ఎన్‌డీఏ ప్రభుత్వంలో గత పదకొండు సంవత్సరాల్లో ఇండియాలో చోటుచేసుకొన్న ప్రశంసనీయ మార్పును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.
నూటనలభై కోట్ల మంది భారతీయుల ఉమ్మడి ప్రాతినిధ్యం అందించిన అండదండలతో, సుపరిపాలనపైనా రూపాంతరీకరణపైనా తదేకంగా దృష్టిని సారించడం విభిన్న రంగాల్లో వేగవంతమైన ప్రగతికి కారణమైందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
‘సబ్‌కా సాథ్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ సిద్ధాంతం నుంచి ప్రేరణను పొంది ఎన్‌డీఏ ప్రభుత్వం వేగంగానూ, విస్తృతంగానూ, స్పందన పూర్వకంగానూ గొప్ప మార్పులను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి వివరించారు.
ఆర్థిక వృద్ధి మొదలు సామాజిక అభ్యున్నతి వరకు.. ప్రజల ప్రయోజనాలకే పెద్ద పీట వేయడానికి, సమాజంలో అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు పోతూ, అన్ని రంగాల్లో ప్రగతిని సాధించడానికి ప్రభుత్వం ప్రాధాన్యాన్ని ఇచ్చిందని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు.
భారత్ ఇవాళ అత్యంత వేగంగా దూసుకుపోతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, అది వాతావరణ మార్పు, డిజిటల్ నవకల్సన వంటి తక్షణ స్పందన అవసరపడే అంశాల్లో తమ అభిప్రాయాలను తెలియజేసే అగ్రగామి ప్రపంచ దేశాల్లో ఒకటిగా కూడా ఉందని ఆయన అన్నారు.
‘‘మన అందరి విజయాన్ని చూసి గర్వపడుతూనే, వికసిత్ భారత్‌ను ఆవిష్కరించగలమన్న ఆశతో, విశ్వాసంతో, మరోసారి సంకల్పాన్ని చెప్పుకొంటూ మనం ముందుకు పోతున్నాం’’ అని శ్రీ మోదీ అన్నారు.
అనేక సానుకూల మార్పులను గత పదకొండు సంవత్సరాలు తీసుకురావడంతో పాటుగా ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచాయి అని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఏయో మార్పులు సంభవించిందీ నమో యాప్ (NaMo App) సాయంతో తెలుసుకోవాల్సిందిగా పౌరులను ఈ సందర్భంలో శ్రీ మోదీ కోరారు. పౌరులు వారు స్వయంగానూ పాలుపంచుకోవచ్చని సూచించే, అలా పాల్గొనడానికి వీలు ఉండే, భాగం పంచుకోవాలనే స్ఫూర్తిని కలిగించే తరహా గేములు, క్విజ్‌లు, సర్వేలతో పాటు ఇతర ఫార్మాట్ల లోనూ ‘నమో యాప్’ ప్రభుత్వ విజయాలను గురించి వివరిస్తుంది.
భారత్ అభివృద్ధి యాత్రను కళ్లకు కట్టే వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వ్యాసాల వంటి అనేక భాగస్వామ్య ప్రోత్సాహక ఫార్మాట్లు కూడా ‘నమో యాప్’లోనూ, అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉన్నాయని, వాటిని కూడా పరిశీలించవలసిందని ప్రజలను ప్రధానమంత్రి కోరారు.
ప్రధానమంత్రి ఎక్స్‌లో ఇలా పోస్టు చేశారు:
‘‘సుపరిపాలన, మార్పు.. వీటిపై ప్రత్యేక శ్రద్ధ.’’
నూట నలభై కోట్ల మంది భారతీయుల సమష్టి ప్రాతినిధ్యం, ఆశీర్వాదాలే అండదండలుగా భారత్ వివిధ రంగాల్లో గొప్ప మార్పును చూసింది.
‘సబ్‌కా సాథ్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ సిద్ధాంతం నుంచి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రేరణను పొంది, వివిధ రంగాల్లో ఇదివరకటితో పోలిస్తే విశేష మార్పులను వేగంగా, పెద్ద ఎత్తున, స్పందనశీలత్వంతో తీసుకువచ్చింది.
ఆర్థిక వృద్ధి మొదలు సామాజిక అభ్యున్నతి వరకు, ప్రజాప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ సమ్మిళిత, సర్వతోముఖ ప్రగతిపై దృష్టి సారించింది.
భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా, వాతావరణ మార్పు, డిజిటల్ నవకల్పన వంటి అంశాల్లో తమ అభిప్రాయాలను తెలియజేసే అగ్రగామి ప్రపంచ దేశాల్లో ఒకటిగా కూడా ఉంది.
మన అందరి విజయాన్ని చూసుకొని మనం గర్విస్తున్నాం. అంతేకాదు, ఆశతోనూ, నమ్మకంతోనూ, ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించడానికి ఒక సరికొత్త సంకల్పంతోనూ ముందుకు సాగిపోతూ ఉన్నాం.
#11YearsOfSeva"
A clear focus on good governance and transformation!
— Narendra Modi (@narendramodi) June 9, 2025
Powered by the blessings and collective participation of 140 crore Indians, India has witnessed rapid transformations across diverse sectors.
Guided by the principle of ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka… pic.twitter.com/bCC4MJP3Ii
‘‘గత పదకొండు సంవత్సరాల్లో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయి. ‘జీవన సౌలభ్యం’ మెరుగైంది.
ఈ గణనీయ మార్పులతో కూడిన ప్రస్థానాన్ని ‘నమో యాప్’ మీకు వివరిస్తుంది. గేములు, క్విజ్‌లు, సర్వేలు, ఇతర ఇంటరాక్టివ్
ఫార్మేట్లతో సమాచారాన్ని ఈ యాప్ అందివ్వడమే కాకుండా, ఆ యా ఫార్మేట్లలో మీరు స్వయంగా పాలుపంచుకోవచ్చు, ప్రేరణను పొందవచ్చు.
ఓసారి చూడండి.
nm-4.com/11yearsofseva
#11YearsOfSeva"
The last eleven years have brought many positive changes and boosted ‘Ease of Living.’
— Narendra Modi (@narendramodi) June 9, 2025
The NaMo App takes you through this transformative journey in an innovative manner, through interactive games, quizzes, surveys and other such formats that inform, engage and inspire.
Do…
‘‘ఆసక్తిదాయక వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వ్యాసాలు, తదితరాల ద్వారా భారత్ వికాస యాత్రను గురించి ‘నమో యాప్’లో వివరించారు.. వాటిని తప్పక చూడండి.’’
narendramodi.in/vikasyatra2025
#11YearsOfSeva"
India’s Vikas Yatra, showcased through interesting videos, infographics, articles and more on the NaMo App... Do explore. https://t.co/VdFMHo1pNH#11YearsOfSeva
— Narendra Modi (@narendramodi) June 9, 2025
" बीते 11 वर्षों में हमारी सरकार की हर योजना के केंद्र में गरीब भाई-बहनों के साथ ही जन-जन का कल्याण सुनिश्चित करना रहा है। उज्ज्वला हो या पीएम आवास, आयुष्मान भारत हो या भारतीय जनऔषधि या फिर पीएम किसान सम्मान निधि, इन सभी योजनाओं ने देशवासियों की उम्मीदों को नए पंख दिए हैं। हमने इस दौरान पूरी निष्ठा और सेवाभाव के साथ लोगों का जीवन आसान बनाने के लिए हरसंभव प्रयास किया है।"
#11YearsOfSeva
बीते 11 वर्षों में हमारी सरकार की हर योजना के केंद्र में गरीब भाई-बहनों के साथ ही जन-जन का कल्याण सुनिश्चित करना रहा है। उज्ज्वला हो या पीएम आवास, आयुष्मान भारत हो या भारतीय जनऔषधि या फिर पीएम किसान सम्मान निधि, इन सभी योजनाओं ने देशवासियों की उम्मीदों को नए पंख दिए हैं। हमने इस… pic.twitter.com/I4NFsPYBUP
— Narendra Modi (@narendramodi) June 9, 2025


