కాశీ అన్నపూర్ణ ఆలయం మహంత్ శ్రీ రామేశ్వర్ పురీ గారు స్వర్గస్తులయ్యారన్న వార్త విని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ మేరకు, ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమంలో ఒక ట్వీట్ చేస్తూ ... "కాశీ అన్నపూర్ణ ఆలయానికి చెందిన మహంత్ రామేశ్వర్ పురీ గారి మరణం తో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఆయన మృతి సమాజానికి తీరని లోటు. మతాన్నీ, ఆధ్యాత్మికతను, సామాజిక సేవతో అనుసంధానించటం ద్వారా, సామాజిక పనుల కోసం, ఆయన ప్రజలను నిరంతరం ప్రేరేపించారు. ఓం శాంతి!" అని పేర్కొన్నారు.
काशी अन्नपूर्णा मंदिर के महंत रामेश्वर पुरी जी के देहावसान से अत्यंत दुख हुआ है। उनका जाना समाज के लिए एक अपूरणीय क्षति है। उन्होंने धर्म और अध्यात्म को समाज सेवा से जोड़कर लोगों को सामाजिक कार्यों के लिये निरंतर प्रेरित किया। ॐ शांति !
— Narendra Modi (@narendramodi) July 10, 2021


