దేశ విభజన సమయంలోని బాధితులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భయానక విభజన సంస్మరణ దినం సందర్భంగా 'ఎక్స్'లో చేసిన పోస్టులో, విభజన కారణంగా అనేక మంది ప్రజలపై పడిన ప్రభావం, వారి ఇబ్బందులను ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆటుపోట్లకు తట్టుకునే మానవుల స్వభావాన్ని ఆయన కొనియాడుతూ, దేశంలో ఐక్యత, సోదరభావ బంధాలను రక్షించడంలో తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి 'ఎక్స్'మాధ్యమంలో పోస్ట్ చేస్తూ:
''విభజనతో ఏర్పడిన భయానక ఘటనల వల్ల ప్రభావితమైన, తీవ్రంగా ఇబ్బంది పడ్డ అసంఖ్యాక మంది ప్రజలను #PartitionHorrorsRemembranceDay నాడు స్మరించుకుంటున్నాం. ఆటుపోట్లకు తట్టుకొనే మానవుల శక్తిని ప్రదర్శించిన వారి ధైర్యానికి ఇది నివాళులు అర్పించాల్సిన రోజు. విభజన వల్ల ప్రభావితమైన వారిలో చాలా మంది వారి జీవితాలను పునర్మించుకొని అపారమైన విజయాన్ని సాధించారు. మన దేశ ఐకమత్యం, సోదరభావ బంధాలను ఎల్లప్పుడూ రక్షించడం పట్ల మన నిబద్ధతను సైతం ఇవాళ పునరుద్ఘాటిస్తున్నాం.''
On #PartitionHorrorsRemembranceDay, we recall the countless people who were impacted and greatly suffered due to the horrors of Partition. It is also a day to pay tributes to their courage, which illustrates the power of human resilience. A lot of those impacted by Partition went…
— Narendra Modi (@narendramodi) August 14, 2024