‘‘ ‘ఒక భూమి-ఒక ఆరోగ్యం’ ఒక దృష్టికోణాన్ని మనం ప్రపంచం ఎదుట నిలిపాం, ఇందులో ప్రాణులన్నిటి కి- మానవులకు, పశువుల కు లేదా మొక్కల కు- సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ఈ దృష్టికోణంలో భాగం గా ఉంది’’
‘‘తక్కువ ఖర్చు లో వైద్య చికిత్స ను అందేలా చూడడం మా ప్రభుత్వ అత్యున్నతప్రాధాన్యం గా ఉంటూ వస్తున్నది’’
‘‘ఆయుష్మాన్ భారత్ మరియు జన్ ఔషధి పథకాలు పేద ప్రజల యొక్క మరియు మధ్య తరగతిప్రజల యొక్క రోగుల కు ఒక లక్ష కోట్ల రూపాయల కు పైగా సొమ్ము ను ఆదా చేశాయి’’
‘పిఎమ్-ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ అనేది కొత్తఆసుపత్రుల పెంపునకు మాత్రమే కాకుండా, ఒక సరికొత్తది అయినటువంటి మరియు సంపూర్ణమైనటువంటిహెల్థ్ ఇకోసిస్టమ్ ను కూడాను ఏర్పరుస్తున్నది’’
‘‘ఆరోగ్య సంరక్షణ రంగం లో సాంకేతిక విజ్ఞానం పై శ్రద్ధ వహించడం నవపారిశ్రామికవేత్తల కు ఒక గొప్ప అవకాశం వంటిదే కాకుండా అందరి ఆరోగ్య సంరక్షణ కోసంమనం చేస్తున్న ప్రయాసల కు ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది’’
‘‘ప్రస్తుతం ఫార్మా రంగం యొక్క బజారు విలువ 4 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది. ప్రైవేటు రంగాని కి మరియు విద్య రంగాని కి మధ్యసరి అయినటువంటి సమన్వయం ఏర్పడితే ఆ బజారు విలువ పది లక్షల కోట్ల రూపాయలు కాగలదు’’

‘ఆరోగ్యం మరియు వైద్య సంబంధి పరిశోధన’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావంతమైనటువంటి రీతి లో అమలు పరచడం కోసం ప్రభుత్వం ఆలోచనల ను మరియు సూచనల ను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేస్తున్న బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ తొమ్మిదో వెబినార్.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణ ను కోవిడ్ కు ముందు మరియు కోవిడ్ కు తరువాతి కోణాల లో పరిశీలించవచ్చును అని పేర్కొన్నారు. మహమ్మారి సమృద్ధియుక్త దేశాల ను సైతం పరీక్షించింది అని ఆయన అన్నారు. ఈ మహమ్మారి ఆరోగ్యం విషయం లో ప్రపంచ దేశాల అప్రమత్తత పట్ల తన దృష్టి ని కేంద్రీకరించగా భారతదేశం ఒక అడుగు ముందుకు వేసి, వెల్ నెస్ పట్ల శ్రద్ధ వహించింది అని ఆయన అన్నారు. ‘‘ఈ కారణం గానే మనం ప్రపంచం ఎదుట ఒక దృష్టికోణాన్ని నిలిపాం. అది - ‘ఒక భూమి, ఒక ఆరోగ్యం’ అనేది. ప్రాణులు అన్నిటికి అంటే - మానవులు, పశువులు లేదా మొక్కలు అన్న మాట- కీ సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ను అందించడం ఈ దృష్టికోణం లో భాగం గా ఉంది.’’ అని ప్రధాన మంత్రి వివరించారు.

మహమ్మారి కాలం లో సప్లయ్ చైన్ కు సంబంధించిన పాఠాల ను నేర్చుకోవడం జరిగింది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, మరి అది ఒక గొప్ప ఆందోళనకరమైనటువంటి అంశం గా మారింది అన్నారు. మహమ్మారి దాని శిఖర స్థాయి ని చేరుకొన్న కాలం లో మందులు, టీకామందు లు, చికిత్స కు అవసరమైన పరికరాల వంటి ప్రాణ రక్షక సామగ్రి ని ఆయుధాల వలె భావించడం శోచనీయం అని ఆయన అన్నారు. ఇదివరకటి సంవత్సరాల బడ్జెటుల లో భారతదేశం విదేశాల పైన ఆధారపడుతూ ఉండడాన్ని తగ్గించడానికి అదే పని గా ప్రభుత్వం ప్రయత్నిస్తూ వచ్చింది, ఈ విషయం లో స్టేక్ హోల్డర్స్ అందరికి పాత్ర ఉందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.

స్వాతంత్య్రం అనంతర కాలం లో దశాబ్దాల తరబడి ఆరోగ్యం విషయం లో ఒక సమగ్రమైన దీర్ఘకాలిక దార్శనికత లోపించింది అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఆరోగ్యం అనే విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కు ఒక్కదానికే పరిమితం చేయడం కంటే దాని ని యావత్తు ప్రభుత్వ వైఖరి గా ప్రస్తుతం నేను ముందుకు తీసుకు పోతున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘వైద్య చికిత్స అనేది తక్కువ ఖర్చు లో అందుబాటు లో ఉండేటట్లు చూడడం మా ప్రభుత్వ అత్యున్నత ప్రాథమ్యం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా అందజేసిన ఉచిత చికిత్స ల కారణం గా పేద రోగుల కు దాదాపు గా ఎనభై వేల కోట్ల రూపాయలు మిగిలాయి అని ఆయన వెల్లడించారు. రేపటి రోజు న అంటే మార్చి నెల 7వ తేదీ ‘జన్ ఔషధి దివస్’ గా పాటించడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి తెలియజేస్తూ, దేశం అంతటా పేదలు మరియు మధ్యతరగతి ప్రజల కు 9,000 జన్ ఔషధి కేంద్రాల నుండి తక్కువ ఖర్చు లో మందుల ను అందించినందువల్ల దాదాపు గా ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి అని వివరించారు. అంటే, ఈ రెండు పథకాల తోనే పౌరుల కు ఒక లక్ష కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని అర్థం.

తీవ్రమైన జబ్బుల కు చికిత్స చేయాలి అంటే బలమైన ఆరోగ్య రంగ సంబంధి మౌలిక సదుపాయాల ను సమకూర్చుకోవడం ముఖ్యం అని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రభుత్వానికి అతి ముఖ్యమైన అంశాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, దేశవ్యాప్తం గా జనావాసాల కు దగ్గరి ప్రాంతాల లో 1.5 లక్షల కు పైచిలుకు సంఖ్య లో ఆరోగ్య కేంద్రాల ను అభివృద్ధి పరచడం జరుగుతున్నది. వీటి ఉద్దేశ్యం పరీక్ష కేంద్రాల ను మరియు ప్రథమ చికిత్స ను అందుబాటు లోకి తీసుకురావడమే అని ఆయన అన్నారు. మధుమేహం, కేన్సర్, ఇంకా గుండె సంబంధి సమస్యల వంటి గంభీరమైన రుగ్మతల ను పసిగట్టడాని కి అవసరం అయ్యేటటువంటి సదుపాయాలు సైతం ఈ కేంద్రాల లో అందుబాటు లోకి వస్తాయి అని ఆయన చెప్పారు. క్రిటికల్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను చిన్న పట్టణాల కు మరియు పల్లెల కు అందుబాటు లోకి తీసుకు రావడం జరుగుతున్నది. ఇది కొత్త ఆసుపత్రుల సంఖ్య పెరిగేందుకు మాత్రమే కాకుండా, ఒక నవీనమైనటువంటి మరియు సంపూర్ణమైనటువంటి హెల్థ్ ఇకోసిస్టమ్ ను కూడా ఏర్పరుస్తున్నది అని ప్రధాన మంత్రి వివరించారు. ఫలితం గా ఇది ఆరోగ్య రంగంలోని నవ పారిశ్రామికవేత్తల కు, ఇన్వెస్టర్ లకు మరియు వృత్తి నైపుణ్యం కలిగిన వర్గాల కు అనేక అవకాశాల ను కల్పిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆరోగ్య రంగం లో మానవ వనరుల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, గడచిన కొన్ని సంవత్సరాల లో 260 కి పైగా కొత్త వైద్య కళాశాల లను ఆరంభించడమైంది అని తెలియ జేశారు. ఇది 2014 వ సంవత్సరం తో పోల్చి చూసినప్పుడు స్నాతక వైద్య కోర్సులు మరియు స్నాతకోత్తర వైద్య కోర్సుల లో మెడికల్ సీట్ ల సంఖ్య ను రెండింతలు చేసింది అని ఆయన వివరించారు. ఈ సంవత్సరం బడ్జెటు లో నర్సింగ్ రంగం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘వైద్య కళాశాల లకు దగ్గరి ప్రాంతాల లో 157 నర్సింగ్ కళాశాల లను తెరవడం వైద్య చికిత్స రంగ సంబంధి మానవ వనరుల పరం గా తీసుకొన్నటువంటి ఒక పెద్ద నిర్ణయం. ఇది ఒక్క దేశీయ అవసరాల ను తీర్చడం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల అవసరాల ను తీర్చడం లోనూ ఉపయోగకరం అయ్యేందుకు అవకాశం ఉంది’’ అని ఆయన అన్నారు.

వైద్య సంబంధి సేవల ను మరింత మంది కి చౌక గా అందుబాటు లోకి తీసుకుపోతుండడం లో సాంకేతిక విజ్ఞానం యొక్క పాత్ర ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ రంగం లో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం పై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందన్నారు. ‘‘డిజిటల్ హెల్థ్ ఐడి సౌకర్యం ద్వారా పౌరుల కు సరి అయిన కాలం లో ఆరోగ్య సంరక్షణ ను అందించాలి అని మేం కోరుకొంటున్నాం. ఇ-సంజీవని వంటి పథకాల సాయం తో పది కోట్ల మంది ఈసరికే టెలికన్సల్టేశన్ ప్రయోజనాన్ని అందుకొన్నారు’’ అని ఆయన అన్నారు. స్టార్ట్-అప్స్ కు ఈ రంగం లో నూతన అవకాశాల ను 5జి ప్రసాదిస్తున్నది. డ్రోన్స్ అనేవి మెడిసిన్ డెలివరీ లోను, టెస్టింగ్ సర్వీసెస్ లోను క్రాంతికారి మార్పుల ను తీసుకు వస్తున్నాయి. ‘‘ఇది నవ పారిశ్రామికవేత్తల కు ఒక గొప్ప అవకాశం. మరి అందరికి ఆరోగ్య సంరక్షణ విషయం లో మనం చేస్తున్న ప్రయత్నాల కు ఊతం అందుతుంది కూడాను’’ అని ఆయన వివరించారు. ఏ సాంకేతిక పరిజ్ఞాన్ని అయినా దిగుమతి చేసుకోవాలి అనే ధోరణి కి స్వస్తి పలకండి అంటూ నవ పారిశ్రామికవేత్తల కు ఆయన ఉద్భోదించారు. ఈ విషయం లో సంస్థ ల పరం గా ప్రతిస్పందన అవసరం అని ప్రధాన మంత్రి అన్నారు. వైద్య చికిత్స పరికరాల రంగం లో కొత్త పథకాల ను గురించి ఆయన తెలియ జేశారు. ఈ సందర్భం లో ఆయన బల్క్ డ్రగ్ పార్క్ స్, మెడికల్ డివైజ్ పార్క్ స్, పిఎల్ఐ స్కీముల లో ముప్ఫై వేల కోట్ల రూపాయల పైచిలుకు నిధుల ను గురించి వివరించారు. గడచిన కొన్ని సంవత్సరాల లో వైద్య సంబంధి పరికరాల లో 12 నుండి 14 శాతం వృద్ధి ఉంది అని ఆయన తెలిపారు. ఈ బజారు రాబోయే సంవత్సరాల లో 4 లక్షల కోట్ల రూపాయల స్థాయి కి చేరుతుంది అని ఆయన అన్నారు. రాబోయే కాలం లో వైద్య సంబంధి సాంకేతిక విజ్ఞానం తో పాటు, ఖరీదైన ఉత్పత్తుల తయారీ, మరిన్ని పరిశోధన ల కోసం నైపుణ్యం కలిగి ఉండే శ్రమ శక్తి నిర్మాణం పట్ల భారతదేశం ఇప్పటికే కృషి చేస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ఐఐటి వంటి సంస్థ లు, బయో మెడికల్ ఇంజీనియరింగ్ వంటి కోర్సుల ను నిర్వహించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. పరిశ్రమ కు, విద్య రంగాని కి మరియు ప్రభుత్వానికి మధ్య మరింత సమన్వయం ఏర్పడగల మార్గాల ను గుర్తించాలి అని ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారిని ఆయన కోరారు.

భారతదేశం యొక్క ఫార్మ సెక్టర్ పట్ల ప్రపంచాని కి విశ్వాసం పెంపొందుతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, ఈ ధోరణి ని సద్వినియోగపరచుకోవలసిన అవసరాన్ని, అలాగే ఈ ప్రతిష్ట ను కాపాడుకొనే దిశ లో కృషి చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సెంటర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సెక్టర్ లో పరిశోధన కు మరియు నూతన ఆవిష్కరణల కు దన్నుగా నిలచేలా ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది అని ఆయన వెల్లడించారు. ఇది ఆర్థిక వ్యవస్థ ను బలపరచడం తో పాటుగా ఉపాధి తాలూకు కొత్త అవకాశాల ను కూడా అందిస్తుంది అని ఆయన వివరించారు. ‘‘ప్రస్తుతం భారతదేశం లో ఫార్మ సెక్టర్ యొక్క బజారు విలువ నాలుగు లక్ష ల కోట్ల రూపాయలు గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రైవేటు రంగాని కి మరియు విద్య రంగాని కి మధ్య సమన్వయం ఏర్పడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ఎందుకు అంటే, ఇటువంటి సమన్వయం ఏర్పడినప్పుడు బజారు విలువ 10 లక్షల కోట్ల రూపాయల కు పైబడి విస్తరించేందుకు ఆస్కారం ఉంది అని ఆయన అన్నారు. పెట్టుబడుల కు అవకాశం ఉన్న ముఖ్య రంగాల ను గుర్తించండి అంటూ ప్రధాన మంత్రి సూచన చేశారు. ఈ రంగం లో పరిశోధన కు దన్ను గా నిలచేందుకు ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ఐసిఎమ్ఆర్ ద్వారా అనేక ప్రయోగశాలల ను కొత్త గా తెరవడమైంది అని వెల్లడించారు.

వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ అనే అంశం లో ప్రభుత్వం ప్రయాస ల యొక్క ప్రభావాన్ని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. స్వచ్ఛత ధ్యేయం తో చేపట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను గురించి, పొగ సంబంధి వ్యాధుల ను దృష్టి లో పెట్టుకొని తీసుకు వచ్చిన ఉజ్జ్వల పథకాన్ని గురించి, త్రాగునీటి ద్వారా సోకే వ్యాధుల ను ఎదుర్కోవడం కోసం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిశన్ ను గురించి, రక్తహీనత మరియు పోషకాహార లోపం సమస్యల ను పరిష్కరించడం కోసం ఉద్దేశించిన నేశనల్ పోషణ్ మిశన్ ను గురించి ఆయన తెలియ జేశారు. చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం లో ‘శ్రీ అన్నం’ వంటి చిరుధాన్యాల పాత్ర ను గురించి కూడా ఆయన చెప్పారు. అదే విధం గా పిఎమ్ మాతృ వందన యోజన, మిశన్ ఇంద్రధనుష్, యోగ, ఫిట్ ఇండియా మూవ్ మెంట్ మరియు ఆయుర్వేద.. ఇవి వ్యాధుల బారి నుండి ప్రజల ను కాపాడుతున్నాయి అని పేర్కొన్నారు. భారతదేశం లో డబ్ల్యుహెచ్ఒ ఆధ్వర్యం లో గ్లోబల్ సెంటర్ ఫార్ ట్రెడిశనల్ మెడిసిన్ ను నెలకొల్పడాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఆయుర్వేదం లో నిరూపణ ఆధారిత పరిశోధన లు చోటు చేసుకోవాలన్న తన అభ్యర్థన ను పునరుద్ఘాటించారు.

ఆధునిక వైద్య చికిత్స సంబంధి మౌలిక సదుపాయాలు మొదలుకొని ఈ రంగం లోని మానవ వనరుల వరకు ప్రభుత్వం చేపట్టిన ప్రయాసల ను గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. నూతన సామర్థ్యాల ను కేవలం పౌరుల కు ఆరోగ్య సదుపాయాల ను కల్పించడానికే పరిమితం చేయకుండా ప్రపంచ దేశాల లో అత్యంత ఆకర్షణీయమైనటువంటి వైద్య ప్రధాన పర్యటన గమ్యస్థానం లా భారతదేశాన్ని తీర్చిదిద్దాలి అనేటటువంటి లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడమైంది అని ఆయన వివరించారు. భారతదేశం లో వైద్య ప్రధాన పర్యటన అనేది ఒక అతి పెద్ద రంగం గా ఉందని ఆయన అంటూ, ఇది దేశం లో ఉపాధి కల్పన కు ఒక భారీ మాధ్యం గా కూడా రూపుదాల్చుతోంది అన్నారు.

సబ్ కా ప్రయాస్ (ప్రతి ఒక్కరి ప్రయత్నాల) ద్వారా మాత్రమే భారతదేశం లో ఒక అభివృద్ధియుక్త హెల్థ్ ఎండ్ వెల్ నెస్ ఇకోసిస్టమ్ ను ఏర్పరచవచ్చును అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘దీనికి గాను సంబంధి వర్గాలు అన్నీ విలువైన సూచనల ను చేయాలి అని ఆయన కోరారు. పెట్టుకొన్న లక్ష్యాల ను ఒక నిర్దిష్ట మార్గసూచీ సాయం తో కాల పరిమితి కి లోపే బడ్జెటు ప్రతిపాదనల ను మనం అమలులోకి తీసుకురా గలగాలి. రాబోయే బడ్జెటు కంటే ముందుగానే అన్ని కలల ను నెరవేర్చుకొంటూ, ఈ క్రమం లో సంబంధి వర్గాలు అన్నిటిని కలుపుకొని పోవాలి. అది జరగాలి అంటే అందుకు మీ అనుభవం తాలూకు ప్రయోజనం అవసరపడుతుంది’’ అని సభికుల కు చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Decoding Modi's Triumphant Three-Nation Tour Beyond MoUs

Media Coverage

Decoding Modi's Triumphant Three-Nation Tour Beyond MoUs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi shares Sanskrit Subhashitam emphasising the importance of Farmers
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam-

“सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।

तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।।”

The Subhashitam conveys that even when possessing gold, silver, rubies, and fine clothes, people still have to depend on farmers for food.

The Prime Minister wrote on X;

“सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।

तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।।"