సేవా సంకల్ప ప్రతిపాదన

Published By : Admin | February 24, 2026 | 16:53 IST
భారత అభివృద్ధి ప్రయాణంలో నూతన శకం
‘సేవా తీర్థ్’లో మంత్రివర్గ మొదటి సమావేశం

యుగాబ్ద 5127,
విక్రమ సంవత్సరం 2082,
శక సంవత్సరం 1947,
ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం,
అష్టమి,
2026, ఫిబ్రవరి 24న
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ‘సేవా తీర్థ్’లోని ప్రధానమంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి వర్గ మొదటి సమావేశం జరుగుతుంది.
సరికొత్త భారతావిష్కరణకు ఈ సమావేశం, ఈ భవనం ప్రతిరూపం. ఈ శుభారంభంతో శతాబ్దాల శ్రమ పునాదిగా నిర్మితమైన భవిష్యత్తును స్వాగతిస్తున్నాం. స్వాతంత్ర్య అనంతరం అనేక దశాబ్దాల పాటు సౌత్ బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయం ఆ వారసత్వాన్ని కొనసాగించింది. భవిష్యత్తు ఆకాంక్షలకు ఊతమిచ్చింది. స్వదేశీ ఆలోచనలున్న, ఆధునికమైన, అపరిమిత సామర్థ్యం కలిగిన భారతదేశాన్ని మేం ఊహిస్తున్నాం. ఆ ఆకాంక్షకు సేవా తీర్థ్ వాస్తవరూపంగా నిలుస్తోంది. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత ఖ్యాతిని విస్తరింపజేస్తోంది.
ఈ సందర్భంలో ఈ ప్రదేశానికున్న చరిత్రను మనం స్మరించుకోవాలి. బ్రిటిష్ కాలం నాటి తాత్కాలిక సైనిక నివాసాలున్న చోట ‘సేవా తీర్థ్’ను నిర్మించాం. స్తబ్దుగా ఉన్న ఆ శిబిరాల ప్రదేశాన్ని దేశ పరిపాలనకు సంబంధించిన ఒక క్రియాశీలక సంస్థ నిర్మాణానికి వినియోగించడం నవ భారత పునర్వైభవానికి చిహ్నం.
వలస పాలనకు ముందు- సంపదకూ, మానవతా విలువలకూ రెండిటికీ భారత్ ప్రసిద్ధి చెందింది. ఈ ఆదర్శాలే సేవా తీర్థ్ అనే భావనకు స్ఫూర్తి. కర్తవ్యం, సేవ, అంకితభావాలు ఈ కార్యాలయాన్ని పుణ్యక్షేత్రమంత పవిత్రంగా మారుస్తాయని ఆకాంక్షిస్తున్నాం.
‘సేవాతీర్థ్’లో తీసుకొనే ప్రతి నిర్ణయం 1.4 బిలియన్ల మంది పౌరులకు సేవ చేయాలనే స్ఫూర్తితో నిండి ఉంటుంది. దేశ నిర్మాణమనే విస్తృత లక్ష్యానికి అనుసంధానమై ఉంటుంది. ఈ సంకల్పాన్ని ఇక్కడ జరుగుతున్న మొదటి సమావేశం ద్వారా కేంద్ర మంత్రిమండలి తన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తోంది.
మన నైతిక నిబద్ధతకు నిదర్శనమే రాజ్యాంగ విలువలు. ఇవి పరిపాలనను పౌరుల గౌరవం, సమానత్వం, న్యాయంతో అనుసంధానిస్తాయి. ‘సేవా తీర్థ్’లో పని సంస్కృతికి ఈ స్ఫూర్తే మార్గనిర్దేశం అందిస్తుంది. ఇక్కడ రూపొందించే ప్రతి విధానం రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుంది. ఇక్కడ తీసుకొనే ప్రతి నిర్ణయం ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా ఉంటుంది.
ఈ సౌధంలో ‘పౌర దేవో భవ’ మంత్రమే స్ఫూర్తిగా ప్రతి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రిమండలి పునరుద్ఘాటించింది. ఈ ప్రదేశం అధికార ప్రదర్శన కేంద్రంగా కాకుండా, ప్రతి భారతీయుడి సాధికారత కేంద్రకంగా పనిచేస్తుంది. “సేవాతీర్థ్‌’ నుంచి సాగే పాలనలో ప్రతి నిర్ణయం సమాజంలోని చివరి అంచెలోగల వ్యక్తి జీవితాన్ని సరళం చేసే లక్ష్యంతో అనుసంధానితమై ఉంటుంది. పారదర్శకంగా, ఎరుకతో, పౌరుల సమస్యలపై అవగాహన సహితంగా పాలన నమూనా బలోపేతంపై మా నిబద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం.
జడత్వాన్ని చైతన్యంతో, ఉదాసీనతను అంకితభావంతో, సందేహాలను పరిష్కారాలతో వదిలించే పాలన పరమైన మౌలిక సదుపాయాలకు ‘సేవాతీర్థ్‌’ ఒక సమాధానం.
ఈ దృక్కోణంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన ఇటీవలి కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాలు పాలన సంకల్పంపై సరికొత్తగా స్పష్టతనిచ్చాయి. పాలనపై ప్రజల నమ్మకం బలోపేతమైందని చెప్పడానికి కోట్లాది పౌరుల జీవితాల్లో వచ్చిన మార్పులే నిదర్శనం.
గడచిన దశాబ్ద కాలంలో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరిక విముక్తులయ్యారు. తద్వారా ఒకనాడు అసాధ్యమని భావించిన దాన్ని నేడు దేశం సుసాధ్యం చేయగలిగింది. ఇటువంటి విజయాల వెనుక ప్రభుత్వ దూరదృష్టి, సమగ్ర అవగాహన, అవిశ్రాంత కృషి అపారం. ఆయుష్మాన్ భారత్ పథకంతో కోట్లాది పేదల ఆరోగ్య భద్రతకు భరోసా లభించింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద దాదాపు 80 కోట్ల మంది పేదలకు ఆహార భద్రత సాకారమై, ఆకలి శాపం నుంచి విమోచన లభించింది స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12 కోట్లకుపైగా మరుగుదొడ్ల నిర్మాణంతో కోట్లాది కుటుంబాలు.. ముఖ్యంగా మహిళలకు ఆత్మగౌరవ రక్షణ లభించింది. ఈ గణాంకాలన్నీ పాలన దిశను ప్రతిబింబిస్తాయి... అంటే- పౌర జీవన సౌలభ్య కల్పనే విధానాల అంతిమ లక్ష్యం.
అలాగే, 4 కోట్లకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణంతో లక్షలాది కుటుంబాలకు గృహవసతి, భద్రత సమకూరాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 12 కోట్ల మంది పౌరులకు తాగునీటి సౌకర్యం కలిగింది.
భారత ఆర్థిక వ్యవస్థ రూపాంతరీకరణను ఒక నిరంతర సంస్కరణాత్మక ప్రస్థానంగా కేంద్ర మంత్రిమండలి పరిగణిస్తోంది. కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన తారకమంత్రంగా, జీఎస్‌టీ, డీబీటీ, డిజిటల్ ఇండియా వంటి సంస్కరణలు పాలనను మరింత పారదర్శకం, సమర్థం, పౌర కేంద్రకంగా రూపుదిద్దాయి. హాజరీ రహిత పన్ను అంచనా ప్రక్రియ నిజాయితీని ప్రోత్సహిస్తూ, పౌరుల విశ్వాసాన్ని బలోపేతం చేసింది. ఇన్ని రకాలుగా సాగుతున్న కృషి ఫలితంగా భారత్‌ నేడు ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో బలమైన స్థానం సముపార్జించింది.
'సేవా తీర్థ్' అందించే నూతన శక్తితో, వేగవంతమైన 'సంస్కరణల ఎక్స్‌ప్రెస్' వేగంతో భారత్ సమీప భవిష్యత్తులోనే ప్రపంచంలోని మూడు అగ్రగామి ఆర్థిక వ్యవస్థల సరసన నిలుస్తుందని కేబినెట్ తీర్మానించింది.
'2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్' దిశగా నేడు పునరంకితం అవుతున్నట్లు కేబినెట్ ప్రకటించింది. దేశానికి చెందిన దీర్ఘకాలిక ప్రయాణం. ఇక్కడ ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్తును రూపొందిస్తాయి. అభివృద్ధి లక్ష్యం ఎంత పెద్దదైతే, మన బాధ్యత అంత లోతుగా ఉండాలని 'సేవా తీర్థ్'లో జరిగిన ఈ మొదటి సమావేశం మనకు గుర్తు చేస్తుంది.
ఈ భవన సముదాయం కేవలం ఆధునిక కార్యస్థలం మాత్రమే కాదు. ఇది పాలనలో నూతన పని సంస్కృతికి చిహ్నం. ఆధునిక సాంకేతికత, సమర్థమైన ప్రక్రియల ద్వారా ప్రభావవంతమైన ప్రభుత్వ పనితీరు కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి ముందుకు కదిలే ప్రతి దస్త్రం... ఇక్కడ పనిచేసే ప్రతి కర్మయోగి... దేశంలోని అన్ని ప్రాంతాల పౌరుల జీవితాన్ని సరళీకృతం చేయాలనే లక్ష్యంతో స్పూర్తి పొందుతారు. వనరులను వివేకంతో ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలని, ఇటీవలి సంవత్సరాల్లో దేశం అమలు చేసిన సంస్కరణల నిరంతర ప్రయాణాన్ని వేగవంతం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
భారత్ ఈ రోజు అద్భుత పరివర్తనను సాధించడంలో కీలక మలుపు వద్ద ఉందనే నమ్మకాన్ని ఈ మొదటి సమావేశం మరింత బలపరుస్తుంది. ఇక్కడి విధానం, ఉద్దేశం, నాయకత్వం అభివృద్ధి చెందిన భారత్ దిశగా ముందుకు సాగుతున్నాయి. 'సేవా తీర్థ్' నుంచి కొనసాగే కొత్త పని సంస్కృతి... సమర్థమైన, సాధికారిక, స్వయం-సమృద్ధ దేశంగా భారత్ పురోగతికి పునాదిగా మారుతుంది.
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో 'సేవా తీర్థ్'ను సున్నితమైన, జవాబుదారీతనం గల, పౌర కేంద్రిత పాలనకు ప్రపంచస్థాయి ఉదాహరణగా నిలపడం పట్ల తమ నిబద్ధతను కేంద్ర కేబినెట్ పునరుద్ఘాటిస్తోంది. 2047 నాటికి భారత్‌ను సుసంపన్నమైన, సమర్థమైన, స్వయం-సమృద్ధి గల దేశంగా మార్చే ఈ ప్రయాణంలో ఈ భవన సముదాయం జాతీయ ఆకాంక్షలకు శక్తిమంతమైన కేంద్రంగా మారుతుందని మంత్రివర్గం ఆకాంక్షించింది

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rs 6,000 Crore Earned, 12.33 Crore Sq Ft Freed: Inside Government's Big Clean-Up

Media Coverage

Rs 6,000 Crore Earned, 12.33 Crore Sq Ft Freed: Inside Government's Big Clean-Up
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 ఆగష్టు 2026
August 24, 2026

Beyond Announcements: Real Milestones Proving India’s Rise Across Defence, Tech & Economy Under the Leadership of PM Modi