రాష్ట్రపతి ప్రసంగం భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దిశను చూపింది..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రోజు రాష్ట్రపతి గారు ఇచ్చిన ప్రసంగం సమగ్రంగానూ, లోతైన అవగాహనతోనూ ఉందని శ్రీ మోదీ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపిందనీ, భారత్ ఇటీవల సాధించిన అసాధారణ అభివృద్ధిని కూడా ప్రతిబింబించిందనీ ప్రధానమంత్రి అన్నారు.
వికసిత్ భారత్‌ నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యం ఇవాళ్టి ప్రసంగంలో ప్రస్ఫుటం అయిందనీ, బలమైన, స్వయంసమృద్ధమైన దేశాన్ని తీర్చిదిద్దాలన్న మన ఉమ్మడి ఆకాంక్షకు అద్దం పట్టిందనీ శ్రీ మోదీ అన్నారు. ‘‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ను మరింత వేగంగా పరుగులు పెట్టించాలన్న మన అందరి సంకల్పాన్నీ, నవకల్పనతో పాటు సుపరిపాలనకు ఇస్తున్న ప్రాధాన్యాన్నీ ఈ ప్రసంగం పునరుద్ఘాటించింది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ఇవ్వడంతో, పార్లమెంటు బడ్జెటు సమావేశాలు ఈ రోజు మొదలయ్యాయి. ఈ ప్రసంగానికి మన పార్లమెంటరీ సంప్రదాయాల్లో, ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.. రాబోయే నెలల్లో మన దేశ అభివృద్ధి ప్రయాణానికి మార్గదర్శకత్వాన్ని వహించే సామూహిక సంకల్పంతో పాటు విధాన రూపకల్పనకు ఈ ప్రసంగం మార్గదర్శకంగా ఉంటుంది.
ఇవాళ్టి ప్రసంగం సమగ్రంగా, లోతైన అవగాహనతో ఉంది. ఇది భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దిశను చూపుతూనే, భారత్ ఇటీవలి అసాధారణ అభివృద్ధి ప్రయాణ జోరును ప్రతిబింబించింది. వికసిత్ భారత్‌ను నిర్మించడానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రస్ఫుటం చేసింది.. ఒక బలమైన, స్వయంసమృద్ధ దేశాన్ని తీర్చిదిద్దాలన్న మన ఉమ్మడి ఆకాంక్షకూ అద్దం పట్టింది. ఈ ప్రసంగంలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. రైతులు, యువత, పేదలు, అణచివేతకు గురైన వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నాలను చాటిచెప్పింది ఈ ప్రసంగం. సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ను మరింత వేగంగా నడపడంతో పాటు నవకల్పనపై, సుపరిపాలనపై తీసుకొంటున్న శ్రద్ధను ఇది పునరుద్ఘాటించింది’’ అని పేర్కొన్నారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year

Media Coverage

IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 ఏప్రిల్ 2026
April 28, 2026

From Orchids to Expressways: PM Modi’s Blueprint for a Self-Reliant, Connected & Proud India