ही हमारी देवभूमि को प्रगति के पथ पर…
— Narendra Modi (@narendramodi) April 15, 2025


