గౌరవనీయ మొహ్మద్ అష్రఫ్ ఘనీ మధ్య టెలిఫోన్ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు గౌరవనీయ మొహ్మద్ అష్రఫ్ ఘనీతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఇద్దరు నాయకుల మధ్య, వారి దేశాల మధ్యగల సుహృద్భావం, సౌహార్దత, సత్సంబంధాలను ప్రతిబింబిస్తూ ఈ సంభాషణ సాగింది. దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ప్రాథమిక ఫలితాల ప్రకటనపై ప్రధానమంత్రి మోదీ- ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఘనీకి అభినందనలు తెలిపారు. ఎన్నికలు విజయవంతంగా పూర్తికావడంపై ఆఫ్ఘన్ ప్రజలను కూడా ప్రధానమంత్రి అభినందించారు. అలాగే వెంటాడే సవాళ్లను ఎదుర్కొంటూ ఆఫ్ఘనిస్థాన్‘లో ప్రజాస్వామ్య మూలాల బలోపేతం దిశగా తదుపరి ప్రక్రియకు సిద్ధం కావడంపైనా అభినందనలు తెలియజేశారు.

ఏకీకృత, సార్వభౌమ, ప్రజాస్వామ్య, సౌభాగ్య, శాంతియుత ఆఫ్ఘనిస్థాన్ కోసం సన్నిహిత మిత్రుడుగా, పొరుగుదేశంగా భారత్ కట్టుబాటును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. అలాగే దేశంలో ఆఫ్ఘన్ నాయకత్వాన-ఆఫ్ఘన్ సొంత-ఆఫ్ఘన్ నియంత్రిత సార్వజనీన శాంతి ప్రక్రియకు భారత సూత్రబద్ధ మద్దతును కూడా ఆయన స్పష్టీకరించారు. ఆఫ్ఘనిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామిగా ఆ దేశ అభివృద్ధికి, భద్రత మెరుగుకు, మన ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ తన సన్నిహిత సహకారాన్ని కొనసాగిస్తుందని కూడా ఆయన చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్‘లో ప్రగతికి, ప్రజాస్వామ్యానికి నిరంతరం మద్దతిస్తున్నందుకుగాను భారత ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి, ప్రజలకు అధ్యక్షుడు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య అన్నిరకాల సహకారాన్ని బలోపేతం చేయాలన్న తన ఆకాంక్షను ఆయన ప్రస్ఫుటం చేశారు. కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో నాయకులిద్దరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పరస్పర వెసులుబాటు మేరకు త్వరలో భారత సందర్శనకు రావాల్సిందిగా ప్రధానమంత్రి పలికిన సాదర ఆహ్వానాన్ని ఘనీ అంగీకరించారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How India’s Rs 175 crore Diving Support Craft projects strengthen Navy’s underwater capabilities

Media Coverage

How India’s Rs 175 crore Diving Support Craft projects strengthen Navy’s underwater capabilities
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026