ఇజ్ రాయల్ ప్రధాని శ్రీ నఫ్తాలీ బెనెట్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
శ్రీ బెనెట్ కోవిడ్-19 సంక్రమణ అనంతరం త్వరగా కోలుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఇజ్ రాయల్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల లో చాలా మంది ప్రాణాలను కోల్పోయినందుకు శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఇద్దరు నేత లు యూక్రేన్ లో వర్తమాన స్థితి సహా ఇటీవల చోటు చేసుకొన్న వివిధ భౌగోళిక, రాజకీయ ఘటనల పై విస్తృతంగా చర్చించారు. వారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ద్వైపాక్షిక సహకారపూర్వక కార్యక్రమల ను కూడా సమీక్షించారు.
శ్రీ బెనెట్ కు అతి త్వరలో భారతదేశం లో స్వాగతం పలకాల ని తనకు ఉత్సుకత గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.


