ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా జెండా ను చూపి, నాగ్‌పుర్ మెట్రో ను ప్రారంభించారు. నాగ్‌పుర్ మెట్రో లో భాగ‌ం గా ఉన్నటువంటి 13.5 కి.మీ. పొడవైన ఖాప్‌రీ-సితాబర్డీ సెక్ష‌ను ను డిజిట‌ల్ ప‌ద్ధ‌తి లో ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించ‌డం ద్వారా ప్రారంభించ‌డం జ‌రిగింది.

ప్ర‌ధాన మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, మ‌హారాష్ట్ర లో రెండో మెట్రో సేవల ను అందుకొంటున్న‌ందుకుగాను నాగ్‌పుర్ ప్ర‌జ‌ల కు అభినంద‌న‌లు తెలిపారు. నాగ్‌పుర్ మెట్రో ప‌నుల‌ కు 2014 వ‌ సంవ‌త్స‌రం లో శంకుస్థాప‌న చేసింది తానే కావ‌డం వ‌ల్ల ఇది త‌న‌ కు ఒక ప్ర‌త్యేకమైన ఘ‌డియ అని ఆయ‌న అన్నారు. ఈ మెట్రో నాగ్‌పుర్ లో ప్ర‌జ‌ల కు ఒక ఉత్త‌మ‌మైనటువంటి, త‌క్కువ ఖ‌ర్చు తో కూడినటువంటి మ‌రియు ప‌ర్యావ‌ర‌ణ మిత్ర పూర్వ‌క‌మైనటువంటి ర‌వాణా సాధ‌నాన్ని స‌మ‌కూర్చుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

నాగ్‌పుర్ యొక్క భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ ను దృష్టి లో పెట్టుకొని నాగ్‌పుర్ ను అభివృద్ధి చేయ‌డం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం మరియు కేంద్ర ప్ర‌భుత్వం అదే ప‌ని గా కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. నాగ్‌పుర్ మెట్రో యువ‌జ‌నుల కు ఉపాధి అవ‌కాశాల‌ ను కల్పించ‌డం తో పాటు న‌గ‌రం యొక్క ఇతోధిక వృద్ధి కి కూడా స‌హాయ‌కారి కాగ‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు.

దేశ‌వ్యాప్తం గా ఆధునిక ర‌వాణా వ్య‌వ‌స్థ ను నిర్మించ‌డం లో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖం గా ప్ర‌స్తావిస్తూ, గ‌డ‌చిన నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల కాలం లో 400 కి.మీ. మేర మెట్రో నెట్ వ‌ర్క్ ప‌ని చేయడం ప్రారంభించింద‌న్నారు. దేశం అంత‌టా 800 కి.మీ. మేర మెట్రో నెట్ వ‌ర్క్ పనులు పురోగ‌మిస్తున్నాయని ఆయ‌న వెల్లడించారు.

ఇటీవ‌లే ప్రారంభించిన కామ‌న్ మొబిలిటీ కార్డ్ అయిన‌టువంటి ‘వ‌న్ నేశ‌న్‌, వ‌న్ కార్డ్’ తాలూకు ప్ర‌యోజ‌నాల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. దేశీయం గా రూపొందించిన ఈ కార్డు.. మొబిలిటీ కార్డు ను డెబిట్ కార్డు తో మిళితం చేసింద‌ని, ఈ త‌ర‌హా కార్డు ను రూపొందించ‌డం లో ఇత‌ర దేశాల పై భార‌తదేశం ఆధార‌ప‌డ‌డాన్ని నివారించింద‌ని ఆయ‌న అన్నారు.

ర‌వాణా కు ఉప‌యోగ‌ప‌డేటటువంటి ఈ కోవ‌ కు చెందిన ఒక కామ‌న్ మొబిలిటీ కార్డు ప్ర‌పంచం లో చాలా కొద్ది దేశాల లో మాత్ర‌మే ఉందని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ప‌రిష్కారాల‌ ను క‌నుగొనడం లో కేంద్ర ప్ర‌భుత్వం ఏకీకృత పద్ధతి ని అవ‌లంబిస్తున్నట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు. దేశం లో పౌరులంద‌రి కి జీవిచ‌డం లో సౌల‌భ్యానికి పూచీ ప‌డేందుకు ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకొంద‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s 5G traffic surges 70% Y-o-Y: Nokia report

Media Coverage

India’s 5G traffic surges 70% Y-o-Y: Nokia report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Shri Leander Paes meets the Prime Minister
April 01, 2026

Shri Leander Paes met with the Prime Minister Shri Narendra Modi, today, at New Delhi. “India is very proud of his accomplishments in tennis. We discussed a wide range of issues. His passion towards sports and nation building is truly admirable”, Shri Modi stated.

The Prime Minister posted on X;

“Had a great meeting with Shri Leander Paes Ji. India is very proud of his accomplishments in tennis. We discussed a wide range of issues. His passion towards sports and nation building is truly admirable.”

@Leander