భారతదేశంలో ప్రజాస్వామ్యం ఓ రాజ్యాంగ స్రవంతి సమాహారం మాత్రమే కాదు.. అది మన జీవన స్రవంతి: ప్రధానమంత్రి;
దేశ ప్రజాస్వామ్యం.. ప్రజా ప్రతినిధులకు ‘సంసద్ టీవీ’ కొత్త గళం కాగలదు: ప్రధానమంత్రి;
సారాంశం.. అర్థవంతమైనదై పార్లమెంటరీ వ్యవస్థకు సమానంగా వర్తిస్తుంది: ప్రధానమంత్రి

   అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ఉప రాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌స‌భ‌ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా ‘‘సంసద్ టీవీ’’ని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- పార్లమెంటుతో ముడిపడిన టీవీ చానెల్ వేగంగా మారుతున్న కాలానికి... ముఖ్యంగా 21వ శతాబ్దంలో చర్చలు-సంభాషణల ద్వారా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు  తగినట్లు రూపాంతరం చెందడాన్ని ప్రశంసించారు. ‘సంసద్ టీవీ’ ప్రారంభాన్ని భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయంగా ప్రధాని అభివర్ణించారు. సంసద్ టీవీ రూపంలో దేశవ్యాప్త చర్చలకు, సమాచార వ్యాప్తికి సంసద్ టీవీ ఒక మాధ్యమం కాగలదని, తద్వారా దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధులకు ఇది కొత్త గళంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘దూరదర్శన్’ 62 ఏళ్లు పూర్తిచేసుకోవడంపైనా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. మరోవైపు ఇవాళ ‘ఇంజనీర్ల దినోత్సవం’ కావడంతో దేశంలోని ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

   ఇవాళ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం కూడా కావడాన్ని గుర్తుచేస్తూ- భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లివంటిది కాబట్టి ఈ విషయంలో మరింత బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. భారతదేశానికి ప్రజాస్వామ్యం ఒక వ్యవస్థ కాదని, అదొక సిద్ధాంతమని చెప్పారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం ఒక రాజ్యాంగ సౌధం కాదని, అదొక స్ఫూర్తి అని వివరించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఓ రాజ్యాంగ స్రవంతి సమాహారం మాత్రమే కాదని, అది మన జీవన స్రవంతి అని ఆయన తెలిపారు. భారత 75 ఏళ్ల స్వాతంత్ర్యం నేపథ్యంలో గత వైభవాన్ని, ఆశావహ భవిష్యత్తును మన కళ్లముందు ఉంచడంలో మాధ్యమాలకుగల పాత్రను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘స్వచ్ఛభారత్ అభియాన్’ వంటి అంశాలను మాధ్యమాలు ముందుకు తీసుకెళితే, అవి అమిత వేగంలో ప్రజల్లోకి చేరుతాయని ఆయన చెప్పారు. తదనుగుణంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేళ భారత స్వాతంత్ర్య పోరాటంపై 75 భాగాల కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల కృషిని వివరించడంలో మాధ్యమాలు తమవంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అనుబంధ సంచికలను కూడా ప్రచురించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

   సారాంశ కేంద్రకపాత్ర గురించి ప్రస్తావిస్తూ- మాధ్యమ ప్రసారాల్లో అగ్రాసనం సారాంశానిదే అయినప్పటికీ, తన అనుభవాల దృష్ట్యా ‘సారాంశం అర్థవంతమైనది’గా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. ఎవరినుంచి మెరుగైన సారాంశం లభ్యమవుతుందో ప్రజానీకం స్వయంచలితంగా వారివైపు మరలుతారని ఆయన వివరించారు. ఈ విషయం మాధ్యమాలకు ఎంతగా వర్తిస్తుందో మన పార్లమెంటరీ వ్యవస్థకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంటులో రాజకీయాలు మాత్రమేగాక విధానం కూడా భాగంగా ఉంటుందని చెప్పారు. ఆ మేరకు పార్లమెంటు కార్యకలాపాలతో సాధారణ ప్రజానీకం కూడా మమేకం కావాలని పేర్కొన్నారు. తదనుగుణంగా కొత్త చానెల్ కృషి చేయాలని ఆయన కోరారు.

   పార్లమెంటు సమావేశమైనపుడు విభిన్న అంశాలపై చర్చలు సాగుతుంటాయని, వాటిద్వారా యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. అలాగే పార్లమెంటు సభ్యులు కూడా మెరుగైన రీతిలో వ్యవహరించడానికి తగిన స్ఫూర్తి లభిస్తుందని, దేశమంతా వారిని చూస్తుండగా సభలో చర్చ మెరుగ్గా సాగే వీలుంటుందని పేర్కొన్నారు. అదే తరహాలో పౌరులు కూడా తమ బాధ్యతలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ దిశగా అవగాహన కల్పనలో మాధ్యమం ఎంతో ప్రభావశీలమైనదని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్య సంస్థలు, వాటి పనితీరు, పౌర బాధ్యతలు తదితరాల గురించి మన యువత ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా సభా కమిటీలు, సభా కార్యకలాపాల ప్రాముఖ్యం, చట్టసభల పనితీరు గురించి ఎంతో సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. భారత ప్రజాస్వామ్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడంలో ఈ సమాచారం ఎంతగానో తోడ్పడగలదని ప్రధాని చెప్పారు. దేశ ప్రజాస్వామ్యానికి మూలాలైన పంచాయతీల పనితీరు గురించి కూడా ‘సంసద్ టీవీ’ కార్యక్రమాలు రూపొందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కొత్త ఉత్తేజంతో భారత ప్రజాస్వామ్యానికి సరికొత్త శక్తి సమకూరుతుందని పేర్కొన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic

Media Coverage

Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Gujarat meets Prime Minister
December 19, 2025

The Chief Minister of Gujarat, Shri Bhupendra Patel met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister’s Office posted on X;

“Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.

@CMOGuj”