వియత్నాంలోని ఫూ క్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘోర ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ దారుణ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

ఈ సంక్షోభ సమయంలో అక్కడి భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ ప్రతినిధులు బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతీయ అధికారులు వియత్నాం ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ... పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘వియత్నాంలోని ఫు క్వాక్ సమీపంలో భారతీయ పౌరులతో కూడిన పడవ ప్రమాదం వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.

ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

మన రాయబార కార్యాలయం, కాన్సులేట్ బృందాలు సాధ్యమైన అన్ని సహాయక చర్యలను చేపడుతున్నాయి. మన అధికారులు వియత్నాం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు’’

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
UPI — an eventful journey

Media Coverage

UPI — an eventful journey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 ఆగష్టు 2026
August 25, 2026

Nari Shakti to Capital Markets: PM Modi’s Reforms Are Rewiring India’s Growth Story