షేర్ చేయండి
 
Comments

1. దేశ ప్రజలు అందరి తో పాటు సోదరీమణులకు, ఇంకా సోదరులకు నేను భారతదేశపు 73వ స్వాతంత్ర్య దినం యొక్క శుభాకాంక్షలను మరియు మంగళప్రదమైనటువంటి రక్షా బంధన్ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

2. దేశం స్వాతంత్ర్య దిన ఉత్సవాన్ని జరుపుకొంటున్న తరుణం లో, దేశం లోని అనేక ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా కష్టాల పాలవుతున్నారు. పరిస్థితులను సాధారణ స్థాయి కి తీసుకొని రావడం కోసం కేంద్రం, రాష్ట్రాలు మరియు ఇతర సంస్థలు తీవ్రం గా శ్రమిస్తున్నాయి.

3. నూతన ప్రభుత్వం ఏర్పడిన 10 వారాల లోపల రాజ్యాంగ 370వ అధికరణాన్ని మరియు 35ఎ ను రద్దు చేయడం అనేది సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు కన్న కల ను నెరవేర్చే దిశ గా తీసుకొన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి చర్య. గడచిన 70 సంవత్సరాల లో పూర్తి కాని కార్యాన్ని 70 రోజుల లోపల పూర్తి చేయడమైంది. 370వ అధికరణం, 35ఎ ల రద్దు కు లోక్ సభ లో మరియు రాజ్య సభ లో మూడింట రెండు వంతుల సంఖ్యాబలం తో ఆమోద ముద్ర వేయడం జరిగింది.

4. మనం సతి వ్యవస్థ ను అంతం చేయగలిగినపుడు, ఆడ పిండాన్ని హత్య చేయడాని కి వ్యతిరేకం గా కఠిన చట్టాల ను తీసుకురాగలిగినపుడు మరి అలాగే బాల్య వివాహాల ను నిరోధిస్తూ, ఇంకా కట్నాన్ని నిరోధిస్తూ చర్యల ను చేపట్టినపుడు, మూడు సార్లు తలాక్ అంటూ పలికే రివాజు కు వ్యతిరేకం గా కూడా మనం మన వాణి ని వినిపించగలుగుతాము.

5. ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా సమగ్రమైన సవరణ ల ను తీసుకొని రావడమైంది; వాటి ని మరింత కఠినమైనవిగాను, శక్తియుతం గాను రూపుదిద్దడం జరిగింది.

6. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైన రైతుల కు సుమారు 90,000 కోట్ల రూపాయల ను వారి యొక్క బ్యాంకు ఖాతాల కు బదలాయించేటటువంటి ప్రముఖమైన చర్య ప్రస్తుతం అమలవుతున్నది.

7. రైతుల కు మరియు చిన్న నవ పారిశ్రామిక వేత్తల కు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇంతక్రితం ఇటువంటి ఆలోచన ను అయినా ఎన్నడూ చేయడం జరుగలేదు.

8. జల సంక్షోభం తాలూకు సవాళ్ల ను పరిష్కరించడం కోసం, జల శక్తి మంత్రిత్వ శాఖ పేరిట ఒక మంత్రిత్వ శాఖ ను నూతనం గా ఏర్పాటు చేయడమైంది.

9. రానున్న కాలం లో, జల్ జీవన్ మిశన్ ను కేంద్రం తో పాటు రాష్ట్రాలు ముందుకు తీసుకుపోతాయి. దీని కోసం 3.5 లక్షల కోట్ల రూపాయల కు పైగా సొమ్ము ను కేటాయించడమైంది.

10. దేశం లో వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు మరియు వ్యవస్థ ల ఆవశ్యకత ఎంతైనా ఉంది. వైద్య విద్య ను పారదర్శకం గా తీర్చిదిద్దడం కోసం, ముఖ్యమైనటువంటి చట్టాల రూపకల్పన జరిగింది.

11. బాలల సంరక్షణ కోసం దృఢమైన చట్టాల ను తీసుకొని రావడమైంది.

12. 2014-19 మధ్య కాలం అవసరాలను తీర్చిన కాలం కాగా, 2019 అనంతర కాలం ఆకాంక్షల ను మరియు స్వప్నాల ను నెరవేర్చే కాలం అవుతుంది.

13. జమ్ము & కశ్మీర్, ఇంకా లద్దాఖ్ పౌరుల ఆకాంక్షలు నెరవేరేటట్టు చూడడం మా బాధ్యతగా ఉంది. ఆ ప్రాంతాల లో నివసిస్తున్న దళితులు దేశం లోని మిగిలిన ప్రాంతాల లోని దళితులు పొందుతున్న విధంగానే సమాన హక్కుల ను పొందాలి. ఇదే మాదిరి గా, గుజ్జర్ లు, బాకర్ వాల్ లు, గద్దీ లు, సిప్పీ లు లేదా బాల్టీ లు రాజకీయ హక్కుల ను పొందాలి. దేశ విభజన అనంతరం, లక్షలాది ప్రజలు స్థలం మార్పు కు లోనై జమ్ము & కశ్మీర్ లో స్థిరపడ్డారు. వారి కి ప్రాథమిక మానవ హక్కులు మరియు పౌర హక్కులు అందలేదు.

14. జమ్ము & కశ్మీర్, ఇంకా లద్దాఖ్ శాంతి కి మరియు సమృద్ధి కి ఆదర్శవంతమైనటువంటి నమూనా లు కావచ్చు. భారతదేశం యొక్క అభివృద్ధి కై గణనీయంగా తోడ్పాటు ను అందజేయవచ్చును. భారతదేశం యొక్క పురోగతి కి రాష్ట్రం గొప్ప గా అండదండల ను అందించవచ్చు. ఈ రోజు న భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వం గా ‘ఒక దేశం, ఒక రాజ్యాంగం’ అని పలుక గలుగుతారు.

15. జిఎస్ టి అనేది ‘ఒక దేశం, ఒక పన్ను’ తాలూకు కల ను నెరవేర్చింది. మనం విద్యుత్తు రంగం లో ‘ఒక దేశం, ఒక గ్రిడ్’ ను సాధించడం లో సఫలం అయ్యాము. మనం ‘ఒక దేశం, ఒక మొబిలిటీ కార్డు’ వ్యవస్థ ను కూడా అభివృద్ధిపరచాము. ప్రస్తుతం ‘ఒక దేశం, ఒక ఎన్నికలు’ ఉండాలన్న చర్చ జరుగుతోంది. మరి అది ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతి లో చోటు చేసుకోవాలి.

16. జనాభా విస్ఫోటం అనేది కొత్త సమస్య లను- ప్రత్యేకించి భవిష్యత్తు తరాల వారి కి- తెచ్చిపెట్టగలదు. అయితే సమాజం లో ఈ సవాలు ను గురించిన ఎరుక కలిగినటువంటి ఒక వర్గం అంటూ ఉంది కూడాను. సమాజం లో అన్ని వర్గాల వారి ని వెంట తీసుకుపోతూ మనం ఆలోచన చేయవలసివుంది.

17. అవినీతి, ఇంకా ఆశ్రిత పక్షపాతం దేశాని కి ఊహకు అందని రీతి లో హాని చేశాయి. ఈ జాడ్యం తో పోరాడటం కోసం మేము సాంకేతిక విజ్ఞానం సహాయం తో అనేక చర్యల ను తీసుకొన్నాము.

18. జీవనం లో సరళత్వం అనేది స్వతంత్ర భారతదేశానికి ఒక ఆవశ్యకత గా మారింది. నిత్య జీవనం లో ప్రభుత్వాని కి ప్రమేయం తక్కువ స్థాయి లో ఉండేటటువంటి ఒక వ్యవస్థ ను మనం ఆవిష్కరించుకోవలసివుంది.

19. క్రమం గా సాధించే ప్రాతిపదిక తో కూడినటువంటి వృద్ధి కోసం దేశం ఇక ఎంతమాత్రం వేచివుండజాలదు; దేశం పెద్ద పెద్ద అడుగుల తో పురోగమించడం కోసం పాటుపడాల్సిందే.

20. దేశం లో అత్యాధునిక మౌలిక వ‌స‌తుల అభివృద్ధి కి ఇదే కాలం లో 100 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ను కేటాయించ‌డం జ‌రిగింది. దీని వ‌ల్ల కొత్త ఉపాధి అవ‌కాశాలు అందుబాటు లోకి రావ‌డం తో పాటు జీవ‌న ప్ర‌మాణాలు కూడా మెరుగుప‌డ‌తాయి.

21. ఆర్థిక వ్య‌వ‌స్థ ను 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల స్థాయి కి చేర్చాల‌న్న‌ది భార‌త‌దేశం క‌ల‌. స్వాతంత్య్రం సిద్ధించిన 70 సంవ‌త్స‌రాల కాలం లో దేశం 2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా మాత్ర‌మే అవ‌త‌రించ‌గ‌లిగింది. గ‌త అయిదేళ్ళ కాలం లో మేము దానిని 3 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌ కు చేర్చాం. ఈ వేగాన్ని చూస్తే మ‌నం 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ గా అవ‌త‌రించ‌డం సాధ్య‌మే అనిపిస్తోంది.

22. 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం కల్లా రైతాంగం ఆదాయం రెండింత‌లు కావాలి. పేద‌ల లో ప్ర‌తి ఒక్కరి కి ప‌క్కా ఇల్లు ఉండాలి. ప్ర‌తి ఒక్క ఇంటి కి విద్యుత్తు స‌దుపాయం అందుబాటు లోకి రావాలి. ప్ర‌తి ఒక్క గ్రామాని కి ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్‌, బ్రాడ్ బ్యాండ్ క‌నెక్టివిటీ, దూర‌విద్య స‌దుపాయం అందుబాటులో ఉండాలి.

23. మేము సాగ‌ర వ‌న‌రుల ఆధారిత నీలి ఆర్థిక వ్య‌వ‌స్థ పై ప్ర‌ధానం గా దృష్టి సారిస్తున్నాము. మ‌న రైతు లు ఎగుమ‌తిదారులు గా మారాలి. దేశం లో ప్ర‌తి ఒక్క జిల్లా ఒక ఎగుమ‌తి కేంద్రం గా అవ‌త‌రించాలి. విలువ ఆధారిత వ‌స్తువుల‌ తో ప్ర‌తి ఒక్క జిల్లా ప్ర‌పంచ విపణుల కు చేరాలి.

24. ఒక చ‌క్క‌ని ప‌ర్యాట‌క కేంద్రంగా ప్ర‌పంచాన్నే అబ్బుర‌ప‌ర‌చే స్థాయి కి భార‌త‌దేశం చేరుకోగ‌ల‌దు. భారతదేశం లో ప్ర‌తి ఒక్కరు ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించాలి. ప‌ర్యాట‌క రంగం ఎంతో మంది కి అతి త‌క్కువ పెట్టుబ‌డుల‌ తో ఉపాధి ని క‌ల్పించ‌డం తో పాటు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ను శ‌క్తివంతం చేస్తుంది.

25. సుస్థిర‌మైన ప్ర‌భుత్వ‌మే అంద‌రి ఊహ‌ల‌ కు అందే విధానాల‌ను రూపొందించ‌గ‌లుగుతుంది. సుస్థిర‌మైన వ్య‌వ‌స్థ అంత‌ర్జాతీయ విశ్వాసాన్ని పొందుతుంది. దేశం లో నెల‌కొన్న రాజ‌కీయ సుస్థిర‌తను ప్ర‌పంచం యావ‌త్తు ఎంతో ఆరాధ‌న భావం తో తిల‌కిస్తోంది.

26. ధ‌ర‌లు అదుపు లో ఉంచుతూనే, అధిక వృద్ధి రేటు ను సాధిస్తూ, భార‌త‌దేశం పురోగ‌మించ‌డం ఎంతో గ‌ర్వ‌కార‌ణం.

27. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ మూలాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయి. జిఎస్‌టి & ఐబిసి వంటి సంస్క‌ర‌ణ‌లు వ్య‌వ‌స్థ లో ఒక కొత్త విశ్వాన్ని తెచ్చాయి. మ‌న పెట్టుబ‌డిదారులు అంద‌రూ మ‌రింత‌గా పెట్టుబ‌డులు పెట్టి, మ‌రింత‌గా సంపాదించి, మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు అందుబాటు లోకి తీసుకు రావాలి. మ‌న సంప‌ద సృష్టించే వారి ప‌ట్ల అనుమానాస్ప‌దం గా చూసే ధోర‌ణి ని మ‌నం విడ‌నాడాలి. చ‌క్కని గౌర‌వాన్ని పొంద‌డానికి వారు అంద‌రూ అర్హులే. సంప‌ద ను ఎంత‌గా సృష్టించ‌గ‌లిగితే, అంత‌ గా అది పంపిణీ అవుతుంది. పేద ప్ర‌జ‌ల సంక్షేమాని కి స‌హాయ‌కారి గా నిలుస్తుంది.

28. ఉగ్ర‌వాదాన్ని విస్త‌రిస్తున్న శ‌క్తుల‌ తో భార‌త‌దేశం శ‌క్తివంతం గా పోరాడుతోంది. ఉగ్ర‌వాదాని కి ఆశ్ర‌యాన్ని ఇచ్చి, ప్రోత్స‌హించి, ఇత‌ర దేశాల‌ కు విస్త‌రించే వారిని బ‌ట్ట‌బ‌య‌లు చేసే విష‌యం లో భార‌త‌దేశం ప్ర‌పంచం లోని ఇత‌ర దేశాల‌ తో క‌ల‌సి కృషి చేస్తోంది. ఉగ్ర‌వాదాన్ని నిర్మూలించ‌డం లో మ‌న భ‌ద్ర‌త ద‌ళాలు, భ‌ద్ర‌త సంస్థ‌ లు ఎంతో కీల‌కమైనటువంటి పాత్ర ను పోషించాయి. వారంద‌రికీ శిర‌స్సు ను వంచి అభివాదం చేస్తున్నాను.

29. మ‌న పొరుగు దేశాలైన బాంగ్లాదేశ్‌, ఆఫ్‌‌నిస్తాన్‌, శ్రీ లంక ఉగ్ర‌వాదం తో అల్లాడుతున్నాయి. మ‌న పొరుగున ఉన్న మంచి మిత్ర దేశం అఫ్గానిస్తాన్ మ‌రో నాలుగు రోజుల్లో వందో స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని నిర్వ‌హించుకోబోతోంది. స్వాతంత్య్ర శ‌త వార్షికోత్స‌వాలు నిర్వ‌హించుకొంటున్న అఫ్గాన్ ప్ర‌జ‌లంద‌రికీ ఈ ఎర్ర కోట బురుజుల మీది నుండి నేను శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.

30. 2014వ సంవ‌త్స‌రం లో ఇదే ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి నేను స్వ‌చ్ఛ‌త నినాదాన్ని ఇచ్చాను. ఇప్ప‌టి నుండి మ‌రికొద్ది వారాల్లో మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి జ‌రుగ‌నున్న అక్టోబ‌రు 2వ తేదీ నాటి కి దేశం బ‌హిరంగ మ‌ల‌మూత్రాదుల విస‌ర్జన ర‌హితం గా మారుతుంది.

31. సుదీర్ఘ కాలంగా దేశం సాయుధ ద‌ళాల సంస్క‌ర‌ణ‌ల గురించి చర్చిస్తోంది. ఎన్నో క‌మిశన్ లు ఆ అంశం పై నివేదిక‌ లను కూడా స‌మ‌ర్పించాయి. సాయుధ ద‌ళాల మ‌ధ్య స‌మ‌న్వ‌యాన్ని సాధించ‌డం కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్)ను ఏర్పాటు చేస్తున్నాము. ఈ వ్య‌వ‌స్థ ర‌క్ష‌ణ ద‌ళాల‌ ను అన్నింటినీ మ‌రింత స‌మ‌ర్ధ‌వంతం గా మార్చ‌గ‌లుగుతుంది.

32. అక్టోబ‌రు 2వ తేదీ నాటికి దేశాన్ని ప్లాస్టిక్ ర‌హితంగా చేయాల‌ని నేను దేశ‌వాసుల‌ ను కోరుతున్నాను. ప్ర‌తి ఒక్క పౌరుడు, ప్ర‌తి ఒక్క పుర‌పాల‌క సంఘం, గ్రామ పంచాయ‌తీ ఈ విష‌యం లో క‌ల‌సిక‌ట్టుగా ముంద‌ంజ వేయాలి.

33. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్ప‌త్తుల త‌యారీ మా ప్రాధాన్య‌ం. స‌ముజ్వ‌ల‌మైన రేప‌టి కోసం మ‌న‌ం అంద‌రం స్థానిక ఉత్ప‌త్తుల‌నే వినియోగించాలి. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు, ఎమ్ఎస్ఇ రంగాని కి మ‌రింత చేయూత ను ఇచ్చేందుకు కృషి చేయాలి.

34. మ‌న డిజిట‌ల్ చెల్లింపుల వ్య‌వ‌స్థ శ‌క్తివంతం గా రూపుదిద్దుకొంటోంది. గ్రామాల్లోని దుకాణాలు, చిన్న చిన్న విక్ర‌య కేంద్రాలు, చిన్న స్థాయి న‌గ‌ర మాల్స్ లో కూడా డిజిట‌ల్ చెల్లింపుల‌ కు మ‌నం ప్రాధాన్య‌ాన్ని ఇవ్వాలి.

35. ర‌సాయ‌నిక ఎరువులు, క్రిమినాశ‌నులు వినియోగించ‌డం ద్వారా భూసారాన్ని మ‌న‌మే నాశ‌నం చేస్తున్నాము. మ‌హాత్మ గాంధీ మ‌న‌కు చూపిన మార్గం లో ప‌య‌నిస్తూ, ర‌సాయ‌నిక ఎరువుల వినియోగాన్ని 10 శాతం, 20 శాతం లేదా 25 శాతానికి త‌గ్గించ‌లేమా ? నా ఆకాంక్ష‌ ను రైతులు అంద‌రూ ఆమోదిస్తార‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.

36. భార‌తీయ వృత్తి నిపుణులు ప్ర‌పంచ‌వ్యాప్తం గా గుర్తింపు పొంద‌గ‌లుగుతున్నారు. చంద్ర‌యాన్ ప్ర‌యోగం ద్వారా మ‌న శాస్త్రవేత్త‌లు వారి శ‌క్తి ఏమిటో నిరూపించారు. చంద్ర‌యాన్ త్వ‌ర‌లోనే ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ చేర‌ని ప్ర‌దేశాల‌ కు చేరనుంది.

37. రానున్న రోజుల్లో గ్రామాలలో 1.5 ల‌క్ష‌ల వెల్‌నెస్ కేంద్రాల ను ఏర్పాటు చేయనున్నాము. ప్ర‌తి మూడు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌ కు మ‌ధ్య‌స్తంగా ఉండేలా ఒక వైద్య క‌ళాశాల‌, 2 కోట్ల మంది పేద ప్ర‌జ‌ల‌కు గృహ వ‌స‌తి, 15 కోట్ల గ్రామీణ గృహాల‌ కు త్రాగునీటి స‌ర‌ఫ‌రా, గ్రామీణ ప్రాంతాల లో 1.25 ల‌క్ష‌ల కిలో మీట‌ర్ల రహదార్ల నిర్మాణాన్ని చేప‌ట్ట‌బోతున్నాము. అలాగే, ప్ర‌తి ఒక్క గ్రామాన్ని బ్రాడ్ బ్యాండ్ స‌దుపాయాన్ని క‌ల్పించ‌డం, ఆప్టిక్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్ క‌ల్పించ‌డం మేం సాధించాల్సిన ల‌క్ష్యాల లో ఉన్నాయి. 50,000కు పైగా కొత్త స్టార్ట్‌-అప్ ల ఏర్పాటు కు రంగం సిద్ధం అవుతోంది.

38. బాబా సాహ‌బ్ ఆంబేడ్క‌ర్ క‌ల అయిన భార‌త రాజ్యాంగం ఈ ఏడాది 70 సంవ‌త్సరాలు పూర్తి చేసుకొంటోంది. అలాగే, గురు నాన‌క్ దేవ్ జీ 550వ జ‌యంతి కూడా ఈ ఏడాది జరుగ‌నుంది. మ‌రింత మెరుగైన స‌మాజం, మ‌రింత మెరుగైన దేశం సాధించాల‌న్న ల‌క్ష్యాన్ని చేరేందుకు బాబా సాహ‌బ్, గురు నాన‌క్ దేవ్ ల బోధ‌న‌ ల స్ఫూర్తి తో మ‌నం ముందుకు సాగుదాము. 

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
India’s non-fossil energy has grown by 25 per cent in 7 years

Media Coverage

India’s non-fossil energy has grown by 25 per cent in 7 years
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM applauds those who are displaying their products on GeM platform
November 29, 2022
షేర్ చేయండి
 
Comments
GeM platform crosses Rs. 1 Lakh crore Gross Merchandise value

The Prime Minister, Shri Narendra Modi has applauded the vendors for displaying their products on GeM platform.

The GeM platform crosses Rs. 1 Lakh crore Gross Merchandise value till 29th November 2022 for the financial year 2022-2023.

In a reply to a tweet by Union Minister, Shri Piyush Goyal, the Prime Minister tweeted;

"Excellent news! @GeM_India is a game changer when it comes to showcasing India’s entrepreneurial zeal and furthering transparency. I laud all those who are displaying their products on this platform and urge others to do the same."