పిఎమ్కేర్స్ కు హృద‌యపూర్వకం గా సహాయపడుతున్నందుకు గాను భారతదేశ ప్రజల ను ప్రశంసించినప్రధాన మంత్రి
అత్యవసరస్థితిలోను, ఆపద మరియు విపత్తుల లోను ఉపశమనకారి సహాయాన్ని అందించడం ఒక్కటే కాకుండాదీర్ఘ కాలిక దృక్పథం తో పనిచేయడం తో పాటు గా, కష్టనష్టాల ను తగ్గించే చర్యల కుతోడు సామర్థ్య నిర్మాణం కోసం కూడా కృషి చేయనున్న పిఎమ్ కేర్స్
పిఎమ్కేర్స్ ఫండ్ లో ధర్మకర్తలు గా చేరిన సర్వోన్నత న్యాయస్థానం పూర్వ న్యాయమూర్తి గౌరవనీయజస్టిస్ శ్రీ కె.టి. థామస్, పూర్వ డిప్యూటీ స్పీకర్ శ్రీ కరియా ముండా మరియు శ్రీరతన్ టాటా లు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2022 సెప్టెంబర్ 22వ తేదీ న జరిగిన పిఎమ్ కేర్స్ ఫండ్ ధర్మకర్తల మండలి సమావేశాని కి అధ్యక్షత వహించారు.

పిఎమ్ కేర్స్ ఫండ్ సాయం తో చేపట్టిన వివిధ కార్యక్రమాల పైన, మరియు 4345 మంది బాలల కు సమర్థన ను అందిస్తున్నటువంటి పిఎమ్ కేర్స్ ఫార్ చిల్డ్రన్ స్కీము పైన ఒక ప్రజంటేశను ను ఇవ్వడం జరిగింది. దేశానికి కీలకమైన తరుణం లో ఫండ్ నిర్వహించిన పాత్ర ను ధర్మకర్త లు ప్రశంసించారు. పిఎమ్ కేర్స్ ఫండు కు హృద‌య‌పూర్వకం గా చందాల ను ఇస్తున్నందుకు దేశ ప్రజల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

అత్యవసర స్థితి లో మరియు ఆపద లు, విపత్కర పరిస్థితుల లోను ప్రభావశీలమైన రీతి న స్పందించడం పట్ల పిఎమ్ కేర్స్ కు ఒక విశాలమైన దృక్పథం ఉందని, ఉపశమనకారి సహాయాన్ని అందించడం ఒక్కటే కాకుండా కష్టనష్టాల ను తగ్గించే దిశ లోను, సామర్థ్యం నిర్మాణానికి కూడాను చర్యలు తీసుకొంటుండడం గురించి చర్చ జరిగింది.

పిఎమ్ కేర్స్ ఫండ్ లో ఒక అంతర్భాగం గా మారినందుకు గాను ధర్మకర్తల ను ప్రధాన మంత్రి కొనియాడారు.

పిఎమ్ కేర్స్ ఫండ్ లో ధర్మకర్తలు అంటే కేంద్ర హోం శాఖ మంత్రి మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి , అలాగే ఫండు కు కొత్త గా నామనిర్దేశం జరిగిన ట్రస్టీ లు సమావేశానికి హాజరు అయ్యారు. కొత్త గా ఫండు కు నామనిర్దేశం జరిగిన ట్రస్టీల లో-

· సర్వోన్నత న్యాయస్థానం పూర్వ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కె.టి. థామస్,

· పూర్వ డిప్యూటీ స్పీకరు శ్రీ కరియా ముండా,

· టాటా సన్స్ చైర్మన్ ఇమెరిటస్ శ్రీ రతన్ టాటా లు ఉన్నారు.

పిఎమ్ కేర్స్ ఫండు కు సలహా మండలి ని నిర్మించడం కోసం ఈ కింద పేర్కొన్న ప్రముఖ వ్యక్తుల ను నామినేట్ చేయాలని కూడా ట్రస్టు నిర్ణయించింది:

· పూర్వ కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ రాజీవ్ మెహర్షి,

· ఇన్ఫోసిస్ ఫౌండేశన్ పూర్వ చైర్ పర్సన్ శ్రీమతి సుధ మూర్తి,

· టీచ్ ఫార్ ఇండియా సహ వ్యవస్థాపకుడు మరియు ఇండికార్ప్ స్, పీరామల్ ఫౌండేశన్ ల పూర్వ సిఇఒ శ్రీ ఆనంద్ శాహ్.

నూతన ధర్మకర్త లు మరియు సలహాదారుల ప్రాతినిధ్యం పిఎమ్ కేర్స్ ఫండు యొక్క పనితీరు కు విశాలమైన దృష్టికోణాల ను అందించగలదని ప్రధాన మంత్రి అన్నారు. సార్వజనిక జీవనం లో వారి కి ఉన్న విస్తారమైన అనుభవం ఈ ఫండు ప్రజల యొక్క వివిధ అవసరాల పట్ల ప్రతిస్పందించడం లో మరింత ఉత్సాహాన్ని జోడించగలదు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 07 ఆగష్టు 2026
August 07, 2026

Viksit Bharat Accelerating: 4x Data Centres, Record EV Sales, Ethanol Validation & Northeast Connectivity Under PM Modi’s Watch