బెంగళూరు వాతావరణం, ఇక్కడి పర్యావరణం ప్రత్యేకమైనవి, సాఫ్ట్‌వేర్-సేవల విషయంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ నగరం.. భారతీయ సాంస్కృతిక గుర్తింపును, ఆధ్యాత్మికతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నూతన శిఖరాలకు చేర్చింది: పీఎం
మన సమాజంలో ఇమిడి ఉన్న సహజ గుణమే సేవా పరమో ధర్మ (సేవ చేయడమే అత్యున్నతమైన ధర్మం): పీఎం
ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రజల జీవితాల్లో సహజ భాగంగా మారింది... ఇప్పుడు సామాజిక శక్తితో మరింత ముందుకు సాగుతోంది: పీఎం
మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత, సమాజం పట్ల స్పందించే గుణం ఉన్న యువతతోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది: పీఎం

గౌరవనీయులైన శ్రీ శ్రీ రవి శంకర్, ఇక్కడకు విచ్చేసిన సాధువులందరికీ, సోదరీ సోదరులారా, అందరికీ నమస్కారం.

ఈ ఉదయం నాకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించింది. వేద మంత్రోచ్చారణతో చిన్నారులు పలికిన స్వాగతం, శ్రీ గణేశుని దర్శనం, శ్రీ శ్రీ రవి శంకర్ 70వ జన్మదినోత్సవం, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ 45వ వార్షికోత్సవం.. ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ అద్భుతమైన ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇప్పుడే గురుదేవ్ అనేక విషయాలు చెప్పారు. ఆయన నన్ను పొగుడుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ నేను మాత్రం ఆయన నాకు పని అప్పగించారని భావిస్తున్నాను. మీరు చెప్పింది నిజమే. నేను మీకు కృతజ్ఞతలు చెప్పలేను. ఎందుకంటే నేను మీలో ఒకరిని. మీ మధ్యకు, మీ కోసమే వచ్చాను. నేను ఏ స్థాయిలోఉన్నా అది మీ వల్లే. ఈ రోజు గురుదేవ్ 70 ఏళ్ల జన్మదినోత్సవం. మీ కుటుంబంలో నేనూ ఒక భాగం కాబట్టి... మీ శత జన్మదిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు మళ్లీ వస్తానని బహిరంగంగా చెబుతున్నాను.

పవిత్రమైన, గొప్పదైన ధ్యాన మందిరం ఈ రోజు ప్రారంభమైంది. స్పష్టమైన సంకల్పం ఉండి, సేవా స్ఫూర్తితో పని చేసినప్పుడు.. ప్రతి ప్రయత్నం మంచి ఫలితాలను అందిస్తుంది. ఏది జరిగినా, జరగకపోయినా.. మనమందరమూ పద్మం నీడలోనే ఉన్నాం. మీకు అర్థమవుతుంటే.. చప్పట్లు కొడుతూ ఉండండి. గురుదేవుని ఆశీర్వాదంతో ఈ పద్మం రక్షణ దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళుతుంది. ఈ ధ్యాన మందిరం ప్రారంభం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

బెంగళూరు వాతావరణం ఎప్పుడూ ప్రత్యేకమే. సాఫ్ట్‌వేర్, సేవల రంగంలో ఈ నగరం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అలాగే, భారతీయ సాంస్కృతిక గుర్తింపును, ఆధ్యాత్మికతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నూతన శిఖరాలకు చేర్చింది. భారతీయ సంప్రదాయంలో యోగా, ధ్యానం, ప్రాణాయామం అంతర్భాగంగా ఉన్నాయి. గురుదేవ్ చెప్పినట్లుగా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాల కారణంగా ప్రభావితమవుతున్నారు. భారత దేశంలోని అనేక సంస్థలు కూడా ఈ ప్రాచీన సంప్రదాయాల నుంచి స్ఫూర్తి పొందుతున్నాయి.

మిత్రులారా,

ఈ స్ఫూర్తితోనే శ్రీ శ్రీ రవి శంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే విత్తనాన్ని నాటారు. ఇప్పుడది ఓ పెద్ద వట వృక్షంలాగా ఎదిగింది. ఈ వృక్షం కొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మందిని స్పృశిస్తున్నాయి. ప్రభుత్వం పని మీద నేను విదేశాలకు వెళ్లినప్పుడు మీతో సంబంధమున్న ఎవరో ఒకరిని నేను కలుసుకుంటూనే ఉంటాను.

మిత్రులారా,

పూర్తి వైవిధ్యంతో నిండిన దేశం భారత్. అనేక భాషలు, అనేక సంప్రదాయాలు, భిన్నమైన ఆచారవ్యవహారాలు, విభిన్నమైన పూజా విధానాలు - వీటన్నింటినీ చూసినప్పుడు ఇలాంటి అందమైన వైవిధ్యాలను కలిపి ఉంచుతున్న ప్రాథమిక అంశం ఏమిటి? అనే ప్రశ్న మన మనసులో సహజంగానే తలెత్తుతుంది. మన కోసం మనం కాకుండా ఇతరుల కోసం జీవించడమే దీనికి సమాధానం. ‘అష్టాదశ పురాణేశు, వ్యాసస్య వచనాద్వయం. పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనం’... అంటే ఇతరులకు సేవ చేయడం పుణ్యం, బాధ కలిగించడం పాపం. సేవే అత్యున్నత ధర్మం. ఇదే మన సమాజంలో ఇమిడి ఉన్న సహజ గుణం. తరతరాలుగా సాగుతున్న ఈ విలువల ప్రవాహం మనల్ని తీర్చిదిద్దింది. మనకు స్ఫూర్తినిచ్చింది. ఉత్సాహపరిచింది. భారత్‌లోని అనేక ఆధ్యాత్మిక ఉద్యమాలు అంతిమంగా మానవాళికి సేవ చేయడం ద్వారానే వ్యక్తమయ్యాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న ప్రతి పనిలోనూ ఈ స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది. ఇప్పుడే ప్రదర్శించిన వీడియోలో మొత్తం సేవ గురించే ఉంది. ప్రజా సంక్షేమమే ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రయాణంలో భాగమైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

సామాజిక శక్తి తోడైనప్పుడే ఏ కార్యక్రమమైనా విజయం సాధిస్తుంది. కాబట్టి, ప్రతి ముఖ్యమైన లక్ష్య సాధనలోనూ సమాజ శక్తిని మేల్కొల్పడం చాలా అవసరం. రాజకీయాలు, ప్రభుత్వాల కంటే సమాజమే అత్యంత శక్తిమంతమైనదని నేను విశ్వసిస్తాను. దేశ నిర్మాణంలో తనంత తానుగా సమాజం చురుగ్గా పాల్గొన్నప్పుడే ఏ ప్రభుత్వమైనా విజయం సాధిస్తుంది. ఉదాహరణకు స్వచ్ఛ భారత్ అభియాన్‌ను తీసుకోండి. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా.. ప్రజల జీవితాల్లో ఓ భాగంగా మారిపోయింది. ఇప్పుడది సమాజ శక్తితోనే ముందుకు వెళుతోంది.

మిత్రులారా,

సమాజం చురుగ్గా మారినప్పుడు, దేశం ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లకు ఉమ్మడి పరిష్కారాలు లభిస్తాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ సామాజిక శక్తిని తనతో పాటు తీసుకెళ్లడం మంచి విషయం. అభివృద్ధి సంబంధిత కార్యక్రమాల్లో సామాజిక దృక్పథానికి మీరు చాలా ప్రాధాన్యమిచ్చారు. అది మొక్కలు నాటే కార్యక్రమం, గ్రామీణ స్మార్ట్ విలేజ్ సెంటర్లు, మహిళలు, గిరిజన సమాజాలకు సాధికారత కల్పించే కార్యక్రమాలైనా లేదా ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమమైనా ఈ ప్రయత్నాలన్నీ దేశ, సమాజాభివృద్ధికి గణనీయంగా దోహదపడతాయి.

మిత్రులారా,

ఇక్కడకు హాజరైన వారందరినీ ఓ విషయంలో నేను అభినందించాలి. అదే యువశక్తిపై దృష్టి సారించడం, ప్రస్తుత ప్రపంచం అత్యంత వేగంగా భారీ మార్పులకు లోనవుతోంది. ప్రతిరోజూ నూతన అవకాశాలకు కొత్త దారులను సైన్స్ అందిస్తోంది. నూతన ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థలనే మార్చేస్తున్నాయి. భారత్ ఈ మార్పుల్లో భాగస్వామిగా మాత్రమే కాకుండా.. అనేక రంగాల్లో ముందంజలో ఉంది. మన డిజిటల్ విప్లవం.. డిజిటల్ చెల్లింపులో భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపింది. మౌలిక వసతులు సైతం భవిష్యత్తు దృక్పథంతో మునుపెన్నడూ లేని వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ వేగంగా ఎదిగింది. మన యువత అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తున్నారు. ఈ విజయాలన్నింటికీ కారణం మన దేశ యువత, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రస్తుత ఆధునిక యుగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను వెతకడంలో యువతకు గురుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందిస్తున్న సహకారం గొప్పది.

మిత్రులారా,

వేర్వేరు చోట్ల ఉన్న వ్యక్తులు టెక్నాలజీ సహాయంతో క్షణాల్లో ఒకరితో ఒకరు అనుసంధానమవుతున్నారు. ఈ ప్రపంచంతో మనం అనుసంధానమయినా కాకపోయినా.. మనతో మనం సంధానమవడం అవసరం. విత్తనం నాటడమైనా, దాన్ని పోషించడమైనా లేదా దానికి శక్తినివ్వడమైనా అది మనతో మనం అనుసంధానమవడం అనే గొప్ప సంప్రదాయం ద్వారానే సాధ్యమవుతుంది. మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత, సమాజం పట్ల స్పందించే గుణమున్న యువతతోనే అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక సంక్షేమం, మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానంపై మీరు చేపడుతున్న కార్యకలాపాలు, వీటిపై కృషి చేస్తున్న ఇతర సంస్థలు అత్యంత ముఖ్యమైనవి. ఇవి ప్రజల మధ్య అనుసంధానం, ఐక్యతా భావం, ఉమ్మడి బాధ్యతను పెంపొదిస్తున్నాయి. అదే సమయంలో ప్రజలకు తమ సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని అందిస్తున్నాయి. అనేక తరాల పాటు వేల మంది ప్రజలకు శాంతిని, స్వస్థతను అందించే కేంద్రంగాఈ రోజు ప్రారంభమైన ధ్యాన మందిరం మారుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

దేశం పట్ల, సమాజం పట్ల మీ బాధ్యతలను మీరు నెరవేరుస్తున్నారు. కానీ నేనెప్పుడు మీ మధ్యకు వచ్చినా కొన్ని అభ్యర్థనలు చేయకుండా ఉండలేను. నేను మాట్లాడక ముందే మీ తొమ్మిది వినతులకు అంగీకరించామని గురుదేవ్ చెప్పారు. కాబట్టి నాకు చెప్పడానికి ఏమీ లేదు. కానీ అలవాట్లు ఓ పట్టాన పోవు కదా. భారత్ సంపూర్ణాభివృద్ధి కోసం అనేక స్థాయుల్లో సమష్టి ప్రయత్నాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు కీలకమైన పాత్రను పోషించడమే కాకుండా.. ఈ పరివర్తనకు దృఢమైన సంరక్షునిగా మారగలవు. మీలో అనేక మంది రైతులు, గ్రామీణ సమాజాలతో కలసి పనిచేస్తారు. ఇక్కడ ప్రదర్శించిన చిత్రంలో మాదిరిగానే.. సహజ వ్యవసాయంతో రైతులను అనుసంధానించడానికి అనేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. అనారోగ్యంలో ఉన్నప్పటికీ ప్రజలు సహజ చికిత్స కోసం నేడు చూస్తున్నారు. మన భూమాతకు కూడా సహజ చికిత్స అవసరం ఏర్పడింది. రసాయన ఎరువులు మన పొలాలను, మన భూమాతను నాశనం చేశాయి. రసాయనాల నుంచి భూమాతను రక్షించడం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగే. పర్యావరణాన్ని, ఆర్థిక వ్యవస్థను వేరు చేసి చూడలేం. నీటిని సమర్థంగా ఎలా వినియోగించుకోవాలో ‘పెర్ క్రాప్ మోర్ డ్రాప్’ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మీ సహకారంతో మరిన్ని మంచి ఫలితాలను సాధించవచ్చు. ఎందుకంటే ప్రతి నీటి బొట్టునూ ఆదా చేయడం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగే. మరికొన్ని వారాల్లో వర్షాకాలం రాబోతుంది. కాబట్టి నీటి సంరక్షణ గురించి విస్తృతంగా ప్రచారం చేయడానికి ఇదే సరైన సమయం. అదే విధంగా విద్యుత్తును ఆదా చేయడం, ఒకసారి వాడే పారేసే ప్లాస్టిక్‌‌ను నివారించడం, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ఇవన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ లివింగే. ప్రస్తుతం మిషన్ లైఫ్‌కు దేశం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. మరింత బాధ్యతగా, అవగాహనతో జీవించాలని చెప్పే ఉద్యమమిది. ప్రకృతితో సమతుల్యంగా ఉండే జీవన విధానాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చే ఉద్యమం ఇది. మిషన్ లైఫ్ కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపమే. మీరు ఎప్పటిలాగే భవిష్యత్తులో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు సంబంధించిన అనేక అంశాలను విస్తరించి, అభివృద్ధి చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. సమాజంలోని విస్తృత వర్గాలతో మమేకమవ్వడానికి మీరు అధిక ప్రాధాన్యమిస్తారు. గురుదేవ్ శత జన్మదినం జరుపుకొనే సమయానికి ఈ లక్ష్యాలను మనం పూర్తి చేయాలి. మరోసారి, శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సేవా స్ఫూర్తి, అంకితభావంతో పనిచేసే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కుటుంబానికి చెందిన ప్రతి స్వచ్ఛంద సేవకున్నీ అభినందిస్తున్నాను. మరోసారి, మీ అందరి మధ్యకు వచ్చే, ఈ పవిత్ర వాతావరణంలో కొన్ని క్షణాలు గడిపే, పద్మం నీడలో ఆలోచించే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు. దీనికోసం మీ అందరికీ హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గురుదేవ్.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt

Media Coverage

EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi receives a telephone call from the US Vice President
August 08, 2026
PM and Vice President Vance review progress in the India-U.S. Strategic Partnership.
PM and Vice President Vance exchange views on regional and global developments.
PM warmly congratulates Vice President Vance and Ms. Usha Vance on the birth of their son.

Prime Minister Shri Narendra Modi received a telephone call today from the Vice President of the United States, Mr. J.D. Vance.

Prime Minister and Vice President Vance reviewed progress in the India-U.S. Comprehensive Global Strategic Partnership. They noted the sustained momentum in the high-level engagements and reaffirmed their commitment to further strengthening cooperation in trade, defence, critical and emerging technologies, energy security and critical minerals.

They also exchanged views on regional and global developments of mutual interest.

Prime Minister warmly congratulated Vice President Vance and Ms. Usha Vance on the birth of their son and conveyed best wishes to the family.