Science and technology ecosystem should be impactful as well as inspiring: PM Modi
Scientific Temper wipes out superstition: PM Modi
There are no failures in science; there are only efforts, experiments and success: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోల్ కాతా లో ఈ రోజు న ఏర్పాటైన 5వ ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ ను వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఈ కార్య‌క్ర‌మం యొక్క ఇతివృత్తమైనటువంటి ‘‘ఆర్ఐఎస్ఇఎన్‌: రిస‌ర్చ్, ఇన‌వేశ‌న్ ఎండ్ సైన్స్ ఎంప‌వ‌రింగ్ ద నేశ‌న్‌’’ 21వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశం యొక్క ఆకాంక్ష‌ల ను ప్ర‌తిబింబిస్తోంద‌న్నారు.

విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం స‌మాజం పైన ఒక పెను ప్ర‌భావాన్ని ప్ర‌స‌రిస్తూ ఉంటాయని, ఈ కార‌ణం గానే ప్ర‌భుత్వం ఆవిష్క‌ర‌ణల‌ కు మ‌రియు న‌వ‌క‌ల్ప‌న‌ల కు సంస్థాగ‌త‌మైన‌ మ‌ద్ధ‌తు ను అందిస్తూవస్తోందని ఆయ‌న తెలిపారు. విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం.. ఈ రెంటి కి మ‌ద్ధ‌తిచ్చేట‌టువంటి ఒక బ‌ల‌మైన ఇకోసిస్ట‌మ్ ఉండాల‌ని ఆయ‌న సూచిస్తూ, దేశం లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల కు మ‌ద్ధ‌తివ్వ‌డం కోసం స‌క‌ల ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని వివరించారు. ఈ దిశ గా 5 వేల కు పైగా అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్స్ తో పాటు, 200 ల‌కు పైగా అట‌ల్ ఇంక్యుబేశ‌న్ సెంట‌ర్స్ ను స్థాపించిన సంగతి ని ఆయన ప్రస్తావించారు.

‘‘మ‌న జీవ‌నాన్ని సుల‌భ‌త‌రం గా మ‌ల‌చ‌డం లో విజ్ఞాన శాస్త్రం ఏ విధం గా స‌హాయ‌కారి కాగ‌ల‌దో మ‌నం ఆలోచించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. అందువ‌ల్లే స‌మాజం లో విజ్ఞాన శాస్త్రాని కి ఒక గొప్ప ఉపయుక్తత ఉంది. ప్ర‌తి ఒక్క శాస్త్రవేత్త తో పాటు దేశం లోని ప్రతి ఒక్కరు ఈ ర‌కం గా ఆలోచన చేసి తదనుగుణం గా నడచుకొంటే, అప్పుడు దేశం ముందంజ వేయగలదు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

విజ్ఞాన శాస్త్రం మ‌న‌కు ప్ర‌సాదించేట‌టువంటి దీర్ఘ కాల ప‌రిష్కారాల పై మ‌రియు దీర్ఘ‌ కాల ప్ర‌యోజ‌నాల పై శ్ర‌ద్ధ వ‌హించ‌వ‌ల‌సింది గా ప్ర‌తి ఒక్క‌రి ని ప్ర‌ధాన మంత్రి కోరారు. ‘‘ అంత‌ర్జాతీయ చ‌ట్టాలు మ‌రియు ప్ర‌మాణాల విషయం లోనూ మీరు నిరంత‌రం సావధానం గా ఉండాలి’’ అని కూడా ఆయ‌న చెప్పారు.

‘‘సాంకేతిక విజ్ఞానం అనేది రెండు అంశాల ఫ‌లితం. ఆ రెండు అంశాలు ఏమిటంటే ఒక స‌మ‌స్య యొక్క ఉనికి; ఆయా స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించ‌డం కోసం మ‌నం చేప‌ట్టే ప్ర‌యోగాలు. ఈ సంగ‌తి ని మ‌న అంద‌రికి ఎంతో బాగా తెలుసు’’ అని ఆయ‌న అన్నారు.

‘‘విజ్ఞాన శాస్త్రం లో ఓట‌ములు ఉండ‌వు. కేవ‌లం ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు మ‌రియు సాఫ‌ల్యం.. ఇవే ఉన్నాయి. మీరు ప‌ని చేసేట‌ప్పుడు ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకొంటే అప్పుడు మీరు మీ యొక్క జీవ‌నం లో గాని, లేదా మీ యొక్క శాస్త్రీయ ప‌రిశోధ‌న‌ లో గాని ఎటువంటి ఇబ్బందుల ను ఎదుర్కోరు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Our private space ecosystem can become major force for India and the world, PM tells start-ups

Media Coverage

Our private space ecosystem can become major force for India and the world, PM tells start-ups
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the values of compassion and contentment
August 24, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that compassion brings self-respect and contentment brings true happiness. He noted that this spirit further strengthens the bonds of cooperation and harmony in society.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“कारुण्येनात्मनो मानं तृष्णां च परितोषतः।

उत्थानेन जयेत्तन्द्रीं वितर्कं निश्चयाज्जयेत्॥”

The Subhashitam conveys that self-respect is achieved by showing kindness or compassion to others. Greed is overcome by being satisfied at one's fortune in life. One must conquer laziness, dubious reasoning and indecisiveness by exertion and entrepreneurship.

The Prime Minister wrote on X;

“करुणा से आत्म-सम्मान और संतोष से सच्ची खुशी मिलती है। इसी भाव से समाज में सहयोग और सद्भाव की डोर और सशक्त होती है।

कारुण्येनात्मनो मानं तृष्णां च परितोषतः।

उत्थानेन जयेत्तन्द्रीं वितर्कं निश्चयाज्जयेत्॥”