అజరామరమైన వేద జ్ఞానాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
"ఊర్ధ్వమూలమదఃశాఖమాశ్వత్థం ప్రాహురవ్యయమ్
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్"
"ఈ జగత్తు శాశ్వతమైన రావిచెట్టు వంటిది. దాని వేర్లు పైభాగంలో, శాఖలు కిందకి విస్తరించి ఉంటాయి. వేదాలు ఆకుల వంటివి. అటువంటి ఈ జగత్ వృక్ష స్వరూపాన్ని యథార్థంగా గ్రహించిన వారే నిజమైన జ్ఞానులు" అని ఈ సుభాషితం తెలియజేస్తుంది.
జ్ఞానదీపం.. అజ్ఞానమనే చీకటిని తొలగించటమే కాక, యావత్ ప్రపంచానికి వెలుగునిస్తుందని, మహర్షి దయానంద సరస్వతి గారే ఇందుకు సజీవ నిదర్శనమని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"జ్ఞానదీపం.. అజ్ఞానమనే చీకటిని తొలగించటమే కాకుండా, సమస్త జగత్తును ప్రకాశింపజేస్తుంది. మహర్షి దయానంద సరస్వతి గారి దివ్యమైన వ్యక్తిత్వం దీనికి సజీవ నిదర్శనం.
ज्ञान का दीपक ना केवल अज्ञानता के अंधकार को मिटाता है, बल्कि समस्त जगत को आलोकित भी करता है। महर्षि दयानंद सरस्वती जी का दिव्य व्यक्तित्व इसका साक्षात उदाहरण है।
— Narendra Modi (@narendramodi) February 12, 2026
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम्।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्।। pic.twitter.com/GdH2fKj1xf


