వాల్మీకి జయంతి శుభ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
మహర్షి వాల్మీకి ఉత్తమమైన, గొప్పవైన ఆలోచనలు ప్రాచీన కాలం నుంచీ భారతీయ సమాజాన్నీ, కుటుంబ జీవనాన్నీ ఎంతో ప్రభావితం చేశాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. మహర్షి వాల్మీకి సామాజిక సద్భావనతో కూడిన బోధనలు దేశప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూ...వెలుగులు నింపుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉత్తమమైన, గొప్పవైన ఆయన ఆలోచనలు ప్రాచీన కాలం నుంచీ మన సమాజంతో పాటు కుటుంబాలపైన కూడా విస్తృత ప్రభావాన్ని చూపాయి. సామాజిక సద్భావనే ప్రధానంగా ఆయన చేసిన బోధనలు దేశవాసులకు వెలుగులను పంచుతూ, వారికి సదా స్ఫూర్తినిస్తుంటాయి’’ అని పేర్కొన్నారు.
सभी देशवासियों को महर्षि वाल्मीकि जयंती की हार्दिक शुभकामनाएं। प्राचीनकाल से ही हमारे समाज और परिवार पर उनके सात्विक और आदर्श विचारों का गहरा प्रभाव रहा है। सामाजिक समरसता पर आधारित उनके वैचारिक प्रकाशपुंज देशवासियों को सदैव आलोकित करते रहेंगे। pic.twitter.com/VJWk5ayJo8
— Narendra Modi (@narendramodi) October 7, 2025


