ప్రగతి పరామితుల రీత్యా ఉత్తరాఖండ్‌ను దేశంలోనే అగ్రస్థానాన నిలపడంలో తెహ్రీ ప్రజల కృషి, అంకితభావాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
దీనిపై ఎంపీ శ్రీమతి మాలా రాజ్యలక్ష్మి షా ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఈ విజయం సాధించడం ఎంతో గర్వకారణం. దీనిపై తెహ్రీలోని నా సోదర సోదరీమణులందరికీ నా అశేష అభినందనలు. అభివృద్ధి దిశగా మీ కృషికి, అంకితభావానికి ఈ విజయం నిదర్శనం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
इस गौरवपूर्ण उपलब्धि के लिए टिहरी के मेरे सभी भाइयों और बहनों को बहुत-बहुत बधाई! यह विकास के प्रति आपकी लगन और परिश्रम का ही सुफल है। https://t.co/7Mae3vfyEx
— Narendra Modi (@narendramodi) April 22, 2023


