ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అనగా, ఈ నెల 25న హిమాచల్ ప్రదేశ్ 50వ రాష్ట్రం ఆవిర్భావ దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినానికి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో రాష్ట్ర నివాసులు అందరికీ ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్ష లు. ప్రాకృతిక శోభ కు, మనోహరమైన పర్యటన స్థలాల కు ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రం నిత్యం అభివృద్ధి తాలూకు నూతన ప్రమాణాల ను ఏర్పరుస్తూ ఉండుగాక; అలాగే, దేశాభివృద్ధి కి తన తోడ్పాటు ను అందిస్తూ ఉండుగాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
हिमाचल प्रदेश के पूर्ण राज्यत्व दिवस के 50 वर्ष पूरे होने पर राज्य के सभी निवासियों को मेरी हार्दिक शुभकामनाएं। प्राकृतिक सुंदरता और मनमोहक पर्यटन स्थलों के लिए प्रसिद्ध यह प्रदेश विकास के नित नए मानदंड गढ़ता रहे और देश की उन्नति में अपना योगदान देता रहे। #SwarnimHimachal
— Narendra Modi (@narendramodi) January 25, 2021


