పవిత్రమైన బుద్ధ పూర్ణిమ పర్వదిన సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
"బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశవాసులందరికీ శుభాకాంక్షలు. సత్యం, సమానత్వం, సామరస్యం అనే సూత్రాలను బోధించే బుద్ధుని సందేశాలు మానవాళికి మార్గదర్శకంగా నిలిచాయి. త్యాగం, తపస్సుకు అంకితమైన ఆయన జీవితం ప్రపంచాన్ని కరుణ.. శాంతి మార్గంలో నడిచేందుకు సదా ప్రేరేపిస్తూనే ఉంటుంది."
सभी देशवासियों को बुद्ध पूर्णिमा की ढेरों शुभकामनाएं। सत्य, समानता और सद्भाव के सिद्धांत पर आधारित भगवान बुद्ध के संदेश मानवता के पथ-प्रदर्शक रहे हैं। त्याग और तप को समर्पित उनका जीवन विश्व समुदाय को सदैव करुणा और शांति के लिए प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) May 12, 2025


