రూ .25 కోట్ల వాటా మూలధనంతో కార్పొరేషన్ ఈ ప్రాంత అభివృద్ధికి అంకితమైన మొదటి సంస్థ అవుతుంది
పరిశ్రమ, పర్యాటకం, రవాణా మరియు స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు హస్తకళల కోసం కార్పొరేషన్ పని చేస్తుంది
లడఖ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేషన్ ప్రధాన నిర్మాణ సంస్థగా పనిచేయనుంది
లద్ఖ్ ప్రాంతం యొక్క ఉపాధి కల్పన, సమగ్ర మరియు సమగ్ర అభివృద్ధి ద్వారా ఆత్మనిర్భర్ భారత్ యొక్క లక్ష్యం సాకారం అవుతుంది

కేంద్ర పాలిత ప్రాంత‌మైన ల‌ద్దాఖ్ లో ఒక ఇంటిగ్రేటెడ్ మ‌ల్టి-ప‌ర్ప‌స్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవల‌ప్‌మెంట్ కార్పొరేశ‌న్  ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశమైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదాన్ని తెలిపింది.

కార్పొరేశ‌న్ కోసం 1,44,200 రూపాయలు –   2,18,200 రూపాయల స్థాయి పే స్కేలు తో మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప‌ద‌వి ని ఏర్పాటు చేయ‌డానికి కూడా మంత్రిమండ‌లి ఆమోదాన్ని తెలిపింది.

కార్పొరేశ‌న్ అధీకృత వాటా మూల‌ధ‌నం 25 కోట్ల రూపాయ‌లు గా, పున‌రావృత్తమయ్యే వ్య‌యం ప్ర‌తి సంవ‌త్స‌రాని కి దాదాపుగా 2.42 కోట్ల రూపాయ‌లు గా ఉంటుంది.  ఇది కొత్త గా ఏర్పాటు అవుతున్న‌టువంటి సంస్థ‌.  ప్ర‌స్తుతాని కి కొత్త‌ గా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం ల‌ద్దాఖ్ లో ఈ త‌ర‌హా సంస్థ ఏదీ లేదు.  ఈ కార్పొరేశ‌న్ వివిధ ర‌కాల అభివృద్ధి కార్య‌క‌లాపాల‌ ను చేప‌ట్ట‌నున్న కార‌ణం గా ఈ ఆమోదం ఉద్యోగ క‌ల్ప‌న కు బాట ను ప‌ర‌చ‌నుంది.  ఈ కార్పొరేశ‌న్ ప‌రిశ్ర‌మ‌, ప‌ర్య‌ట‌న‌, ర‌వాణా, రంగాల‌ లోనే కాకుండా స్థానిక ఉత్ప‌త్తులు, హ‌స్తక‌ళ వ‌స్తువుల మార్కెటింగు కు కూడాను కృషి చేయ‌నున్నది.  ఈ కార్పొరేశ‌న్ ల‌ద్దాఖ్ లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కి పాటుప‌డే ఒక ప్ర‌ధాన‌మైన నిర్మాణ ఏజెన్సీ గా సైతం ప‌ని చేస్తుంది.

ఈ కార్పొరేశ‌న్ స్థాప‌న కేంద్ర‌ పాలిత ప్రాంత‌మైన ల‌ద్దాఖ్ లో స‌మ్మిళిత‌మైన‌టువంటి, ఏకీకృత‌మైన‌టువంటి అభివృద్ధి కి దారి తీయ‌నుంది.  అదే జ‌రిగితే గ‌నుక దాని ద్వారా యావ‌త్తు ల‌ద్దాఖ్ ప్రాంతం లో జ‌నాభా సామాజిక-ఆర్థిక అభివృద్ధి కి పూచీ ల‌భించిన‌ట్లు అవుతుంది. 

అభివృద్ధి తాలూకు ప్ర‌భావం అనేక విధాలు గా ఉండ‌బోతోంది.  రానున్న కాలం లో మాన‌వ వ‌న‌రుల ఇతోధిక అభివృద్ధి కి, మాన‌వ వ‌న‌రుల ఉత్త‌మ వినియోగాని కి ఇది దోహ‌దం చేయనుంది.  ఇది వ‌స్తువులు, సేవ‌ ల దేశీయ ఉత్ప‌త్తి ని పెంచగలదు.  ఆ వస్తువులు, సేవల సర‌ఫ‌రా సాఫీ గా సాగేందుకు కూడా మార్గాన్ని సుగ‌మం చేయగలదు.  ఈ విధం గా, ఈ ఆమోదం ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ల‌క్ష్యాన్ని సాకారం చేయడం లో సాయపడనుంది.

పూర్వ‌రంగం:

i.    జ‌మ్ము– క‌శ్మీర్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం, 2019 కి అనుగుణం గా ఇదివ‌ర‌క‌టి జ‌మ్ము– క‌శ్మీర్ రాష్ట్రాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేసిన ఫలితం గా 2019 అక్టోబ‌రు 31న కేంద్ర‌పాలిత ల‌ద్దాఖ్ ప్రాంతం (చ‌ట్ట స‌భ లేకుండా) ఉనికి లోకి వ‌చ్చింది.

   ii.    ఇదివ‌ర‌క‌టి జ‌మ్ము– క‌శ్మీర్ రాష్ట్రాని కి చెందిన‌ ఆస్తుల ను, అప్పుల ను కేంద్ర‌పాలిత ప్రాంతాలైన జ‌మ్ము, క‌శ్మీర్ మ‌రియు ల‌ద్దాఖ్ ల మ‌ధ్య పంప‌కం చేసే విష‌యం లో సిఫారసు లు ఇవ్వ‌డానికి గాను జ‌మ్ము– క‌శ్మీర్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం, 2019 లోని సెక్ష‌న్ 85 ప్ర‌కారం ఒక స‌ల‌హా సంఘాన్ని నియ‌మించ‌డ‌మైంది.  ఆ క‌మిటీ ఇత‌ర అంశాల‌ తో పాటుగా అండ‌మాన్‌, నికోబార్ ఐలండ్స్  ఇంటిగ్రేటెడ్ డెవల‌ప్‌మెంట్ కార్పొరేశ‌న్ లిమిటెడ్ (ఎఎన్ఐఐడిసిఒ) త‌ర‌హా లో ఒక ఇంటిగ్రేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవల‌ప్‌మెంట్ కార్పొరేశ‌న్ లిమిటెడ్ ను ఏర్పాటు చేయాల‌ని, ల‌ద్దాఖ్ నిర్దిష్ట అవ‌స‌రాల కు అనుగుణం గా వివిధ అభివృద్ధి కార్య‌క‌లాపాల‌ ను చేప‌ట్టాల‌న్న ఒక స‌ముచిత‌మైన ఆదేశం తో కార్పొరేశ‌న్ ను స్థాపించాల‌ని సిఫారసు చేసింది. 

iii.    త‌ద‌నుగుణం గా, కేంద్ర‌ పాలిత ల‌ద్దాఖ్ ప్రాంతం అటువంటి ఒక కార్పొరేశ‌న్ ను నెల‌కొల్ప‌వ‌ల‌సింది గా ఒక ప్ర‌తిపాద‌న ను ఈ మంత్రిత్వ శాఖ కు పంపించింది.  ఈ ప్రతిపాదన నే ఆర్థిక మంత్రిత్వ శాఖ కు చెందిన క‌మిటీ ఆన్ ఎస్టాబ్లిశ్ మెంట్ ఎక్స్ పెండిచ‌ర్‌ (సిఇఇ) కూడా 2021 ఏప్రిల్ లో సిఫారసు చేసింది. 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology