భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. గౌరవ లిచ్టెన్‌స్టెయిన్ యువరాజు అలోయిస్ భారత్‌లో పర్యటించి, న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో పాల్గొన్నారు.

 

సదస్సు సందర్భంగా గౌరవ యువరాజు అలోయిస్‌తో 2026 ఫిబ్రవరి 20న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్, లిచ్టెన్‌స్టెయిన్ మధ్య సుహృద్భావ, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలున్నాయని ఇరువురు నేతలూ స్పష్టం చేశారు.

2025 అక్టోబరులో భారత్ - టీఈపీఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలును వారిద్దరూ స్వాగతించారు. ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు కొత్త ఉత్తేజాన్నిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 15 ఏళ్లలో ఈ ఒప్పందం ద్వారా భారత్‌లోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అత్యున్నత విలువ కలిగిన ఉత్పాదకత, అత్యాధునిక సాంకేతికతలు, ఆవిష్కరణల ఆధారిత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు.

 

భారత్ - లిచ్టెన్‌స్టెయిన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక కీలక ముందడుగు. రెండు దేశాలకూ ప్రయోజనకరమైన సహకారాన్ని విస్తరించుకునే దిశగా ఉమ్మడి నిబద్ధత ఈ సమావేశం ద్వారా స్పష్టమవుతోంది.

  

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India emerges as global green fuel supplier with landmark ammonia and methanol export deals with Japan

Media Coverage

India emerges as global green fuel supplier with landmark ammonia and methanol export deals with Japan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
July 05, 2026

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, July 26th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.