భారతదేశం నౌకాదళం కోసం తదుపరి తరాని కి చెందినటువంటి ఆఫ్ శోర్ పట్రోల్ వెసల్స్ పదకొండిటి తో పాటు తదుపరి తరానికి చెందిన మిసైల్ వెసల్స్ ఆరింటి ని సేకరించడానికి గాను దాదాపు గా 19,600 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో కూడిన ఒప్పంద పత్రాల పైన 2023 మార్చి నెల 30వ తేదీ నాడు ఇండియన్ శిప్ యార్డు లతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ సంతకాలు చేసింది అంటూ రక్షణ మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది.
ఆర్ఎమ్ఒ ఇండియా చేసిన ట్వీట్ కు, ప్రధాన మంత్రి జవాబిస్తూ -
‘‘ఇది భారతదేశం నౌకా దళాన్ని బలోపేతం చేయడం తో పాటు ఆత్మనిర్భరత ను సాధించాలి అనేటటువంటి మన లక్ష్యాని కి అండదండల ను కూడా అందిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
This will strengthen the Indian Navy and add momentum to our aim of Aatmanirbharta. https://t.co/MRETNEWhjI
— Narendra Modi (@narendramodi) March 31, 2023


