స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ళు తరువాత కూడా, 18 వేల గ్రామాలు చీకట్లోనే ఉండడం దురదృష్టకరం: ప్రధాని మోదీ

2005 లో యుపిఎ ప్రభుత్వం, 2009 నాటికి ప్రతి గ్రామాన్ని విద్యుద్దీకరించడానికి వాగ్దానం చేసింది. అప్పటి పాలక పార్టీ అధ్యక్షులు ఒకడుగు అడుగుకు ముందుకేసి ప్రతీ ఇంటికి విద్యుత్తును తీసుకువస్తామన్నారు. కానీ అలా జరగలేదు: ప్రధాని

ఎర్ర కోట యొక్క ప్రాకారాల నుండి నేను ప్రతి గ్రామమును విద్యుదీకరణ చేస్తామని ప్రకటించాను. మేము చెప్పింది చేశాము మరియు ప్రతి గ్రామానికి విద్యుత్ అందించాము: ప్రధాని

విద్యుతీకరించబడని 18,000 గ్రామాలలో సుమారు 14,500 గ్రామాలు తూర్పు భారతదేశంలో ఉన్నాయి. మేము దానిని మార్చాము: ప్రధాని మోదీ

దేశ‌వ్యాప్తంగా 2014 నాటి నుండి విద్యుతీకరణ జరిగినటువంటి గ్రామాలకు చెందిన పౌరులతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున సంభాషించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా జ‌రిగిన ఈ ముఖాముఖి సంభాష‌ణ కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి స‌హ‌జ్ బిజిలి హ‌ర్ ఘ‌ర్ యోజ‌న – ‘సౌభాగ్య’ ప‌థ‌కం యొక్క ల‌బ్ధిదారులు పాలుపంచుకొన్నారు. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల యొక్క ల‌బ్దిదారులతో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జరుపుతున్న స‌మావేశాల ప‌రంప‌ర‌ లో ఇది ప‌దో ముఖాముఖి స‌మావేశం.

ఇటీవ‌లే విద్యుత్తు సౌక‌ర్యానికి నోచుకొన్న 18000 ప‌ల్లె ల‌కు చెందిన గ్రామీణుల‌ తో ముఖాముఖి సంభాష‌ణ జ‌ర‌ప‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ‘‘చీక‌టిని చూడ‌ని ప్ర‌జ‌లు వెలుతురు యొక్క అర్థాన్ని తెలుసుకోలేరు. వారి యొక్క జీవితాల‌ను అంధ‌కారం లో గ‌డ‌ప‌ని వారు కాంతి యొక్క విలువ‌ ను గ్రహించలేరు’’ అని వ్యాఖ్యానించారు.

ఎన్‌డిఎ ప్ర‌భుత్వం అధికారం లోకి వ‌చ్చిన త‌రువాత వేలాది గ్రామాల‌ను విద్యుతీక‌రించ‌డమైంద‌ని ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ క్ర‌మం లో వివ‌రించారు. ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వం ఇచ్చిన త‌ప్పుడు వాగ్దానాల‌ మాదిరిగా కాకుండా ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ప్ర‌తి ప‌ల్లె ను విద్యుతీక‌రించగ‌ల‌మ‌ని చెప్పి ఆ మాట‌ల‌ను చేత‌ ల‌లో చూపింద‌ని ఆయన తెలిపారు. ప్ర‌భుత్వం ఒక్క విద్యుతీకర‌ణ పైనే శ్ర‌ద్ధ వ‌హించ‌డం కాకుండా దేశ‌ వ్యాప్తంగా పంపిణీ వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా సంస్క‌రించింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

స్వాతంత్య్రం అనంత‌రం 70 సంవ‌త్స‌రాల కాలంలో సైతం విద్యుచ్ఛక్తి కి ఆవ‌ల ఉండిపోయిన ఈ 18,000 ప‌ల్లెల‌ల‌ను గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో విద్యుతీక‌రించ‌డ‌మైంది. విద్యుతీక‌రించిన ఆఖ‌రు గ్రామ‌ం ఈశాన్య ప్రాంతం లోని మ‌ణిపుర్ లో గ‌ల లీసాంగ్ గ్రామం. 2018 ఏప్రిల్ 28వ తేదీన ఈ ప‌ల్లె కు విద్యుత్తు స‌దుపాయాన్ని అందించ‌డ‌మైంది. క‌డ‌ప‌టి 18,000 ప‌ల్లెలు సుదూర ప్రాంతాల‌కు, ప‌ర్వ‌త‌మ‌య ప్రాంతాల‌కు మరియు సంధానం లేన‌టువంటి ప్రాంతాల‌కు చెందిన‌వి కావ‌డంతో వీటికి విద్యుత్తు సౌక‌ర్యాన్ని స‌మ‌కూర్చ‌డం క‌ష్ట సాధ్య‌ం అయింద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ వివ‌రించారు. ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌తి గ్రామాన్ని విద్యుతీక‌రించాల‌నే కల ను పండించడం కోసం అంకిత భావంతో కూడిన ప్ర‌జ‌ల బృందం క‌ఠోరంగా శ్ర‌మించిన‌ట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు.

విద్యుత్తు సౌక‌ర్యానికి ఆవ‌ల ఉండిపోయిన 18,000 గ్రామాల‌లో 14,582 గ్రామాలు దేశ తూర్పు ప్రాంతాల‌కు చెందిన‌వేన‌ని, మ‌ళ్ళీ అందులోను 5,790 గ్రామాలు ఈశాన్య భార‌తావ‌ని లో ఉన్నాయ‌ని ప్రధాన మంత్రి చెబుతూ, ఈ ప‌రిస్థితుల‌ను ప్ర‌భుత్వం మార్చివేసినట్లు తెలిపారు. తూర్పు భార‌తావ‌నిని అభివృద్ధి ప‌ర‌చ‌డానికి ప్ర‌భుత్వం ప్రాధాన్యాన్ని ఇస్తోంద‌ని, సంపూర్ణ విద్యుతీక‌ర‌ణ తో ప్ర‌స్తుతం తూర్పు భార‌తావ‌ని భార‌త‌దేశ పురోగ‌మ‌న యాత్ర లో మ‌రింత పెద్ద భూమిక‌ ను పోషించ‌గ‌ల‌ద‌ని ఆయ‌న చెప్పారు.

దేశం లోని ప్ర‌తి ఒక్క ఇంటి లో విద్యుత్తు వెలుగులు విర‌జిమ్మాల‌నే ల‌క్ష్యం తో ‘ప్ర‌ధాన మంత్రి స‌హ‌జ్ బిజిలీ హర్ ఘర్ యోజ‌న‌’ ను ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి వెల్లడించారు. ఈ యోజ‌న లో భాగంగా ఇంత వ‌ర‌కు 86 ల‌క్ష‌ల కు పైగా గృహాల‌ లో విద్యుత్తు సౌక‌ర్యాన్ని స‌మ‌కూర్చ‌డ‌మైంది. ఈ యోజ‌న ఉద్య‌మ స్థాయిలో పురోగ‌మిస్తోంది. ఈ యోజన ద్వారా దాదాపు నాలుగు కోట్ల గృహాల‌కు విద్యుత్తు క‌నెక్ష‌న్ అందేట‌ట్లుగా కృషి చేయ‌డం జ‌రుగుతుంది.

సుదూర గ్రామాల ల‌బ్ధిదారులు ప్ర‌ధాన మంత్రి తో జ‌రిగిన సంభాష‌ణ లో భాగం పంచుకొంటూ విద్యుచ్ఛక్తి వారి జీవితాల‌లో ఏ విధ‌ంగా శాశ్వ‌త ప‌రివ‌ర్త‌న‌ ను తీసుకు వ‌చ్చిందీ వెల్లడి చేశారు. సూర్యుడు అస్త‌మించే స‌మ‌యాని క‌న్నా ముందే ప‌నులను పూర్తి చేసుకొవ‌డం మొద‌లు కిర‌స‌నాయిలు దీపాల వెలుగు లో చ‌దువుకొమ్మ‌ంటూ పిల్లలనుని పోరు పెట్ట‌డం వ‌ర‌కు ప‌రిశీలిస్తే విద్యుతీక‌ర‌ణ వారి జీవ‌నాన్ని ఎంతో స‌ర‌ళ‌త‌రంగా మార్చివేసింది. చాలా వ‌ర‌కు ల‌బ్దిదారులు వారి జీవితం లో నాణ్య‌త ప‌రంగా మొత్తం మీద మెరుగుద‌ల సాధ్య‌మైంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. త‌మ ఇళ్ళ లో వెలుగుల‌ను నింపినందుకు ప్ర‌ధాన మంత్రి కి ల‌బ్దిదారులు ధ‌న్య‌వాదాలను కూడా తెలియజేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PLI 2.0: India bets big on making more of the smartphone at home

Media Coverage

PLI 2.0: India bets big on making more of the smartphone at home
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 మే 2026
May 29, 2026

Every Sector, Every Citizen: How PM Modi’s Vision is Transforming India Across All Fronts