Prime Minister says ‘Seva Teerth’ will stand as a symbol of duty, compassion and commitment to India First

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సేవా తీర్థ్‌ను జాతికి అంకితం చేశారు. భారత ప్రజలకు సేవ చేయాలనే తన అచంచల సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ... 'నాగరికదేవో భవ' పవిత్ర స్ఫూర్తిని దానికి మార్గదర్శక శక్తిగా ప్రకటించారు.

సేవా తీర్థ్ అంకితభావం... ప్రజాసేవ, పౌరుల సంక్షేమాల పట్ల లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

కర్తవ్యం, కరుణ, ‘ఇండియా ఫస్ట్’ దార్శనికత పట్ల నిబద్ధతలకు ‘సేవాతీర్థ్’ ప్రకాశవంతమైన, శక్తిమంతమైన చిహ్నంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

నిస్వార్థ సేవ చేస్తూ, ప్రజా సంక్షేమం కోసం అవిశ్రాంత అంకితభావంతో తర్వాతి తరాలు ముందుకు సాగేందుకు ఇది స్ఫూర్తినిస్తుందనీ, ప్రజలనూ ఈ దిశగా ముందుకు నడిపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“భారత ప్రజలకు సేవ చేయాలనే అచంచలమైన సంకల్పంతో... నాగరిక్ దేవో భవ అనే పవిత్ర భావన మార్గదర్శనంతో... సేవా తీర్థ్‌ను సవినయంగా జాతికి అంకితం చేశాం.

సేవా తీర్థ్ ఎల్లప్పుడూ కర్తవ్యం, కరుణ, ఇండియా ఫస్ట్ దార్శనికత పట్ల నిబద్ధతలకు ప్రకాశవంతమైన చిహ్నంగా నిలుస్తుంది. ఇది తరతరాలు నిస్వార్థ సేవతో, ప్రజలందరి సంక్షేమం పట్ల అవిశ్రాంత అంకితభావంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిస్తుంది.”

 

“देशवासियों की सेवा के अटूट संकल्प और 'नागरिक देवो भव' की पावन भावना को साथ लेकर, आज ‘सेवा तीर्थ’ को राष्ट्र को समर्पित करने का सौभाग्य मिला।

‘सेवा तीर्थ’ कर्तव्य, करुणा और ‘राष्ट्र प्रथम’ के लिए हमारी प्रतिबद्धता का सशक्त प्रतीक है।

मेरी कामना है कि यह आने वाली पीढ़ियों को निःस्वार्थ सेवा और जन-जन के कल्याण के लिए समर्पित होकर आगे बढ़ने को प्रेरित करता रहे।”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఆగష్టు 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision