Allahabad High Court is like a ‘Tirtha Kshetra’ for the judiciary: PM Modi
Those associated with the legal profession played a vital role in the freedom struggle and protected our people against colonialism: PM
Gandhi Ji played significant role by integrating every work with the freedom struggle: PM
Let us think about the India we want to create when we mark 75 years of freedom in 2022: PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు వేడుకను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలహాబాద్ న్యాయస్థానం మన న్యాయ వ్యవస్థకు ఒక పుణ్య క్షేత్రం వంటిదని అన్నారు. న్యాయ వృత్తితో సంబంధం ఉన్నవారు కూడా మన స్వాతంత్ర్య పోరాటంలో ఒక కీలక పాత్రను పోషించారని, వలస వాదం బారి నుంచి ప్రజలను సంరక్షించారని ఆయన చెప్పారు.

2022 సంవత్సరంలో మనం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాలను జరుపుకొనే నాటికి మనం ఎటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించుకోవాలో ఆలోచన చేయవలసిందిగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా ప్రతి పౌరుడు ఒక మార్గ సూచీని సిద్ధం చేయాలని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం 2014 మే నుండి సుమారు 1200 చట్టాలను రద్దు చేసినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. ఈ శతాబ్దంలో సాంకేతిక విజ్ఞానం ఒక కీలకమైన పాత్ర పోషిస్తోందని, న్యాయ వ్యవస్థలో కూడా సాంకేతిక విజ్ఞానానికి ఎంతో అవకాశం ఉందని ఆయన అన్నారు. స్టార్ట్ అప్ రంగంలో పని చేస్తున్నవారు సాంకేతిక విజ్ఞానం, న్యాయ వ్యవస్థకు ఏ విధంగా తోడ్పడగలుగుతుంది అన్న అంశాలపై నూతన ఆవిష్కరణలకు నడుం కట్టాలని ఆయన కోరారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 సెప్టెంబర్ 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi