కేంద్ర ప్రభుత్వం నుండి రూ .54,061.73 కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి రూ .31,733.17 కోట్లు ఆర్థిక వ్యయం
11.20 లక్షల పాఠశాలల్లో 11.80 కోట్ల మంది పిల్లలు చదువుతున్నారు

నమోదు కానటువంటి సిపిఎస్ఇ గా ఉన్న మెసర్స్ ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేశన్ లిమిటెడ్ (ఇసిజిసి) సెబి యొక్క (మూలధనం జారీ మరియు వెల్లడి ఆవశ్యకతలు సంబంధి) నిబంధన లు, 2018 పరిధి లో ఇనీశియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) మాధ్యమం ద్వారా స్టాక్ ఎక్చేంజ్ లో నమోదు చేయడానికి గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది.

ఎగుమతుల కు క్రెడిట్ రిస్క్ ఇన్ శువరన్స్ మరియు సంబంధి సేవల ను అందించి ఎగుమతుల యొక్క పోటీతత్వాన్ని మెరుగు పరచాలి అనే ఉద్దేశ్యం తో ఏర్పాటు చేసిన ఇసిజిసి లిమిటెడ్ భారత ప్రభుత్వ సంపూర్ణ యాజమాన్యం లో ఉన్నటువంటి ఒక సిపిఎస్ఇ . ఈ కంపెనీ తన మేక్సిమమ్ లయబిలిటీస్ (ఎమ్ఎల్) ను ఇప్పుడున్న 1.0 లక్ష కోట్ల రూపాయల స్థాయి నుంచి పెంచుకొని, 2025-26 కల్లా 2.03 లక్షల కోట్ల రూపాయలు గా చేసుకోవాలని లక్ష్యం గా పెట్టుకొన్నది.

ఇసిజిసి లిమిటెడ్ (స్టాక్ ఎక్చేంజ్ లో) నమోదు కావడం వల్ల, కంపెనీ తాలూకు వాస్తవిక విలువ వెలుగు లోకి వస్తుంది. అంతేకాకుండా, కంపెనీ యొక్క ఎక్విటి హోల్డింగ్ లో సార్వజనిక భాగస్వామ్యానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం వల్ల ‘మంది కి యజమానత్వా’న్ని కట్టబెట్టేందుకు కూడా ఊతం లభిస్తుంది. అలాగే పారదర్శకత్వం, జవాబుదారుతనం మరింత గా పెరగడం వల్ల కార్పరిట్ గవర్నన్స్ ను సైతం ప్రోత్సహించినట్లు అవుతుంది.

లిస్టింగ్ ప్రక్రియ తో ఇసిజిసి కి మార్కెటు నుంచి, లేదా అదే ఐపిఒ మాధ్యమం ద్వారా, లేదా అటు తరువాత ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్ పిఒ) మాధ్యమం ద్వారా తాజా గా మూలధనాన్ని పోగేసుకోవడానికి మార్గం సుగమం అయ్యే ఆస్కారం ఉంది. తత్ఫలితం గా మేక్సిమమ్ లయబిలిటీ ని పెంచుకోవడం లో కూడాను కంపెనీ కి తోడ్పాటు అందగలదు.

డిసిన్వెస్ట్ మెంట్ వల్ల ప్రాప్తించే రాశి ని సామాజిక రంగం లోని పథకాల కు ఆర్థిక సహాయం చేయడం కోసం వినియోగించడం జరుగుతుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Scan, withdraw, done: EPFO 3.0 plans instant PF access via ATMs and UPI

Media Coverage

Scan, withdraw, done: EPFO 3.0 plans instant PF access via ATMs and UPI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 మే 2026
May 28, 2026

A Stronger, Greener, Prouder India: 12 Years of PM Modi’s Bold Reforms Driving Growth, Innovation & Inclusive Progress