Quoteపారాలింపిక్స్ లో త్రివర్ణ పతాకం ఎగురవేసేలా దివ్యాంగుల సామర్థ్యం పెంచేందుకు మేం కృషి చేస్తున్నాం; ఇందుకోసం క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

  భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోట బురుజుల నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా-  వచ్చేనెల విశ్వకర్మ జయంతి నాడు 'విశ్వకర్మ యోజన'కు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. ఈ పథకం సంప్రదాయ వృత్తి నైపుణ్యం గల వారి కోసం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. హస్త కౌశలంతోపాటు పరికరాలను ఉపయోగించి పనిచేసే ఓబీసీ వర్గాలవారు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు. వీరిలో వడ్రంగులు, స్వర్ణకారులు,  రాతి పరికరాలు తయారు చేసేవారు, రజకులు, క్షురకులు తదితరులు ఉన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు తమ కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో చేయూత ఇవ్వగలరు. ఈ పథకం 13 నుంచి 15 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు.

 

   అలాగే దివ్యాంగుల కోసం సౌలభ్య భారతం దిశగా కృషి చేస్తున్నామని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా పారాలింపిక్స్ లో త్రివర్ణ పతాకం ఎగురవేసేలా దివ్యాంగుల సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ  దిశగా క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

   భారతదేశం నేడు జన సంపద ప్రజాస్వామ్యం వైవిధ్యంతో వర్ధిల్లుతున్నదని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతదేశం నిర్దేశించుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించగల సామర్థ్యం ఈ త్రివిధ శక్తులకు ఉన్నదని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Over 1.22cr farmers received skill training imparted by central govt in 3 years: Union minister Ramnath Thakur

Media Coverage

Over 1.22cr farmers received skill training imparted by central govt in 3 years: Union minister Ramnath Thakur
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Haryana Chief Minister meets Prime Minister
August 06, 2025

The Chief Minister of Haryana, Shri Nayab Singh Saini met the Prime Minister, Shri Narendra Modi today.

The Prime Minister’s Office handle posted on X:

“CM of Haryana, Shri @NayabSainiBJP met Prime Minister @narendramodi.

@cmohry”