QuotePM congratulates Harivansh Narayan Singh on being elected as Deputy Chairperson of Rajya Sabha
QuoteWorking closely with Chandra Shekhar Ji, Harivansh Ji knew in advance that Chandra Shekhar Ji would resign. However, he did not let his own paper have access to this news. This shows his commitment to ethics and public service: PM
QuoteHarivansh Ji is well read and has written a lot. He has served society for years: PM Modi

రాజ్య స‌భ డిప్యూటీ చైర్ మన్ గా శ్రీ హ‌రివంశ్ ఎన్నిక కావ‌డం తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌ కు ఈ రోజు అభినంద‌న‌లు తెలిపారు.

ఎన్నిక ముగిసిన కొద్దిసేప‌టి త‌రువాత ఎగువ స‌భ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, స‌భా నాయ‌కుడు శ్రీ అరుణ్ జైట్లీ అనారోగ్యం నుంచి కోలుకొని స‌భ‌ కు తిరిగి వచ్చారంటూ అందుకు హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.

|

ఈ రోజు మ‌నం క్విట్ ఇండియా ఉద్య‌మ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకొంటున్నామ‌ని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు. హ‌రివంశ్ గారి స్వ‌స్థ‌ల‌మైన బ‌లియా 1857 నాటి నుంచి జ‌రిగిన స్వాతంత్య్ర స‌మ‌రం తో ముడిప‌డినటువంటి గ‌డ్డ అని ప్రధాన మంత్రి చెప్పారు. లోక్ నాయ‌క్ జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ్ ద్వారా శ్రీ హ‌రివంశ్ ప్రేర‌ణ‌ ను పొందార‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

పూర్వ ప్ర‌ధాని చంద్ర‌శేఖ‌ర్ గారి తో కూడా హ‌రివంశ్ గారు ప‌ని చేశార‌ని ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెచ్చారు.

|

చంద్ర‌శేఖ‌ర్ గారి తో స‌న్నిహితంగా ప‌ని చేసిన హ‌రివంశ్ గారికి చంద్ర‌శేఖ‌ర్ గారు రాజీనామా చేస్తార‌న్న సంగ‌తి ముందుగానే తెలుసున‌ని ప్ర‌ధాన మంత్రి వెల్లడించారు. అయితే ఈ వార్త‌ను ఆయ‌న త‌న సొంత వార్తా ప‌త్రిక కు కూడా చెప్ప‌లేద‌ని, ఈ ఘ‌ట‌న ఆయనకు నైతిక‌త‌ అన్నా, ప్ర‌జాసేవ అన్నా ఉన్నటువంటి నిబ‌ద్ధ‌త‌ ను చాటుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

హ‌రివంశ్ గారు బాగా చదువుకున్న వ్యక్తి అని, అంతే కాకుండా ఆయన చేయి తిరిగిన ర‌చ‌యిత కూడా అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. హ‌రివంశ్ గారు సామాజానికి సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి సేవ చేశార‌ని కూడా ఆయ‌న చెప్పారు.

|

రాజ్య స‌భ డిప్యూటీ చైర్ ప‌ర్స‌న్ ఎన్నిక‌ లో పాలుపంచుకొన్నందుకు శ్రీ బి.కె. హ‌రిప్ర‌సాద్ ను కూడా శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు. ఎన్నిక సాఫీగా సాగిపోయినందుకు చైర్ మన్ కు, స‌భ్యులంద‌రికీ ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Click here to read full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India’s Northeast: The new frontier in critical mineral security

Media Coverage

India’s Northeast: The new frontier in critical mineral security
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 జూలై 2025
July 19, 2025

Appreciation by Citizens for the Progressive Reforms Introduced under the Leadership of PM Modi