మహా అష్టమి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరికీ సుఖశాంతులనూ, ఉత్తమమైన ఆరోగ్యాన్నీ అందించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. అమ్మవారి స్తుతిని కూడా శ్రీ మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని ఇలా పొందుపరిచారు...
‘‘నవరాత్రి లో భాగమైన మహా అష్టమి సందర్భంగా, దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి జీవనంలో సుఖశాంతులతో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
https://m.youtube.com/watch?v=45O8KBhSZ0I
सभी देशवासियों को नवरात्रि की महा अष्टमी की ढेरों शुभकामनाएं। मेरी कामना है कि यह पावन अवसर हर किसी के जीवन में सुख, शांति और उत्तम स्वास्थ्य लेकर आए।https://t.co/ohSYlSrWJq
— Narendra Modi (@narendramodi) September 30, 2025


