ఎన్ఎస్‌జీ స్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ఎస్‌జీ సిబ్బంది సాటి లేని పరాక్రమాన్నీ, అంకిత భావాన్నీ ప్రశంసించారు. ‘‘ఉగ్రవాద భూతం బారి నుంచి మన దేశ ప్రజలను కాపాడుతుండటంలో ఎన్ఎస్‌జీ కీలకపాత్రను పోషించింది. ఈ దళం మన దేశ పౌరుల భద్రతకు పూచీపడటంతో పాటు దేశ ముఖ్య సంస్థలను కూడా కంటికి రెప్పలా చూసుకుంటోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ-
‘‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్ స్థాపక దినోత్సవం సందర్భంగా, నేను ఎన్ఎస్‌జీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అద్వితీయ పరాక్రమానికీ, అంకితభావానికీ ఈ దళం తనదైన పేరు తెచ్చుకుంది. మన దేశ ప్రజలను ఉగ్రవాద భూతం బారి నుంచి కాపాడడంలో కీలక పాత్రను పోషించింది.. మన దేశ పౌరుల భద్రతకు పూచీపడటంతో పాటు ముఖ్య సంస్థలనుకంటికి రెప్పలా కాచుకుంటోంది’’ అని పేర్కొన్నారు.
@nsgblackcats
On the occasion of National Security Guard's Raising Day, I extend my best wishes to all NSG personnel. This force has made a mark for its unmatched valour and dedication. NSG has played a vital role in safeguarding the nation from the menace of terrorism, ensuring the security… pic.twitter.com/vouIgNmd69
— Narendra Modi (@narendramodi) October 16, 2025


