శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అందించిన కాలాతీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయన్నారు. ఈ బోధనలు మనకు కరుణ, వినయం, సేవ‌కు సంబంధించిన విలువలను గుర్తు చేస్తాయని పేర్కొన్నారు. ఐక్యత, సామరస్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు మనవాళికి స్ఫూర్తిని అందిస్తున్నాయని అన్నారు. 

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ చూపిన జ్ఞాన మార్గంలో ఎల్లప్పుడూ నడుస్తూ, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.  

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

“శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అందించిన కాలాతీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయి. కరుణ, వినయం, సేవ‌కు సంబంధించిన విలువలను మనకు గుర్తు చేస్తుంటాయి. ఈ బోధనలు ఐక్యత, సామరస్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు మానవాళికి స్ఫూర్తిని అందిస్తాయి.

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ చూపిన జ్ఞాన మార్గంలో మనం ఎల్లప్పుడూ నడుస్తూ, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం. ”

 

“ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੇ ਪਵਿੱਤਰ ਮੌਕੇ 'ਤੇ ਤਹਿ-ਦਿਲੋਂ ਵਧਾਈਆਂ। ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੀਆਂ ਸਦੀਵੀ ਸਿੱਖਿਆਵਾਂ ਦੁਨੀਆ ਭਰ ਵਿੱਚ ਜ਼ਿੰਦਗੀਆਂ ਨੂੰ ਰੌਸ਼ਨ ਕਰਦੀਆਂ ਹਨ; ਸਾਨੂੰ ਦਇਆ, ਨਿਮਰਤਾ ਅਤੇ ਸੇਵਾ ਦੀਆਂ ਕਦਰਾਂ-ਕੀਮਤਾਂ ਦੀ ਯਾਦ ਦਿਵਾਉਂਦੀਆਂ ਹਨ। ਇਹ ਸਿੱਖਿਆਵਾਂ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਏਕਤਾ ਅਤੇ ਭਾਈਚਾਰੇ ਦੀ ਭਾਵਨਾ ਨੂੰ ਮਜ਼ਬੂਤ ​​ਕਰਨ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀਆਂ ਹਨ। ਅਸੀਂ ਹਮੇਸ਼ਾ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਵਲੋਂ ਦਰਸਾਏ ਗਏ ਗਿਆਨ ਦੇ ਮਾਰਗ 'ਤੇ ਚੱਲੀਏ ਅਤੇ ਇੱਕ ਬਿਹਤਰ ਗ੍ਰਹਿ ਬਣਾਉਣ ਲਈ ਯਤਨਸ਼ੀਲ ਰਹੀਏ।“

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending

Media Coverage

Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026