ఝార్‌ఖండ్ లోని జామ్‌తాడా లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ఝార్‌ఖండ్ లోని జామ్‌తాడా లో జరిగిన దుర్ఘటన ను గురించి తెలుసుకొని దు:ఖించాను. ప్రియ జనుల ను కోల్పోయిన వ్యక్తుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని పేర్కొంది.
Pained by the mishap in Jamtara, Jharkhand. My thoughts are with all those who have lost their loved ones. May the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 28, 2024


