Leaders reaffirm their commitment to work towards a mutually beneficial and trusted partnership
They discuss measures for strengthening cooperation in technology, trade, investment, energy and defense
PM and President Trump exchange views on global issues, including the situation in West Asia and Ukraine
Leaders reiterate commitment to work together for promoting global peace, prosperity and security
Both leaders agree to meet soon

అమెరికా అధ్యక్షుడు శ్రీ ట్రంప్‌తో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. శ్రీ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షునిగా ఎన్నికకావడంతోపాటు అమెరికా అధ్యక్షునిగా రెండోసారి గెలిచినందుకు ప్రధాని అభినందనలు తెలిపారు.
 

తమ రెండు దేశాలకూ పరస్పరం లాభదాయకంగా ఉండే, విశ్వసనీయ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి కట్టుబడి ఉన్నట్లు నేతలిద్దరూ పునరుద్ఘాటించారు. టెక్నాలజీ, వ్యాపారం, పెట్టుబడి, ఇంధనంలతోపాటు రక్షణ రంగాలు సహా విస్తృత శ్రేణితో కూడిన ద్వైపాక్షిక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి చెందిన వివిధ పార్శ్వాలనూ, వాటిని మందుకు తీసుకుపోయే క్రమాన్నీ చర్చించారు.

పశ్చిమ ఆసియా, ఉక్రెయిన్‌లలో స్థితి సహా ప్రపంచ అంశాలపై ఇద్దరు నేతలు ఆలోచనలను పంచుకున్నారు. ప్రపంచ శాంతినీ, సమృద్ధినీ, భద్రతనూ పెంపొందింపచేయడానికి కలసి పనిచేద్దామన్న తమ నిబద్ధతను కూడా వారు పునరుద్ఘాటించారు.  
ఇద్దరు నేతలూ సంప్రదింపులు సాగిస్తూ ఉండాలనీ, ఉభయులకూ వీలైన తేదీన  అతి త్వరలో భేటీ అవ్వాలనీ అంగీకరించారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Financial services adoption increases with more women participation

Media Coverage

Financial services adoption increases with more women participation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మార్చి 2025
March 14, 2025

Appreciation for Viksit Bharat: PM Modi’s Leadership Redefines Progress and Prosperity