స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ బియ్యం కోటాను ప్రకటించిన ప్రధానమంత్రి
బియ్యం పోర్టిఫికేషన్ మొత్తం ఖర్చు (సంవత్సరానికి సుమారు రూ. 2,700 కోట్లు) ను భరించనున్న భారత ప్రభుత్వం
పేదప్రజలు, మహిళలు, పిల్లలు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి పోషకాహారాన్ని అందించనున్న ఫోర్టిఫికేషన్
సరఫరా, పంపిణీ నిమిత్తం ఇప్పటికే ఎఫ్ సి ఐ., రాష్ట్ర ఏజెన్సీల ద్వారా 88.65 ఎల్ ఎం టి ఫోర్టిఫైడ్ బియ్యం సేకరణ

జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ ఎఫ్ ఎస్ ఎ) కింద నిర్దేశిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టి పి డి ఎస్ ),  ఇంటిగ్రేటెడ్ చైల్డ్

డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్ ), ప్రధాన మంత్రి పోషణ్ శ క్తి నిర్మాణ్ - పిఎమ్ పోషణ్ [పూర్వ మ ధ్యాహ్న భోజన ప థ కం -ఎండిఎమ్ ) ఇంకా భార త ప్ర భుత్వానికి చెందిన ఇతర సంక్షేమ ప థకాల (ఓడబ్ల్యుఎస్ ) ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర కేంద్ర పాలిత ప్రాంతాల లో 2024 నాటికి దశల వారీగా పోషక విలువలు కలిగిన (ఫోర్టిఫైడ్ )బియ్యాన్ని సరఫ రా చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన

ఈ రోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.  

 

2024 జూన్ వరకు పూర్తి అమలు కాలం లో బియ్యం ఫోర్టిఫికేషన్ కు అయ్యే మొత్తం ఖర్చు (సంవత్సరానికి సుమారు రూ. 2,700 కోట్లు) ను ఆహార సబ్సిడీలో భాగంగా భారత

ప్రభుత్వమే  భరిస్తుంది.

 

 కార్యక్రమాన్ని దిగువ పేర్కొన్న మూడు దశల లో  పూర్తిగా అమలు చేస్తారు:

 

ఫేజ్-1: 2022 మార్చి నాటికి ఐసిడిఎస్ , పిఎం పోషణ్ ను భారతదేశం అంతటా కవర్ చేస్తుంది,

 

ఫేజ్-2: 2023 మార్చి నాటికి స్టంటింగ్ (మొత్తం 291 జిల్లాలు) పై ఫేజ్-1 ప్లస్ టిపిడిఎస్ ,ఒడబ్ల్యుఎస్ తో పాటు అన్ని ఆకాంక్షాత్మక , అధిక భారం ఉన్న జిల్లాల్లో.

 

ఫేజ్-iii: 2024 మార్చి నాటికి ఫేజ్-2 పైన -ప్లస్ దేశంలోని మిగిలిన జిల్లాలను కవర్ చేస్తుంది.

 

ఉధృతంగా అమలు చేసే ప్రయత్నాల్లో భాగంగా, ఆహార , ప్రజాపంపిణీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం/కేంద్రపాలిత ప్రాంతం, లైన్ మినిస్ట్రీలు/డిపార్ట్ మెంట్, డెవలప్ మెంట్ పార్టనర్స్, ఇండస్ట్రీస్, రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లు మొదలైన అన్ని సంబంధిత భాగస్వాములతో పర్యావరణానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను సమన్వయం చేస్తోంది. ఎఫ్ సిఐ , స్టేట్ ఏజెన్సీలు ఇప్పటికే ఫోర్టిఫైడ్ బియ్యం సేకరణలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 88.65 ఎల్ ఎమ్ టి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా ,  పంపిణీ కోసం సేకరించారు.

 

75 వ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15, 2021) నాడు గౌరవ భారత ప్రధాన మంత్రి తన ప్రసంగంలో, మహిళలు, పిల్లలు, పాలిచ్చే తల్లులు మొదలైన వారిలో ఎదుగుదలకు అడ్డంకి గా ఉన్న పోషకాహార లోపాన్ని అధిగమించడానికి , దేశంలోని ప్రతి పేద వ్యక్తికి పోషకాహారాన్ని అందించడానికి బియ్యం పోర్టిఫికేషన్ పై ప్రకటన చేశారు,

 

ఇంతకు ముందు, "బియ్యం ఫోర్టిఫికేషన్ , ప్రజా పంపిణీ వ్యవస్థ కింద దాని పంపిణీ" పై కేంద్ర ప్రాయోజిత పైలట్ పథకం 2019-20 నుండి ప్రారంభమై మూడు సంవత్సరాల పాటు అమలు జరిగింది.  పదకొండు (11) రాష్ట్రాలు- ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ , జార్ఖండ్ పైలట్ పథకం కింద తాము గుర్తించిన జిల్లాల్లో (ప్రతి రాష్ట్రానికి ఒక జిల్లా) బలవర్థకమైన బియ్యాన్ని విజయవంతంగా పంపిణీ చేశాయి.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
At $4.3 Trillion, India's GDP Doubles In 10 Years, Outpaces World With 105% Rise

Media Coverage

At $4.3 Trillion, India's GDP Doubles In 10 Years, Outpaces World With 105% Rise
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మార్చి 2025
March 25, 2025

Citizens Appreciate PM Modi's Vision : Economy, Tech, and Tradition Thrive