ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం  రూ.69,515.71 కోట్ల వ్యయంతో ( 2021-22 నుంచి 2025-26 వరకూ) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని 2025-26 వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం 2025-26 వరకు దేశవ్యాప్తంగా రైతులకు అనివార్య ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను రక్షించడానికి సహాయపడుతుంది.

దీనికితోడు పారదర్శకత, క్లెయిమ్ లెక్కింపు, సెటిల్ మెంట్ సామర్ధ్యం పెంచేందుకు వీలుగా ఈ పథకం అమలులో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.824.77 కోట్లతో ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (ఫియట్ ) ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ పథకం కింద సాంకేతిక కార్యక్రమాలైన యస్-టెక్, విండ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. టెక్నాలజీ ఆధారిత దిగుబడి అంచనా వ్యవస్థ (ఎస్- టెక్) ద్వారా దిగుబడి అంచనాకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అందులో టెక్నాలజీ ఆధారిత దిగుబడి అంచనాలకు కనీసం 30% ప్రాధాన్యత ఇస్తారు. తొమ్మిది  ప్రధాన రాష్ట్రాలు - ఏపీ, అస్సాం, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు,  కర్ణాటక దీనిని ప్రస్తుతం అమలు చేస్తుండగా, ఇతర రాష్ట్రాలను కూడా త్వరితగతిన దీని పరిధిలోకి తెస్తున్నారు. ఎస్-టెక్ ను విస్తృతంగా అమలు చేయడంతో, పంట కోత ప్రయోగాలు, సంబంధిత సమస్యలు క్రమంగా తొలగిపోతున్నాయి. 2023-24 సంవత్సరానికి ఎస్-టెక్ క్లెయిమ్ లెక్కింపు,  సెటిల్మెంట్ పూర్తయింది. మధ్యప్రదేశ్ 100% సాంకేతిక ఆధారిత దిగుబడి అంచనాను అమలు చేసింది. 

వెదర్ ఇన్ఫర్మేషన్ అండ్ నెట్వర్క్ డేటా సిస్టమ్స్ (విండ్స్) బ్లాక్ స్థాయిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్), పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్జీ) లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విండ్స్ కింద, హైపర్ లోకల్ వాతావరణ డేటాను అభివృద్ధి చేయడానికి ప్రస్తుత నెట్‌వర్క్ సాంద్రతను 5 రెట్లు పెంచడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం కింద, డేటా అద్దె ఖర్చులను మాత్రమే కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. తొమ్మిది ప్రధాన రాష్ట్రాలలో  కేరళ, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ పుదుచ్చేరి, అస్సాం, ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్ , రాజస్థాన్లలో విండ్స్ ను అమలుచేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి.

టెండరింగ్ కు ముందు అవసరమైన వివిధ నేపథ్య సన్నాహక, ప్రణాళిక పనుల కారణంగా 2023-24 (ఇఎఫ్ సి ప్రకారం మొదటి సంవత్సరం) లో రాష్ట్రాలు విండ్స్ ను అమలు చేయలేకపోయాయి. దీని ప్రకారం 90:10 నిష్పత్తిలో అధిక కేంద్ర నిధుల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోజనం చేకూర్చడానికి 2023-24తో గాక 2024-25ను మొదటి సంవత్సరంగా కేంద్ర మంత్రివర్గం  ఆమోదించింది.

ఈశాన్య రాష్ట్రాల రైతులందరినీ ప్రాధాన్య క్రమంలో ప్రోత్సహించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రీమియం సబ్సిడీలో 90 శాతం ఈశాన్య రాష్ట్రాలతో కేంద్రం పంచుకుంటుంది. అయితే ఈ పథకం స్వచ్చందం కావడం, ఈశాన్య రాష్ట్రాలు తక్కువ పంటలు పండే ప్రాంతం కావడంతో నిధులను వెనక్కు తీసుకోకుండా నిధుల అవసరం ఉన్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల్లో  వాడేందుకు (రీలోకేషన్) వెసులుబాటు కల్పించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's banking sector resilient; 11-13% credit growth for January-June likely: Survey

Media Coverage

India's banking sector resilient; 11-13% credit growth for January-June likely: Survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 ఏప్రిల్ 2026
April 20, 2026

Honouring Saints, Powering Futures: PM Modi’s Leadership That Blends Heritage, Highways and High Growth