తనకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. దేశం కోసం మరింత అంకితభావం, విశ్వసనీయత, నిబద్ధతతో పనిచేసేందుకు ఈ సందర్భం తనకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' మంత్రం స్ఫూర్తిగా భారత సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“గౌరవనీయ హరివంశ్ గారూ, మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భం దేశం పట్ల మరింత అంకితభావంతో, విశ్వాసంతో, నిబద్ధతతో పనిచేయడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' మంత్రం స్ఫూర్తిగా భారత సర్వతోముఖాభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం’’.
शुभकामनाओं के लिए आपका हृदय से आभार माननीय हरिवंश जी। यह अवसर देश के लिए और अधिक समर्पण, निष्ठा एवं प्रतिबद्धता के साथ कार्य करने की प्रेरणा देता है। 'सबका साथ, सबका विकास' के मंत्र के साथ हम भारतवर्ष के चौतरफा विकास के लिए प्रतिबद्ध हैं।@harivansh1956 https://t.co/LJLQfLZ08Q
— Narendra Modi (@narendramodi) June 10, 2026


