‘‘వ్యవసాయ మంత్రి బాధ్యత లు ఆర్థిక వ్యవస్థ లోని ఒకరంగాన్ని సంబాళించడానికే పరిమితమైనవి కాక, అవి మానవ జాతి భవిష్యత్తు ను భద్రం గా నిలిపే దిశ కు కూడాను వర్తిస్తాయి’’
‘‘ ‘తిరిగి మూలాల కు చేరుకోవడం’ మరియు ‘భవిష్యత్తు లోకి పయనించడం’.. ఈ రెండు అంశాల కలయిక తో భారతదేశం యొక్క విధానం రూపుదిద్దుకొంది’’
‘‘మనం ‘శ్రీ అన్న’ చిరుధాన్యాల నుమనకు ఇష్టమైన ఆహారం గా స్వీకరిద్దాం.. రండి’’
‘‘పున:పోషణ ప్రధానమైనటువంటి వ్యవసాయం కోసంప్రత్యామ్నాయాల ను అభివృద్ధి చేయడాని కి మనకు ప్రపంచం లోని వివిధ ప్రాంతాల సాంప్రదాయికఅభ్యాసాలు ప్రేరణ ను అందించే అవకాశం ఉంది’’
‘‘మన ‘ఒకే భూగ్రహాన్ని’ సంరక్షించడం, ‘ఒకే కుటుంబం’ లో సద్భావన ను ఏర్పరచడం మరియు ‘ఒకే భవిష్యత్తు’ ఉజ్వలం గా ఉంటుంది అనేటటువంటి ఆశ ను కల్పించడం భారతదేశంయొక్క జి20 ప్రాథమ్యాల లో భాగాలుగా ఉన్నాయి’’

జి20 వ్యవసాయ మంత్రుల సమావేశం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో మాధ్యం ద్వారా ప్రసంగించారు.

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మట్లాడుతూ, ప్రముఖులు అందరి కి భారతదేశం లోకి ఇదే ఆహ్వానం అంటూ పలికారు. మానవ నాగరకత లో కేంద్ర స్థానం లో వ్యవసాయం ఉందన్నారు. వ్యవసాయ మంత్రి బాధ్యత లు ఆర్థిక వ్యవస్థ లో ఒక రంగాన్ని నిర్వహించడానికి పరిమితం కావు, అవి మానవాళి భవిష్యత్తు కోసం పాటుపడడానికి సైతం వర్తిస్తాయన్నారు. ప్రపంచం స్థాయి లో చూసినప్పుడు, వ్యవసాయం 2.5 బిలియన్ కు పైగా ప్రజల కు బ్రతుకుదెరువు ను అందిస్తున్నది. అంతగా అభివృద్ధి చెందని ప్రపంచ దేశాల (గ్లోబల్ సౌథ్) లో, వ్యవసాయం జిడిపి లో దాదాపు గా 30 శాతం తోడ్పాటు ను అందిస్తోంది; మరి 60 శాతాని కి పైచిలుకు ఉద్యోగాలు ఈ రంగం పైన ఆధారపడి ఉన్నాయన్నారు. మహమ్మారి వల్ల ఏర్పడిన సరఫరా వ్యవస్థ తాలూకు అంతరాయాలు భౌగోళిక ఉద్రిక్తత ల మరియు రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం తో ఇంకా దిగజారిపోయాయి. జలవాయు పరివర్తన, వాతావరణం లో తీవ్ర ఒడుదొడుకుల ను తరచు గా కలిగిస్తున్నదని కూడా ఆయన అన్నారు.

వ్యవసాయ రంగం లో భారతదేశం యొక్క తోడ్పాటు ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘మళ్ళీ మూలాల్లోకి’ (బేక్ టు బేసిక్స్) , అలాగే ‘రాబోయే కాలం లోకి అడుగులు వేయడం (మార్చ్ టు ఫ్యూచర్).. ఈ రెండు విధానాల ను కలబోసినటువంటి విధానాన్ని భారతదేశం అనుసరిస్తోందన్నారు. భారతదేశం ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం తో పాటు సాంకేతిక విజ్ఞానం అండదండల తో సేద్యాని కి కూడాను ప్రాధాన్యాన్ని ఇస్తోందన్నారు. ‘‘భారతదేశం నలుమూలలా రైతులు ప్రస్తుతం ప్రాకృతిక వ్యవసాయాన్ని అవలంబిస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. వారు కృత్రిమ ఎరువుల ను గాని, లేదా పురుగు మందుల ను గాని వాడడం లేదు. వారు భూ మాత కు నవ జవసత్వాల ను అందించడంపైన, భూమి స్వస్థత ను పరిరక్షించడం పైన, ‘ఒక్కొక్క నీటి చుక్క కు మరింత ఎక్కువ పంట’ ను ఉత్పత్తి చేయడం పైన మరియు సేంద్రియ ఎరువుల ను వినియోగించడం, ఇంకా సస్య రక్షణ పద్ధతుల వైపు మొగ్గు చూపడం పైన శ్రద్ధ ను తీసుకొంటున్నారు. అదే కాలం లో, మా రైతులు ఫలసాయాన్ని పెంపొందింప చేయడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివి గా ఉపయోగిస్తున్నారు. వారు వారి వ్యవసాయ క్షేత్రాల లో సౌర శక్తి ని ఉత్పత్తి చేసుకొంటూ, దానిని వినియోగం లోకి తీసుకు వస్తున్నారు. పంటల ఎంపిక లో గరిష్ఠ ప్రయోజనాల ను అందుకోవడం కోసం సాయిల్ హెల్థ్ కార్డుల ను ఉపయోగించుకొంటున్నారు. అంతేకాక, పౌష్టిక పదార్థాల ను పొలం లో చల్లేందుకు మరియు వారి యొక్క పంటల స్థితి ని పర్యవేక్షించేందుకు డ్రోన్ లను వినియోగిస్తున్నారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ‘‘మిశ్రిత దృష్టికోణం’’ వ్యవసాయం లో ఎన్నో సమస్యల ను పరిష్కరించుకోవడాని కి అన్నింటి కంటే మంచి పద్ధతి అని తాను నమ్ముతున్నానని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

2023 వ సంవత్సరాన్ని ‘చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం’ గా జరుపుకొంటున్నాం అన్న సంగతి ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ చిరుధాన్యాల తో వండిన అనేక భోజ్య పదార్థాల ను , అదే శ్రీ అన్నం తో తయారు చేసిన తినుబంగారాల ను ప్రముఖులు హైదరాబాద్ లో వారి ఆహారపు పళ్లేల లో గమనిస్తారు అని పేర్కొన్నారు. ఆ మహా తినుబండారాలు సేవించడానికి ఆరోగ్యదాయకం గా ఉండడం ఒక్కటే కాకుండా అవి అవి రైతుల ఆదాయాల ను అధికం చేయడం లో సాయపడతాయని ఎలాగంటే ఆ పంటల కు తక్కువ నీరు, తక్కువ ఎరువులు సరిపోతాయన్నారు. చిరుధాన్యాల చరిత్ర ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, వాటి ని వేల కొద్దీ సంవత్సరాల కు పూర్వం నుండే సాగు చేయడమైందన్నారు. అయితే, బజారు లు మరియు విక్రయ విధానం ల ప్రభావం వల్ల సాంప్రదాయికం గా పండిస్తూ వచ్చిన ఆహార పంట లు విలువ ను కోల్పోయాయని ప్రధాన మంత్రి అన్నారు. చిరుధాన్యాల లో అత్యుత్తమ అభ్యాసాల ను పరిశోధన ను మరియు సాంకేతికతల ను పరస్పరం వెల్లడి చేసుకోవడం కోసం భారతదేశం ఒక ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మిలెట్ రిసర్చ్ ను ఏర్పాటు చేస్తున్నది. ఈ సంస్థ ను ఒక ఉత్కృష్టత కేంద్రం గా తీర్చిదిద్దడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి తెలియజేస్తూ ‘‘రండి, మనం ‘శ్రీ అన్నం’ చిరుధాన్యాల ను మనకు నచ్చిన ఆహారం గా స్వీకరించుదాం’’ అని వ్యాఖ్యానించారు.

ప్రపంచం లో ఆహార భద్రత లక్ష్యాన్ని సాధించడం కోసం సామూహిక కార్యాచరణ ను ఏ విధం గా చేపట్టాలో అనే అంశం పై సంప్రదింపు లను జరపవలసిందంటూ వ్యవసాయ మంత్రుల కు శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. చిరకాలం నిలచి ఉండేటటువంటి మరియు సమ్మిళిత ఖాద్య వ్యవస్థల ను నిర్మించడాని కి సన్నకారు రైతుల ప్రయోజనాల పై దృష్టి ని కేంద్రీకరించే పద్ధతుల ను మనం కనుగొనాలని ఆయన సూచన చేశారు. అదే కాలం లో, నేల లో సారం, పంట యొక్క చేవ మరియు దిగుబడి మెరుగైనవి గా ఉండేటట్లు గా తగిన వ్యావసాయిక అభ్యాసాల ను మనం ఆచరించవలసివుంది అని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. పున:పోషణ ప్రధానమైనటువంటి వ్యవసాయం తాలూకు ప్రత్యామ్నాయ మార్గాల ను కనుగొనడాని కి మనకు అవసరమైన ప్రేరణ ను ప్రపంచం లోని వేరు వేరు ప్రాంతాల లో సాంప్రదాయిక అభ్యాసాలు అందించే అవకాశం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణ లు మరియు డిజటల్ టెక్నాలజీ ల ద్వారా మనం మన రైతుల కు సాధికారిత ను కల్పించవలసిన అవసరం ఉంది. అంతేకాదు, అంతగా అభివృద్ధి చెందనటువంటి దేశాల లో చిన్న రైతుల కోసం మరియు సన్నకారు రైతుల కోసం తక్కువ ఖర్చు కు అందుబాటు లోకి వచ్చే పరిష్కారాల ను సైతం మనం రూపొందించాలి

అని ఆయన నొక్కిపలికారు. చెత్త నుండి సంపద ను తయారు చేయడం పై పెట్టుబడుల ను పెట్టడాన్ని కొనసాగిస్తూ, వ్యవసాయపరమైనటువంటి దుబారా ను మరియు ఆహార వ్యర్థాల దుర్వినియోగాన్ని తగ్గించవలసిన మరియు తక్షణ కర్తవ్యం కూడా ఉంది అని ఆయన అన్నారు.

‘ఒక ధరణి’ కి స్వస్థత ను ప్రసాదించడం, ‘ఒకే కుటుంబం’ లో సద్భావన ను నెలకొల్పడం, ఉజ్వలమైనటువంటి ‘ఒక భవిష్యత్తు’ కోసం ఆశ ను రేకెత్తించడం వంటివి వ్యవసాయ రంగం లో భారతదేశం యొక్క జి20 ప్రాధాన్యాల లో భాగం గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో పేర్కొన్నారు. ‘దక్కన్ హై లెవల్ ప్రిన్సిపల్స్ ఆన్ ఫూడ్ సెక్యూరిటీ ఎండ్ న్యూట్రిశన్’’; అలాగే చిరుధాన్యాలు, ఇంకా ఇతర తిండి గింజల కు సంబంధించినటువంటి ‘‘మహారుషి’’ కార్యక్రమం .. అనే ఈ రెండు నిర్దిష్ట ఫలితాలను రాబట్టడం కోసం ప్రయాస సాగుతోంది అంటూ ఆయన తన ప్రసన్నత ను వ్యక్తం చేశారు. ఈ రెండు కార్యక్రమాల కు అందించే సమర్థన సమ్మిళితమైనటువంటి, చిరకాలం మనుగడ లో ఉండేటటువంటి మరియు ఆటు పోటుల కు తట్టుకొని నిలబడగలిగేటటువంటి వ్యవసాయాని కి అండ ను ఇవ్వడమే అవుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
STEM Enrolment Crosses 1 Crore Mark, Women's Share Rises To 44%: Government Report

Media Coverage

STEM Enrolment Crosses 1 Crore Mark, Women's Share Rises To 44%: Government Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam applauding the courage and perseverance of India's Youth
July 20, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam applauding the courage and perseverance of India's Youth:

"प्राप्यापदं न व्यथते कदाचिदुद्योगमन्विच्छति चाप्रमत्तः।

दुःखं च काले सहते महात्मा धुरन्धरस्तस्य जिताः सपत्नाः॥"

Shri Modi said that our youth is achieving historic success through their courage, self-confidence, and relentless hard work, and this is the greatest strength of a rapidly developing India.

The Prime Minister posted on X:

आज हमारे युवा साथी धैर्य, आत्मविश्वास और अथक परिश्रम से ऐतिहासिक सफलता हासिल कर रहे हैं। यही विकसित हो रहे भारत की सबसे बड़ी ताकत है।

प्राप्यापदं न व्यथते कदाचिदुद्योगमन्विच्छति चाप्रमत्तः।

दुःखं च काले सहते महात्मा धुरन्धरस्तस्य जिताः सपत्नाः॥