ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మిజోరం ప్రజలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో నిన్న దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్ షా దాదాపు రూ.2,500 కోట్లతో సుమారు 11 విభిన్న పథకాలకు ప్రారంభోత్సం, శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“వివిధ రంగాలకు సంబంధించిన ఈ అభివృద్ధి పనులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడటంపై మిజోరం ప్రజలకు నా అభినందనలు” అని ప్రధాని పేర్కొన్నారు.
Congratulations to the people of Mizoram for the boost to the state’s growth trajectory through these development works covering various sectors. https://t.co/o36i7crmuD
— Narendra Modi (@narendramodi) April 2, 2023


