షేర్ చేయండి
 
Comments

మిత్రులారా నమస్కారం,

బడ్జెటు సమావేశాలు ఈ రోజు న ఆరంభం అవుతున్నాయి. మీ అందరి కి మరియు దేశ వ్యాప్తంగా ఉన్న గౌరవనీయ పార్లమెంట్ సభ్యుల కు నేను ఈ బడ్జెటు సమావేశాల కు స్వాగతం పలుకుతున్నాను. ఈ నాడు ప్రపంచం ఉన్నటువంటి స్థితి లో భారతదేశాని కి అనేక అవకాశాలు లభ్యం అవుతున్నాయి. ఈ బడ్జెటు సమావేశాలు ప్రపంచం లో కేవలం భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి, భారతదేశం లో సాగుతున్న టీకాకరణ ఉద్యమం, భారతదేశం తాను స్వయం గా కనుగొన్న టీకామందు యావత్తు ప్రపంచం లో విశ్వాసాన్ని రేకెత్తిస్తున్నది.

ఈ బడ్జెటు సమావేశాల లో సైతం మన ఎమ్ పి ల చర్చోపచర్చలు, మన ఎమ్ పి ల చర్చనీయ అంశాలు, దాపరికం లేనటువంటి మనస్సు తో జరిపిన చర్చలు ప్రపంచవ్యాప్తం గా ప్రభావాన్ని ప్రసరించేటటువంటి ఒక ముఖ్యమైన అవకాశం కాగలవు.

గౌరవనీయ పార్లమెంటు సభ్యులందరు, అన్ని రాజకీయ పక్షాలు అరమరికల కు తావు ఉండనటువంటి మనస్సు తో ఉత్తమమైన చర్చ ను జరిపి దేశాన్ని అభివృద్ధి పథం లోకి తీసుకు పోవడం లో , ఆ ప్రగతి కి వేగాన్ని జతపరచడం లో అవసరమైన తోడ్పాటు ను అందిస్తాయని నేను ఆశపడుతున్నాను.

ఎన్నికలు తరచు గా జరుగుతున్న కారణం గా సమావేశాలు ప్రభావితం అవుతాయి అనే మాట నిజమే. కానీ, నేను గౌరవనీయ ఎమ్ పిలు అందరి ని అభ్యర్థించేదేమిటి అంటే, అది ఎన్నికలు వాటి మానాన అవి జరుగుతూ ఉంటాయి, ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. కానీ, మనం సభ లో.. ఈ బడ్జెటు సమావేశాలు ఒక విధం గా పూర్తి సంవత్సర కాలాని కి గాను ప్రణాళికల ను సిద్ధం చేస్తాయి. మరి ఈ కారణం గా ఇవి ఎంతో ముఖ్యమైనవన్నమాట. మనం పూర్తి నిబద్ధత తో ఈ బడ్జెటు సమావేశాల ను ఎంత గా ఫలప్రదం చేస్తామో, రాబోయే సంవత్సరం సరికొత్త ఆర్థిక శిఖరాల కు చేర్చడానికి కూడా అంత గొప్ప అవకాశం కాగలుగుతుంది.

దాపరికం లేని చర్చ జరుగు గాక, మానవీయ చర్చ చోటు చేసుకొను గాక, మానవీయ సంవేదనలతో నిండిన చర్చ జరుగుగాక. మంచి ఉద్దేశ్యం తో చర్చ సాగు గాక. ఈ అపేక్ష తో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.

 

 

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
PM Modi gifts Buddha artwork associated with Karnataka to his Japanese counterpart

Media Coverage

PM Modi gifts Buddha artwork associated with Karnataka to his Japanese counterpart
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 మార్చి 2023
March 20, 2023
షేర్ చేయండి
 
Comments

The Modi Government’s Push to Transform India into a Global Textile Giant with PM MITRA

Appreciation For Good Governance and Exponential Growth Across Diverse Sectors with PM Modi’s Leadership