షేర్ చేయండి
 
Comments

పాల‌స్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ ల‌కు బ‌య‌లుదేరే ముందు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.

“ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ నుండి 12 వ తేదీ వ‌ర‌కు పాల‌స్తీనా, యునైటెడ్ అర‌బ్‌ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ లలో నేను ద్వైపాక్షిక ప‌ర్య‌ట‌న‌ల‌ను చేప‌ట్ట‌బోతున్నాను.

2015వ సంవ‌త్స‌రం త‌రువాతి కాలంలో గ‌ల్ఫ్ మ‌రియు ప‌శ్చిమ ఆసియా ప్రాంతాల‌లో అయిదో సారి ప‌ర్య‌టించ‌నుండ‌డం నాకు సంతోషాన్నిస్తోంది. మ‌న విదేశీ సంబంధాల‌లో ఈ ప్రాంతానికి ఒక కీల‌క‌మైన ప్రాధాన్యం ఉంది. ఇక్క‌డి దేశాల‌తో మ‌నం చైత‌న్య‌శీల‌మైన బ‌హుళ పార్శ్వికమైన అనుబంధాన్ని క‌లిగివున్నాం.

నా ప‌ర్య‌ట‌న ఫిబ్ర‌వ‌రి 10 తేదీ నాడు జోర్డాన్ మీదుగా ప్ర‌యాణించి, పాల‌స్తీనా కు చేరుకోవ‌డంతో మొద‌ల‌వుతుంది. మార్గ‌మ‌ధ్యంలో బ‌స క‌ల్పిస్తున్నందుకుజోర్డాన్ రాజు శ్రీ రెండో అబ్దుల్లా కు నేను కృత‌జ్ఞుడినై ఉంటాను. ఆయ‌న‌ను ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన అమ్మాన్ లో కలుసుకోవడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.

ఇది భార‌త‌దేశం నుండి పాల‌స్తీనా ను సంద‌ర్శిస్తున్న మొట్ట‌మొద‌టి ప్ర‌ధాన మంత్రి ప‌ర్య‌ట‌న కాబోతోంది. అధ్య‌క్షులు శ్రీ మొహ‌మూద్ అబ్బాస్ తో జ‌రుప‌బోయే చ‌ర్చ‌ల కోసం, అలాగే పాల‌స్తీనా అభివృద్ధి మ‌రియు పాల‌స్తీనా ప్ర‌జ‌ల‌కు మ‌న మ‌ద్ద‌తును పున‌రుద్ఘాటించ‌డం కోసం నేను నిరీక్షిస్తున్నాను.

ఫిబ్ర‌వ‌రి 10వ, 11వ తేదీల‌లో నేను యుఎఇ లో ప‌ర్య‌టిస్తాను. 2015 ఆగ‌స్టు లో ప‌ర్య‌టించిన అనంత‌రం మ‌రోసారి నేను అక్క‌డకు వెళ్తున్నాను. యుఎఇ ఒక విలువైన వ్యూహాత్మ‌క భాగ‌స్వామి. యుఎఇ తో ఆర్థిక వ్య‌వ‌స్థ, శ‌క్తి, ఉన్న‌త సాంకేతిక విజ్ఞానం, ఇంకా భ‌ద్ర‌త ల‌తో స‌హా ప్ర‌ధాన రంగాల‌న్నింటిలో మ‌నం శ‌ర వేగంగా దూసుకుపోతున్నటువంటి స‌హ‌కారాన్ని పొందుతున్నాం. ఈ రంగాల‌లో మ‌న పురోగ‌తిని గురించి, ఇంకా ఉపాధ్య‌క్షులు, యుఎఇ ప్ర‌ధాని మరియు దుబయ్ పాలకుడు శ్రీ షేక్ మొహమ్మద్ బిన్ ర‌శీద్ అల్ మక్తూమ్ తోను, అబూ ధాబి యువ రాజు శ్రీ షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ న‌హ్ యాన్ తోను నేను జ‌ర‌ప‌బోయే స‌మావేశాల కోసం వేచి వున్నాను.

యుఎఇ నాయ‌క‌త్వం ఆహ్వానించిన మీద‌ట‌, దుబయ్ లో వ‌ర‌ల్డ్ గ‌వ‌ర్న‌మెంట్ స‌మిట్ 6వ సంచిక‌ను ఉద్దేశించి నేను ప్ర‌సంగించ‌నున్నాను. భారతదేశం ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నంలో గౌర‌వ అతిథి దేశంగా పాలుపంచుకోనుంది.

అదే రోజున నేను దుబాయి లో యుఎఇ, అరబ్ ప్రాంతాల సిఇఒ ల‌తో భార‌త‌దేశంలోని విస్తృత‌ ఆర్థిక అవ‌కాశాల‌ గురించి, వ్యాపార స‌మ‌న్వ‌యాన్ని పెంపొందించుకొనేందుకు గాను కలిసికట్టుగా మరేయే చర్యలు చేపట్టాలో అనే దానిని గురించి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నాను.

ఓమాన్ మ‌నం శ్రేష్ఠ‌మైన సంబంధాల‌ను క‌లిగి ఉన్న మ‌రొక స‌న్నిహిత స‌ముద్ర ప్రాంత పొరుగు దేశంగా ఉంది. నేను ఓమాన్ సుల్తాన్ తో, ఇత‌ర కీల‌క‌ నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతాను. ఓమాన్ కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార రంగ ప్ర‌ముఖుల‌తో నేను భేటీ అవుతాను. భార‌త‌దేశంతో బ‌ల‌మైన ఆర్థిక‌, వ్యాపార సంబంధాల‌ను అభివృద్ధి ప‌ర‌చుకోవ‌డం అనే అంశం పై వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతాను.

ఫిబ్ర‌వ‌రి 11వ, 12వ తేదీల‌లో నేను ప్ర‌ధాన మంత్రిగా అక్కడ నా తొలి ప‌ర్య‌ట‌నను చేప‌ట్టనుండడం పట్ల ఆనందిస్తున్నాను. భార‌త‌దేశం మ‌రియు ఓమాన్ వ‌ర్ధిల్లుతున్న‌టు వంటి సంబంధాలను కలిగివున్నాయి. ఈ సంబంధాలు శ‌తాబ్దాల త‌ర‌బ‌డి ఇరు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ మధ్య చోటుచేసుకొంటున్న రాక పోక లతో వేళ్లూనుకొన్నాయి.

ఫిబ్ర‌వరి 11వ తేదీ నాటి సాయంత్రం, నేను ఓమాన్ సుల్తాన్ తో భేటీ అవుతాను. అలాగే, డిప్యూటీ ప్రైం మినిస్టర్ ఫర్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ శ్రీ స‌య్యిద్ ఫహ‌ద్ బిన్ మ‌హ‌మూద్ అల్ స‌యద్ తో, డిప్యూటీ ప్రైం మినిస్టర్ ఫర్ ఇంటర్ నేశనల్ రిలేశన్స్ అండ్ కోఆపరేశన్ అఫైర్స్ శ్రీ స‌య్యిద్ అసాద్ బిన్ తారీఖ్ అల్ స‌య‌ద్ తో స‌మావేశ‌మ‌వుతాను. ద్వైపాక్షిక స‌హ‌కారంతో పాటు సాంప్ర‌దాయ‌కంగా ప‌టిష్టంగా ఉన్న మ‌న సంబంధాలను మ‌రింత‌గా పెంపొందించుకొనేందుకు చేప‌ట్ట‌వ‌ల‌సిన చ‌ర్య‌ల‌ను కూడా మేం స‌మీక్షిస్తాం.

ఫిబ్ర‌వ‌రి 12వ తేదీన, నేను అమాన్ కు చెందిన ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌ల‌తో సమావేశమై, భార‌త‌దేశంతో బ‌ల‌వ‌త్త‌ర‌మైన ఆర్థిక మ‌రియు వ్యాపార సంబంధాల‌ను అభివృద్ధి ప‌ర‌చుకోవ‌డం అనే అంశంపై వారితో చ‌ర్చిస్తాను.

అమాన్ లో, యుఎఇ లో పెద్ద సంఖ్య‌లో నివ‌సిస్తున్న ప్ర‌వాసీ భార‌తీయుల స‌ముదాయంతో భేటీ అయ్యే అవ‌కాశం నాకు ద‌క్కనుంది. వారు ఆయా దేశాల‌ను తమ నివాసంగా మ‌ల‌చుకొన్నారు. గ‌ల్ఫ్ ప్రాంతంలో 9 మిలియ‌న్ మందికి పైగా భార‌తీయులు మ‌నుగ‌డ సాగిస్తూ, విధుల‌ను నిర్వ‌హిస్తున్నారు. వారిలో ముడింట ఒక‌టో వంతు మంది ఒక్క యుఎఇ లోనే మ‌నుగ‌డ సాగిస్తున్నారు. ఓమాన్ లో అయితే, వారు అతి పెద్ద నిర్వాసితుల స‌ముదాయంగా ఏర్పడ్డారు.

ప్ర‌వాసీ భార‌తీయుల స‌ముదాయం భార‌త‌దేశానికి, గ‌ల్ఫ్ ప్రాంత దేశాల‌కు మ‌ధ్య నిర్మాణమైనటువంటి ఒక స్నేహ సేతువు. వారు తమ ఆతిథేయి దేశాల పురోగ‌తిలో, సమృద్ధి ల‌లో క్రియాశీల భాగ‌స్తులుగా కూడా ఉంటున్నారు.

ప‌శ్చిమ ఆసియా మ‌రియు గ‌ల్ఫ్ ప్రాంతంలో ప‌ర్య‌టించ‌డం ద్వారా భార‌త‌దేశం యొక్క అంతకంతకు వ‌ర్ధిల్లుతున్న మరియు ముఖ్య‌మైన స‌ంబంధాల‌ను దృఢతరం చేయడం కోసం నేను ఎదురుచూస్తూ ఉన్నాను”.

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Mann KI Baat Quiz
Explore More
జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం
India achieves 40% non-fossil capacity in November

Media Coverage

India achieves 40% non-fossil capacity in November
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 డిసెంబర్ 2021
December 04, 2021
షేర్ చేయండి
 
Comments

Nation cheers as we achieve the target of installing 40% non fossil capacity.

India expresses support towards the various initiatives of Modi Govt.