అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ అధ్యక్షత న 2022వ సంవత్సరం జూన్ 23-24వ తేదీ లలో వర్చువల్ మాధ్యమం ద్వారా జరిగిన బ్రిక్స్ 14వ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొన్న భారతదేశం పక్షాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. జూన్ 23వ తేదీ నాడు జరిగిన శిఖర సమ్మేళనం లో బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ జాయర్ బోల్సొనారో, రశ్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్, దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా లు కూడా పాల్గొన్నారు. జూన్ 24వ తేదీ న ప్రపంచ అభివృద్ధి అంశం పై ఒక ఉన్నత స్థాయి చర్చ కార్యక్రమాన్ని శిఖర సమ్మేళనం తాలూకు బ్రిక్స్ యేతర దేశాల తో నిర్వహించడం జరిగింది.

జూన్ 23వ తేదీ నాడు, నేత లు ఉగ్రవాదం, వ్యాపారం, ఆరోగ్యం, సంప్రదాయిక చికిత్స, పర్యావరణం, విజ్ఞ‌ానశాస్త్రం, సాంకేతిక విజ్ఞ‌ానం మరియు నూతన ఆవిష్కరణ, వ్యవసాయం, సాంకేతిక విద్య, వృత్తి విద్య ఇంకా శిక్షణ ల రంగాల తో పాటు ప్రపంచ సందర్భం కలిగివున్న ప్రముఖ అంశాలు సహా బహుపక్షీయ వ్యవస్థ లో మెరుగుదల, కోవిడ్ -19 మహమ్మారి, ప్రపంచ ఆర్థిక రికవరీ ల వంటి విషయాలపై చర్చలు జరిపారు. బ్రిక్స్ గుర్తింపు ను బలపరచడం మరియు బ్రిక్స్ దస్తావేజులు, బ్రిక్స్ రైల్ వే అనుసంధాన సంబంధి నెట్ వర్క్ కోసం ఆన్ లైన్ డాటా బేస్ ను ఏర్పాటు చేయడం, ఇంకా ఎమ్ఎస్ఎమ్ఇ ల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. భారతదేశం బ్రిక్స్ దేశాల లో స్టార్ట్అప్ ల మధ్య సంబంధాల ను పటిష్టపరచడం కోసం ఈ సంవత్సరం లో బ్రిక్స్ స్టార్ట్అప్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బ్రిక్స్ సభ్యత్వ దేశాల రూపం లో మనం ఒకరి భద్రతపరమైన ఆందోళనల ను మరొకరు అర్థం చేసుకోవాలి, ఉగ్రవాదుల ను గుర్తించడం లో పరస్పరం సమర్థన ను అందజేసుకోవాలి, అంతే కాకుండా ఈ సున్నితమైన అంశానికి రాజకీయాల రంగు ను పులమకూడదు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. శిఖర సమ్మేళనం ముగింపు లో, ‘బీజింగ్ ప్రకటన’ కు బ్రిక్స్ నేత లు అంగీకారం తెలియజేశారు.

జూన్ 24వ తేదీ నాడు, ఆఫ్రికా, మధ్య ఆసియా, ఆగ్నేయ ఆసియా మరియు పసిఫిక్ నుంచి కరిబియన్ వరకు ఇంకా భారతదేశం యొక్క అభివృద్ధి భాగస్వామ్యం తో పాటు గా ఒక స్వేచ్ఛాయుక్తమైనటువంటి, తెరచి ఉంచినటువంటి, అన్ని వర్గాల ను కలుపుకొనిపోయేటటువంటి మరియు నియమాలపై ఆధారపడి ఉండేటటువంటి సముద్ర రంగం పై భారతదేశం యొక్క శ్రద్ధ, హిందూ మహాసముద్రం మొదలుకొని పసిఫిక్ మహాసముద్రం వరకు అన్ని దేశాల సార్వభౌమత్వాని కి, ఇంకా ప్రాదేశిక సమగ్రత కు గౌరవం తో పాటు ఆసియా లోని పెద్ద భాగాల రూపం లో బహుపక్షీయ వ్యవస్థ లో సంస్కరణ మరియు ప్రపంచ నిర్ణయాల ను తీసుకోవడం లో సంపూర్ణ ఆఫ్రికా ఇంకా లాటిన్ అమెరికా ల ఆలోచనల శూన్యతల ను గురించి ప్రస్తావించారు. ప్రధాన మంత్రి సర్క్యులర్ ఇకానమీ యొక్క ప్రాముఖ్యం గురించి కూడా నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటున్న దేశాల పౌరుల ను లైఫ్ స్టైల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్ (ఎల్ఐఎఫ్ఇ) ప్రచార ఉద్యమం లో చేరండంలూ ఆహ్వానించారు. ఇందులో పాల్గొన్న అతిథి దేశాల లో అల్జీరియా, అర్జెంటీనా, ఇండోనేశియా, ఇరాన్, కజాకిస్తాన్, మలేశియా, సెనెగల్, థాయిలాండ్ మరియు ఉజ్ బెకిస్తాన్ లు ఉన్నాయి.

అంతక్రితం, జూన్ 22వ తేదీ న జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ ప్రారంభిక కార్యక్రమం లో ప్రధానోపన్యాసాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి కోవిడ్-19 మహమ్మారి కాలం లో సైతం బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తో పాటు బ్రిక్స్ విమెన్ బిజినెస్ అలయన్స్ లు వాటి కార్యాల ను కొనసాగించినందుకు గాను ఆయా సంఘాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక సవాళ్ల తో పాటు ఆర్థిక సవాళ్లు, స్టార్ట్అప్ స్ మరియు ఎమ్ఎస్ఎమ్ఇ స్ కోసం సాంకేతిక విజ్ఞ‌ాన ఆధారిత పరిష్కార మార్గాల రంగం లో సైతం మరింత సహకారాన్ని అందించవలసిందంటూ బ్రిక్స్ వ్యాపార సముదాయానికి ప్రధాన మంత్రి సూచన ను చేశారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Apple steps up India push as major suppliers scale operations, investments

Media Coverage

Apple steps up India push as major suppliers scale operations, investments
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 నవంబర్ 2025
November 16, 2025

Empowering Every Sector: Modi's Leadership Fuels India's Transformation