బార్బడోస్ ఎన్నికల్లో వరుసగా మూడో సారి విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన ప్రధాని మియా అమోర్ మోట్‌లీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బార్బడోస్ దీర్ఘకాలిక మైత్రికి భారత్ ఎనలేని ప్రాధాన్యాన్నిస్తోందనీ, పరస్పర సహకారాన్ని వివిధ రంగాల్లోకి విస్తరింపచేసుకొంటున్నామనీ శ్రీ మోదీ అన్నారు. ‘‘2024లో భారత్-కేరికామ్ శిఖరాగ్ర సదస్సు సందర్బంగా మనం భేటీ అయిన సంగతిని నేను గుర్తు చేసుకొంటున్నాను. మన రెండు దేశాల ప్రజల హితాన్ని కోరుకుంటూ మన భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠపరుచుకోవడానికి ఆమెతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘ఎన్నికల్లో వరుసగా మూడో సారి గెలిచి, చరిత్రను సృష్టించినందుకు ప్రధాని మియా అమోర్ మోట్‌లీకి హృదయపూర్వక అభినందనలు.
బార్బడోస్ తో భారత్ తన దీర్ఘకాలిక మైత్రికి ఎంతో ప్రాధాన్యాన్నిస్తోంది.. ఈ మైత్రి వివిధ రంగాల్లో పరస్పర సహకారం రూపేణా నిరంతరాయంగా విస్తరిస్తోంది.
2024లో భారత్-కేరికామ్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మనం సమావేశమైన సంగతి నాకు జ్ఞ‌ాపకముంది. మన ప్రజల మేలు కోసం మన భాగస్వామ్యాన్ని మరింత దృఢపరుచుకోవడానికి ఆమెతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Strength of 'janbhagidari' in India: PM Modi on people's support for fuel saving, no-gold-buy appeals

Media Coverage

Strength of 'janbhagidari' in India: PM Modi on people's support for fuel saving, no-gold-buy appeals
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasizing on respecting the diverse cultures of the world
June 29, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam:

“देशाचारान् समयाञ्जातिधर्मान् बुभूषते यस्तु परावरज्ञः।

स तत्र तत्राधिगतः सदैव महाजनस्याधिपत्यं करोति॥"

The Subhashitam emphasizes that respecting the diverse cultures of the world fosters a sense of trust and cooperation among people, and strengthens mutual understanding and brotherhood.

The Prime Minister wrote on X;

दुनिया की अलग-अलग संस्कृतियों का सम्मान करने से लोगों के बीच विश्वास और सहयोग की भावना बढ़ती है। इससे आपसी समझ और भाईचारा और मजबूत होता है।

देशाचारान् समयाञ्जातिधर्मान् बुभूषते यस्तु परावरज्ञः।

स तत्र तत्राधिगतः सदैव महाजनस्याधिपत्यं करोति॥